2013 స్కొడా ఆక్టావియా విడుదల: ధర రూ.13.95 లక్షలు
కొత్త ఆక్టావియా కోసం ఎదురుచూస్తున్న స్కొడా ప్రియుల ఎదురుచూపులు నేడు (అక్టోబర్ 3, 2013) ఫలించాయి. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా తమ కొత్త 2013 స్కొడా ఆక్టావియా సెడాన్‌ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. మునపటి వెర్షన్ కన్నా మరింత మెరుగ్గా ఉండేలా అప్‌గ్రేడ్ చేసిన ఈ కొత్త ఆక్టావియా సెడాన్ ప్రారంభ ధర రూ.13.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
కొత్త 2013 స్కొడా ఆక్టావియా మూడు వేరియంట్లలో (యాక్టివ్, యాంబిషన్, ఎలిగాన్స్), పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో (1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్) లభ్యమవుతుంది. ఇందులో 1.4 లీటర్ పెట్రోల్ వెర్షన్ కేవలం మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. అలాగే 1.8 లీటర్ పెట్రోల్ వెర్షన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా, 2.0 లీటర్ డీజిల్ వెర్షన్ మాత్రం మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ఆప్షన్‌తో లభిస్తుంది.
అయితే, అన్ని స్కొడా ఆక్టావియా వేరియంట్లలో 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్, పవర్ విండోస్, ఏబిఎస్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, స్టీరింగ్ అడ్జస్ట్‌మెంట్, రిమోట్ లాకింగ్, రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లతో లభ్యం కానున్నాయి. 2013 స్కొడా ఆక్టావియా ధరలు, ఇతర వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.
ఇది కూడా చదవండి: 2013 స్కొడా ఆక్టావియా రివ్యూ

పెట్రోల్ వెర్షన్ ధరలు
స్కొడా ఆక్టావియా 1.4 లీటర్ పెట్రోల్, మ్యాన్యువల్
* యాక్టివ్ - రూ.13.95 లక్షలు
* యాంబిషన్ - రూ.14.95
స్కొడా ఆక్టావియా 1.8 లీటర్ పెట్రోల్, ఆటోమేటిక్
* యాక్టివ్ - రూ.18.25 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు
స్కొడా ఆక్టావియా 2.0 లీటర్ డీజిల్
* యాక్టివ్ - రూ.15.55 లక్షలు (మ్యాన్యువల్)
* యాంబిషన్ - రూ.16.55 లక్షలు (మ్యాన్యువల్)
* యాంబిషన్ - రూ.17.55 లక్షలు (ఆటోమేటిక్)
* ఎలిగాన్స్ - రూ.19.45 లక్షలు (ఆటోమేటిక్)
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్
కొత్త స్కొడా ఆక్టావియాలో 1.4 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

2.0 లీటర్ డీజిల్ ఇంజన్
డీజిల్ వెర్షన్ ఆక్టావియా విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ టిడిఐ (టర్బో) ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 148 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

పవర్‌ఫుల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్
ఇందులో చివరి ఇంజన్ ఆప్షన్ 1.8 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్. శక్తివంతమైన హైపెర్ఫామెన్స్ ఆక్టావియాను కోరుకునే వారి కోసం కంపెనీ ఈ ఇంజన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది గరిష్టంగా 177 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

2013 స్కొడా ఆక్టావియా రివ్యూ


Click it and Unblock the Notifications








