2013 స్కొడా ఆక్టావియా రివ్యూ: దీన్ని ఎందుకు కొనాలంటే..

మునపటి తరం ఆక్టావియాతో పోల్చుకుంటే, ఈ కొత్త ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది. స్కొడా ఆక్టావియాను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, మాకు ఓ అద్భుతమైన కారును నడుపుతున్న అనుభూతి కలిగి

By Super Admin

స్కొడా ప్రియులకు ఆక్టావియా కారు గురించి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ప్రీమియం సెడాన్ అంటే గుర్తొచ్చే కొన్ని పేర్లలో ఆక్టావియా కూడా ముందుండేది. అయితే, మారుతున్న కాలంతో పాటు ఆక్టావియా మారకపోవటం, కొనుగోలుదారులు పాత ఆక్టావియా వైపు చూడటమే మానేశారు. దీంతో, కంపెనీ ఇప్పుడు మరింత మెరుగైన '2013 స్కొడా ఆక్టావియా' (2013 Skoda Octavia)ను గడచిన నెలలో భారత్‌లో ప్రవేశపెట్టింది.

ఆగస్ట్ 10, 2013న స్కొడా ఆవిష్కరించిన 2013 ఆక్టావియా సెడాన్ వచ్చే నెలలో (అక్టోబర్ 3, 2013న) వాణిజ్య పరంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, స్కొడా ఇండియా మీడియా కోసం ఆక్టావియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొని ఈ ప్రీమియం సెడాన్‌ను టెస్ట్ డ్రైవ్ చేసింది. ప్రస్తుతం కంపెనీ విడుదల చేస్తున్న ఈ 2013 స్కొడా ఆక్టావియా 3వ తరానికి (థర్డ్ జనరేషన్) చెందినది.

మునపటి తరం ఆక్టావియాతో పోల్చుకుంటే, ఈ కొత్త ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది. స్కొడా ఆక్టావియాను టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, మాకు ఓ అద్భుతమైన కారును నడుపుతున్న అనుభూతి కలిగింది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి అత్యంత పాపులర్ అయిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేయబడిన కొత్త 2013 స్కొడా ఆక్టావియా, భారత మార్కెట్లో తిరిగి తన పూర్వ వైభవాన్ని సంపాదించుకుంటుందో లేదో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పరిశీలించండి.

ముందు మాట

ముందు మాట

ఆక్టావియా సెడాన్ విషయంలో కొనుగోలుదారులను నిరాశపరచిన స్కొడా ఇండియా, ఇప్పుడు తన తప్పు తెలుసుకొని తిరిగి కొనుగోలుదారులను అన్ని విధాలుగా సంతృప్తిపరచేందుకు సరికొత్త 2013 ఆక్టావియాతో ముందుకు వచ్చింది. మరి ఈ లేటెస్ట్ స్కొడా కారు కొనుగోలుదారుల అంచనాలకు తగినట్లుగా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే, తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

కొలతలు

కొలతలు

* పొడవు: 4659 మి.మీ.

* వెడల్పు: 1814 మి.మీ.

* ఎత్తు: 1416 మి.మీ.

* వీల్‌బేస్: 2688 మి.మీ.

* గ్రౌండ్ క్లియరెన్స్: 155 మి.మీ.

విశాలమైనది

విశాలమైనది

కొత్త స్కొడా ఆక్టావియాలో హైలైట్ ఏంటంటే, దీని పరిమాణమే. మునుపటి ఆక్టావియా కన్న పొడవుగా, వెడల్పుగా ఉండేలా కొత్త అక్టావియాను డిజైన్ చేశారు. వీల్‌బేస్ కూడా లారా సెడాన్ కన్నా 110 మి.మీ. ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎత్తు మాత్రం మునుపటి వెర్షన్ కాస్తంత తక్కువగా ఉంటుంది. మొత్తమ్మీద ఈ కొలతలను బట్టి గమనిస్తే, 2013 ఆక్టావియా విశాలమైన ఇంటీరియర్‌ స్పేస్‌ను కలిగి ఉండి, డ్రైవర్లకు/ప్రయాణికులకు సౌకర్యవంతమైన డ్రైవింగ్/ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్

ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్

ఆడి క్యూ3, గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్ వంటి కార్లను తయారు చేస్తున్న ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌‌ఫామ్‌పై కొత్త ఆక్టావియా కారును తయారు చేయటం వలన దీని మొత్తం బరువును చాలా వరకు తగ్గించడం సాధ్యమైంది. కొత్త ఆక్టావియా బరువు 1350 కేజీలు. దీని ఫిట్ అండ్ ఫినిషింగ్ చాలా చక్కగా ఉంటుంది. ఈ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ సేఫ్టీ, టెక్నాలజీ వంటి అంశాల్లో ఆక్టావియాను ఈ సెగ్మెంట్లోని ఇతర కార్ల కన్నా ముందుంచేలా చేసింది.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

కొత్త ఆక్టావియా స్లీక్ అడ్ షార్ప్‌గా కనిపిస్తుంది. ఈ కారును మరింత నిశితంగా గమనిస్తే, కొన్ని ఆడి సెడాన్లలోని పోలికలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఈ కారు వెడల్పుగా ఉన్నప్పటికీ, దీని తక్కువ ఎత్తు కారణంగా ఇది స్లిమ్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది.

ఫ్రంట్ ప్రొఫైల్

ఫ్రంట్ ప్రొఫైల్

కొత్త ఆక్టావియా ఫ్రంట్ డిజైన్‌ను గమనిస్తే, నిలువు వరుసలతో ఉండే (వెర్టికల్ లైన్) గ్రిల్, దాని చుట్టూ సన్నటి క్రోమ్ సరౌండింగ్ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. గ్రిల్‌కు క్రింద ఉన్న ఎయిర్‌‌డ్యామ్‌లో హారిజాంటల్ లైన్ (అడ్డు వరుసల) డిజైన్‌కు బదులుగా హనీకోంబ్ మెష్ డిజైన్‌ను చూడొచ్చు.

హెడ్‌‌ల్యాంప్స్

హెడ్‌‌ల్యాంప్స్

కొత్త ఆక్టావియా ఫ్రంట్ డిజైన్‌లో మరొక ప్రధాన మార్పుగా హెడ్‌లైట్స్‌, ఫాగ్ ల్యాంప్స్‌ను చెప్పుకోవచ్చు. ఈ రెండింటినీ పూర్తిగా రీడిజైన్ చేశారు. షార్ప్ ఎడ్జ్‌లతో కూడిన హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఈ యూనిట్ ప్రొజెక్టర్ స్టైల్ లైట్ బల్బులను కూడా సపోర్ట్ చేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో బై-జెనాన్ ల్యాంప్స్ ఆప్షన్ కూడా ఉంది.

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్

2013 స్కొడా ఆక్టావియాలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఆప్షన్ కూడా ఉంది. అయితే, ఇవి ఎలిగాన్స్ (టాప్-ఎండ్ వేరియంట్) వేరియంట్లో మాత్రమే లభిస్తాయి. యాంబిషన్ (మిడ్ వేరియంట్) వేరియంట్లో కేవలం డిఆర్ఎల్స్ మాత్రమే ఉంటాయి. యాక్టివ్ (ఎంట్రీ-లెవల్ వేరియంట్)లో డిఆర్ఎల్స్ కూడా లేవు.

రియర్ ప్రొఫైల్

రియర్ ప్రొఫైల్

ఆక్టావియా రియర్ డిజైన్‌ను సింపుల్ అండ్ క్లీన్‌గా ఉంచేలా కంపెనీ శ్రద్ధ తీసుకుంది. సరికొత్త రియర్ బంపర్, ఆకర్షనీయమైన బాడీ లైన్స్‌తో ఇది మంచి లుక్‌ను కలిగి ఉంటుంది. వెనుక నుంచి గమనిస్తే, సైలెన్సర్ దాదాపు కనిపించనట్లుగానే ఉంటుంది.

టెయిల్ ల్యాంప్

టెయిల్ ల్యాంప్

కొత్త ఆక్టావియా వెనుక వైపు 'C' షేపులో ఉండే టెయిల్ ల్యాంప్ క్లస్టర్, స్కొడా ర్యాపిడ్ సెడాన్లో ఉపయోగించిన టెయిల్ ల్యాంప్ మాదిరిగా అనిపిస్తుంది.

