కొత్త ఫోర్డ్ ఫిగో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ధరలు

By Ravi

ఎప్పటికప్పుడు మారుతున్న వినియోగాదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులును అందించేందుకు కార్ కంపెనీలు కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. ఈకోవలోనే అమెరికాకు చెంగిన కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా కూడా తమ చిన్న కారు ఫిగోలో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. పాత ఫిగోతో పోల్చుకుంటే కొత్త ఫిగోలో సుమారు 100 మార్పులు చేయటం జరిగింది. కొత్త ఫోర్డ్ ఫిగోలో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు ఇలా ఉన్నాయి:

* సరికొత్త డిజైన్: హెక్సాగనల్ గ్రిల్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌ని కలిగి ఉండి, మంచి ఏరోడైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.
* ఉత్తమ పెర్ఫామెన్స్: కారును మూవ్ చేసిన కొద్ది సెకండ్లలోనే అధిక యాక్సిలరేషన్ కలిగి ఉండి, మంచి పికప్‌ను ఇచ్చేందుకు గాను ఫోర్డ్ ఫిగోలోని ఇంజన్‌ను రీట్యూన్ చేయటం జరిగింది. ఇప్పుడు గేర్ షిఫ్టింగ్‌ మరింత సున్నితంగా ఉంటుంది.
* ప్రశాంతమైన క్యాబిన్: డోర్లపై అమర్చిన కొత్త డుబుల్ బల్బ్ వెథర్ స్ట్రిప్స్ క్యాబిన్‌ లోపలి వైపు నాయిస్‌, వైబ్రేషన్, హార్షనెస్ (ఎన్‌విహెచ్) లను తగ్గించి, క్యాబిన్ లోపల ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తాయి.
* స్టీరింగ్‌పై ఏర్పాటు చేసిన రేడియో కంట్రోల్స్: డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లు స్టీరింగ్‌పై తమ చేతుల్ని తీయాల్సిన అవసరం లేకుండానే ఆడియోను, టెలిఫోన్ కాల్స్‌ను కంట్రోల్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ మౌంటెడ్ రేడియో కంట్రోల్స్ డ్రైవింగ్‌లో మంచి సౌకర్యాన్ని కల్పిస్తాయి.
* ఉత్తమ సౌకర్యం: మెరుగపరచబడిన లుంబార్ సపోర్ట్, హెడ్ రెస్ట్ అడ్జస్ట్‌మెంట్‌లతో మంచి సీటింగ్ సౌకర్యం ఉంటుంది.
* బంపర్ ఇంటర్‌ఫేస్ వద్ద కొత్త డిజైన్‌తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్స్: ఈ సరికొత్త హెడ్‌ల్యాంప్స్ పెద్ద రిఫ్లెక్టివ్ సర్ఫేస్‌ను కలిగి ఉండి, మంజి విజబిలిటీని ఆఫర్ చేస్తాయి.
* రిఫ్రెష్డ్ టెయిల్ ల్యాంప్స్: కొత్తగా డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ కారుకు మరింత స్టయిలిష్ లుక్‌నివ్వటమే కాకుండా రాత్రివేళల్లో మంచి విజబలిటీని కూడా ఆఫర్ చేస్తాయి.
* కొత్త 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వీల్ కవర్ డిజైన్స్: టైటానియం వేరియంట్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇతర వేరియంట్లలో అందిస్తున్న వీల్ కవర్స్ మీ ఫోర్డ్ ఫిగోకు మరింత స్పోర్టీ లుక్‌ని తెచ్చిపెట్టనున్నాయి.
* రెండు కొత్త రంగులు: కొత్త ఫోర్డ్ ఫిగోలో కంపెనీ కైనకెటిక్ బ్లూ, బ్రైట్ యెల్లో అనే రెండు కొత్త రంగులను పరిచయం చేసింది.

ఫోర్డ్ ఫిగో - ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ ఫిగో - ఫోర్డ్ ఫిగో

* కొత్త హెడ్‌ల్యాంప్స్ - ఈ సరికొత్త హెడ్‌ల్యాంప్స్ పెద్ద రిఫ్లెక్టివ్ సర్ఫేస్‌ను కలిగి ఉండి, మంజి విజబిలిటీని ఆఫర్ చేస్తాయి.

సరికొత్త ఫ్రంట్ డిజైన్:

సరికొత్త ఫ్రంట్ డిజైన్:

* సరికొత్త ఫ్రంట్ డిజైన్ - హెక్సాగనల్ గ్రిల్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌ని కలిగి ఉండి, మంచి ఏరోడైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఫోర్డ్ ఫిగ - ప్రశాంతమైన క్యాబిన్

ఫోర్డ్ ఫిగ - ప్రశాంతమైన క్యాబిన్

* ప్రశాంతమైన క్యాబిన్ - డోర్లపై అమర్చిన కొత్త డుబుల్ బల్బ్ వెథర్ స్ట్రిప్స్ క్యాబిన్‌ లోపలి వైపు నాయిస్‌, వైబ్రేషన్, హార్షనెస్ (ఎన్‌విహెచ్) లను తగ్గించి, క్యాబిన్ లోపల ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తాయి.

