ప్రతి 5 నిమిషాలకు ఒక ఫోర్డ్ ఫిగో విక్రయం!

By Ravi

ఫోర్డ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న బుజ్జి కారు ఫోర్డ్ ఫిగో 3,00,000 సేల్స్ మార్కును తాకినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గడచిన మార్చ్ 2010లో భారత మార్కెట్లో విడదలైన ఫోర్డ్ ఫిగో అతి తక్కువ కాలంలోనే 3 లక్షల మైలురాయిని చేరుకోవటం విశేషం. ఇది మార్కెట్లో విడుదలైన 3వ సంవత్సరంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఫిగో చొప్పున అమ్ముడుపోయింది.

ఇండియాస్ మోస్ట్ డిపెండబల్ ప్రీమియం కాంపాక్ట్ వెహికల్‌ కోసం జెడి పవర్ నిర్వహించిన 2013 జెడి పవర్ ఆసియా పసిఫిక్ వెహికల్ డిపెండబిలిటీ స్టడీ (విడిఎస్)లో ఫోర్డ్ ఫిగోకు అత్యధిక శాతం ఓట్లు లభించాయి. గతేడాది అక్టోబర్ నెలలో ఫోర్డ్ ఇండియా తమ ఫిగో‌ను అప్‌గ్రేడ్ చేసి కొత్త వెర్షన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ మోడల్ అమ్మకాలు మరింత పెరిగాయి.


ఫోర్డ్ ఫిగో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1196సీసీ 16-వాల్వ్ డిఓహెచ్‌సి, సీక్వెన్షియల్ ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎస్ఈఎఫ్ఐ) ఇంజన్‌ గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 102 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1399సీసీ 8-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి, కామన్ రెయిల్ ఇంజన్‌ 69 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వెర్షన్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో లభ్యమవుతాయి.

విశాలమైన ఇంటీరియర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్టీరింగ్ వీల్‌పై ఏర్పాటు చేయబడిన ఆడియో కంట్రోల్స్, మరింత విశాలమైన బూట్ స్పేస్, ఆకర్షనీయమైన అల్లాయ్ వీల్స్, బెస్ట్ ఇన్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్, ప్యాసింజర్‌ల కోసం డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి ప్రధాన ఫీచర్లు ఫోర్డ్ ఫిగో సొంతం.

More from DriveSpark

Article Published On: Thursday, August 8, 2013, 10:17 [IST]
English summary
Ford India's best selling hatchback Ford Figo has reached 3 lakh sales milestone. New Figo that comes with a host of enhanced features and substantially packaged style, performance and value-for-money. All set to make heads turn, Figo comes in two new striking colours; ‘Kinetic Blue’ and ‘Bright Yellow’.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+