లిమిటెడ్ ఎడిషన్ 'స్విఫ్ట్ స్టార్‌'ను విడుదల చేసిన మారుతి

By Ravi

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా స్విఫ్ట్ కార్లు అమ్ముడు కావటంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకి ఇందులో 'స్విఫ్ట్ స్టార్' అనే లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ స్టార్‌లో మరిన్ని అదనపు ఫీచర్ల లభ్యం కానున్నాయి. మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ స్టార్‌లో బ్లూటూత్ సపోర్ట్‌తో కూడిన డబుల్ డిన్ స్టీరియో సిస్టమ్, ఆర్ట్ లెథర్ సీట్ కవర్, రియర్ రూఫ్ స్పాయిలర్, ఒక జత స్పీకర్లు, స్టీరింగ్ వీల్ కవర్, డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ ఫీచర్లు అదనంగా లభించనున్నాయి.

Swift Star

లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ స్టార్‌లో యాంత్రిక పరంగా, డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతుంది. అయితే బేస్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ, ఎల్‌డిఐ) మరియు మిడిల్ వేరియంట్ (విఎక్స్ఐ, విడిఐ)లలో మాత్రమే స్విఫ్ట్ స్టార్ లిమిటెడ్ ఎడిషన్ లభిస్తుంది. ఈ మోడల్ ధరలు ఇలా ఉన్నాయి:
  • మారుతి సుజుకి స్విఫ్ట్ స్టార్ ఎల్ఎక్స్ఐ - రూ.4.77 లక్షలు
  • మారుతి సుజుకి స్విఫ్ట్ స్టార్ విఎక్స్ఐ - రూ.5.20 లక్షలు
  • మారుతి సుజుకి స్విఫ్ట్ స్టార్ ఎల్‌డిఐ - రూ.5.78 లక్షలు
  • మారుతి సుజుకి స్విఫ్ట్ స్టార్ విడిఐ - రూ.6.33 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, థానే)

More from DriveSpark

Article Published On: Saturday, March 23, 2013, 10:36 [IST]
English summary
Maruti Suzuki has launched the limited edition Swift Star to celebrate over 30 lakh Swifts sold worldwide. The new Swift Star comes with a double-DIN stereo with Bluetooth, art leather seat covers, a rear roof spoiler, steering wheel cover and designer floor mats.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+