ఫోర్డ్ ఫిగో - రిఫ్రెష్డ్ టెయిల్ ల్యాంప్స్

ఫోర్డ్ ఫిగో - రిఫ్రెష్డ్ టెయిల్ ల్యాంప్స్

* రిఫ్రెష్డ్ టెయిల్ ల్యాంప్స్ - కొత్తగా డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్ కారుకు మరింత స్టయిలిష్ లుక్‌నివ్వటమే కాకుండా రాత్రివేళల్లో మంచి విజబలిటీని కూడా ఆఫర్ చేస్తాయి.

ఫోర్డ్ ఫిగో - 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్

ఫోర్డ్ ఫిగో - 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్

* కొత్త 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, వీల్ కవర్ డిజైన్స్ - టైటానియం వేరియంట్‌లో కంపెనీ ఆఫర్ చేస్తున్న 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇతర వేరియంట్లలో అందిస్తున్న వీల్ కవర్స్ మీ ఫోర్డ్ ఫిగోకు మరింత స్పోర్టీ లుక్‌ని తెచ్చిపెట్టనున్నాయి.

ఫోర్డ్ ఫిగో - రెండు కొత్త రంగులు

ఫోర్డ్ ఫిగో - రెండు కొత్త రంగులు

* రెండు కొత్త రంగులు - కొత్త ఫోర్డ్ ఫిగోలో కంపెనీ కైనకెటిక్ బ్లూ, బ్రైట్ యెల్లో అనే రెండు కొత్త రంగులను పరిచయం చేసింది.

ఫోర్డ్ ఫిగో - సేఫ్టీ ఫీచర్లు

ఫోర్డ్ ఫిగో - సేఫ్టీ ఫీచర్లు

* డ్రైవర్, ప్యాసింజర్‌ల కోసం డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్

* ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్)

ఫోర్డ్ ఫిగో - బూట్ స్పేస్

ఫోర్డ్ ఫిగో - బూట్ స్పేస్

* బూట్ స్పేస్ - కొత్త ఫోర్డ్ ఫిగో విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉండి మంచి లగేజ్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే వారికి ఇది మంచి సౌకర్యాన్ని అందిస్తుంది.

ఫోర్డ్ ఫిగో - బ్లూటూత్ కనెక్టివిటీ

ఫోర్డ్ ఫిగో - బ్లూటూత్ కనెక్టివిటీ

* బ్లూటూత్ కనెక్టివిటీ - కొత్త 2012 ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్‌తో లభిస్తుంది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్లు స్టీరింగ్‌పై తమ చేతుల్ని తీయాల్సిన అవసరం లేకుండానే ఆడియోను, టెలిఫోన్ కాల్స్‌ను కంట్రోల్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన స్టీరింగ్ మౌంటెడ్ రేడియో కంట్రోల్స్ డ్రైవింగ్‌లో మంచి సౌకర్యాన్ని కల్పిస్తాయి.

ఫోర్డ్ ఫిగో - బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి

ఫోర్డ్ ఫిగో - బెస్ట్ ఇన్ క్లాస్ ఏసి

* బెస్ట్ ఇన్ క్లాస్ ఎయిర్ కండిషనింగ్ - కొత్త ఫోర్డ్ ఫిగోలో ఈ శ్రేణిలో కెల్లా ఉత్తమమైన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది లోపల కూర్చునే ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.


కొత్త ఫోర్డ్ ఫిగో వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ పెట్రోల్ ఎల్ఎక్స్ఐ - రూ. 3,84,999
  • ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ పెట్రోల్ ఈఎక్స్ఐ - రూ. 4,22,999
  • ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ పెట్రోల్ జెడ్ఎక్స్ఐ - రూ. 4,52,999
  • ఫోర్డ్ ఫిగో 1.2 డ్యురాటెక్ పెట్రోల్ టైటానియం - రూ. 5,01,999
  • ఫోర్డ్ ఫిగో 1.4 డ్యురాటార్క్ డీజిల్ ఎల్ఎక్స్ఐ - రూ. 4,81,999
  • ఫోర్డ్ ఫిగో 1.4 డ్యురాటార్క్ డీజిల్ ఈఎక్స్ఐ - రూ. 5,20,999
  • ఫోర్డ్ ఫిగో 1.4 డ్యురాటార్క్ డీజిల్ జెడ్ఎక్స్ఐ - రూ. 5,50,999
  • ఫోర్డ్ ఫిగో 1.4 డ్యురాటార్క్ డీజిల్ టైటానియం - రూ. 5,99,999

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కొత్త ఫోర్డ్ ఫిగో పెట్రోల్ ఇంజన్:
పెట్రోల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1196సీసీ 16-వాల్వ్ డిఓహెచ్‌సి, సీక్వెన్షియల్ ఎలక్ట్రిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఎస్ఈఎఫ్ఐ) ఇంజన్‌ గరిష్టంగా 71 పిఎస్‌ల శక్తిని, 102 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త ఫోర్డ్ ఫిగో డీజిల్ ఇంజన్:
డీజిల్ వెర్షన్ ఫిగోలో ఉపయోగించిన 1399సీసీ 8-వాల్వ్ ఎస్ఓహెచ్‌సి, కామన్ రెయిల్ ఇంజన్‌ 69 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో లభ్యమవుతాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 16, 2012, 20:02 [IST]
English summary
Change is fun, change is exciting, change is surprising change is here! And this time, it’s arriving on 4 wheels! Ford India has introduced the New Figo that comes with a host of enhanced features and substantially packaged style, performance and value-for-money. All set to make heads turn, Figo comes in two new striking colours; ‘Kinetic Blue’ and ‘Bright Yellow’.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+