హుర్రే.. తిరిగి ప్రారంభమైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బుకింగ్స్
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఓ తీపి కబురు. గతంలో అధిక డిమాండ్ కారణంగా ఈకోస్పోర్ట్ కోసం బుకింగ్‌లను నిలిపివేసిన ఫోర్డ్ ఇండియా, ఇప్పుడు ఈ మోడల్ కోసం తిరిగి బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అన్ని వేరియంట్ల ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను రీ-ఓపెన్ చేశామని ఫోర్డ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ
వాస్తవానికి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి, భారత మార్కెట్లో విడుదలకు కాక ముందు నుంచే మంచి డిమాండ్‌ను సంపాధించుకోగలిగింది. ఆకర్షనీయమైన డిజైన్, సాటిలేని పెర్ఫార్మెన్స్, స్మార్ట్ టెక్నాలజీ, సరసమైన ధర వంటి అనేక అంశాలతో ఇది కొనుగోలుదారులను తొలి చూపులోనే ఆకట్టుకుంటుంది.
ఫోర్డ్ ఈకోస్పోర్ట్ బుకింగ్స్ గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్) వినయ్ పిపార్సానియా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 50,000 యూనిట్లకు పైగా ఈకోస్పోర్ట్ వాహనాలను డెలివరీ చేశామని, ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్‌ను కూడా తగ్గించామని, మరింత మంది కొత్త కస్టమర్లు ఈకోస్పోర్ట్‌ను బుక్ చేసుకునేందుకు బుకింగ్స్ రీ-ఓపెన్ చేశామని తెలిపారు.


Click it and Unblock the Notifications









