ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్మకం

By Ravi

స్విఫ్ట్ కారు అందాన్ని చూసి మెచ్చుకోని వారంటు ఎవరైనా ఉండరేమో. ఈ సెగ్మెంట్లోకి కొత్తగా ఎన్ని కార్లు వచ్చినప్పటికీ, స్విఫ్ట్ కారును ఏవీ కూడా ఓవర్‌టేక్ చేయలేకపోయాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. సుజుకి 2004లో జపాన్‌లో స్విఫ్ట్ కారును విడుదల చేయగా, భారత్‌లో 2005 నుంచి స్విఫ్ట్ ఉత్పత్తి ప్రారంభమైంది.

ప్రస్తుతం సుమారు 120కు పైగా దేశాల్లో స్విఫ్ట్ కారు లభ్యమవుతోంది. మన దేశంలో మాత్రమే స్విఫ్ట్ కారు సెడాన్ రూపంలో కూడా లభ్యమవుతోంది. విదేశాల్లో స్విఫ్ట్ స్పోర్ట్ వేరియంట్ (టూ-డోర్ వెర్షన్) కూడా లభిస్తోంది. మొత్తమ్మీద ఈ 8 ఏళ్ల కాలంలో 30 లక్షలకు పైగా స్విఫ్ట్ కార్లను సుజుకి విక్రయించింది. స్విఫ్ట్ ఈ ఎనిదేళ్ల చరిత్రలో అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. భారత్‌లో మారుతి సుజుకి మొత్తం అమ్మకాల్లో సగటున ప్రతి నెలా 17,000 యూనిట్లను విక్రయిస్తుంది.

భారత మార్కెట్లో మారుతి సుజుకికి ఆల్టో తర్వాత స్విఫ్ట్ కారే బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. దేశీయ విపణిలో ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. మన మార్కెట్లో స్విఫ్ట్ ధరలు రూ.4.5 లక్షల నుంచి రూ.6.7 లక్షల రేంజ్‌లో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా స్విఫ్ట్ అమ్మకాలు భారీగా పుంజుకున్నాయి. 2008లో స్విఫ్ట్ గ్లోబల్ సేల్స్ 10 లక్షల మార్కును, 2011లో 20 లక్షల మార్కును, జనవరి 2013లో 30 లక్షల మార్కును తాకాయి. చిన్న కార్లకు, అధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్లకు డిమాండ్ పెరగటం వలనే ఈ మోడల్ అమ్మకాలు ఇంత భారీ స్థాయిలో జోరందుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 31, 2013, 17:53 [IST]
English summary
The Maruti Suzuki Swift has been one of the hottest selling compact hatchback in India. Launched way back in 2004, the Suzuki Swift has impressed people from across the globe with its distinctive looks, handling, performance and price. It was India's second highest selling car in 2012. It has also been performing well in other global markets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+