3 రోజుల్లో 3000 బుకింగ్స్ దక్కించుకున్న మారుతి సియాజ్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మరికొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్న తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్' (Ciaz) కోసం కంపెనీ సెప్టెంబర్ 3, 2014వ తేది నుంచే బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ మోడల్ కోసం ఇప్పటికే ఈ 3 రోజుల్లో దేశవ్యాప్తంగా 3000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ పేర్కొంది.
ఈ 3 రోజుల సమయంలో ఈ కారు కోసం విచారణ చేయటానికి వచ్చిన కస్టమర్ల సంఖ్య 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంది. కేవలం రూ.21,000 అడ్వాన్సు మొత్తంతో మారుతి సుజుకి డీలర్లు ఈ కారు కోసం బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులలో లభ్యం కానుంది.
దేశీయ విపణిలో మారుతి సుజుకి సియాజ్ ధరలు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. మారుతి సుజుకి సియాజ్ ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్స్, మైలేజ్ తదితర వివరాలను తెలుసుకునేందుకు ఈ లింకుపై లేదా క్రింది ఫొటోపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