సైడ్ మిర్రర్స్

సైడ్ మిర్రర్స్

కొత్త ఆక్టావియా సెడాన్‌లో సైడ్ మిర్రర్స్ మరో ఆకర్షణగా చెప్పుకోవచ్చు. దాదాపు హై-ఎండ్ లగ్జరీ కార్లలో ఉండే విధంగా వీటిని డిజైన్ చేశారు. ఎక్కువ భాగం బాడీ కలర్, క్రింది భాగం బ్లాక్ కలర్ ఉండేలా డిజైన్ చేశారు. సైడ్ మిర్రర్స్‌పై ఎల్ఈడి వార్నింగ్ ల్యాంప్స్ మరొక ప్రత్యేకత. వీటిని యాంత్రికంగా కంట్రోల్ చేసే వెసలుబాటు కూడా ఉంది.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

అన్ని స్కొడా ఆక్టావియా వేరియంట్లలో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తాయి. అయితే, యాక్టివ్ వేరియంట్లో మాత్రం అల్లాయ్ వీల్స్ డిజైనే వేరేగా ఉంటుంది.

ఇంటీరియర్

ఇంటీరియర్

2013 స్కొడా ఆక్టావియా ఇంటీరియర్స్ మరీ అత్యంత విలాసవంతంగా అనిపించవు, అలాగని నాసిరకంగాను ఉండవు. ఈ సెగ్మెంట్లోని ఇతర సెడాన్లతో పోల్చుకుంటే, స్కొడా ఆక్టావియా ఇంటీరియర్స్ విశిష్టంగా ఉండటమే కాకుండా మంచి సౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఇంటీరియర్లలో అక్కడక్కడా ఉడ్ ఫినిష్, అల్యూమినియం ఫినిష్‌లను చూడొచ్చు. బీజ్ అండ్ బ్లాక్ డ్యూయెల్ టోన్ ఇంటీయర్ థీమ్ కంటికి ఇంపుగా అనిపిస్తుంది.

స్టీరింగ్ వీల్

స్టీరింగ్ వీల్

స్కొడా ఆక్టావియాల 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్‌పై కావల్సిన అన్ని కంట్రోల్స్‌ను అమర్చారు. మూడు వేరియంట్లలో కూడా స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఫీచర్ స్టాండర్డ్‌గా లభిస్తుంది.

ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్

ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్

ఇందులో డ్రైవర్ సీట్‌ను యాంత్రికంగా 12-రకాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు (12-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సీట్). ఇందులో సీట్ మెమరీ ఫీచర్ కూడా ఉంటుంది (కేవటం టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే). ఒక్కసారి సర్దుబాటు చేసుకున్న సీట్ పొజిషన్‌ను అలానే సేవ్ చేసుకోవచ్చు.

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

కొత్త ఆక్టావియా సెడాన్ డ్యాష్‌బోర్డుపై 5.8 ఇంచ్ టచ్‌ స్క్రీన్ డిస్‌ప్లేతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. దీనిని యూజర్ ఎంపిక మేరకు, తమకు నచ్చివిధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

ఆడియో సిస్టమ్

ఆడియో సిస్టమ్

ఇందులోని ఆడియో సిస్టమ్ అంత గొప్పగా ఏమీ లేదు కానీ, ఓకే ఓకే అనొచ్చు. సౌండ్ సిస్టమ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఈ ఆడియో సిస్టమ్‌కి ఒకే ఒక మీడియా పోర్ట్ ఉంటుంది, ఇది యూఎస్‌బి లేదా ఆక్స్-ఇన్ అడాప్టర్లకు ఇన్‌పుట్ పోర్ట్‌గా పనిచేస్తుంది.

స్మార్ట్ సన్‌రూఫ్

స్మార్ట్ సన్‌రూఫ్

సన్‌రూఫ్ ఫీచర్ కేవలం టాప్-ఎండ్ వేరియంట్ (ఎలిగాన్స్) ఆక్టావియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది వర్షం పడటాన్ని గుర్తించి, ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. (రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మాదిరిగా అన్నమాట.)

కంఫర్టబల్ సీటింగ్

కంఫర్టబల్ సీటింగ్

కొత్త స్కొడా ఆక్టావియాలో అన్నింటి కన్నా బెస్ట్ ఏంటంటే, ఇంటీరియర్ స్పేస్. కొత్త ఆక్టావియా పరిమాణాన్ని పెంచినందు వల్ల, మరింత విశాలమైన ఇంటీరియర్ స్పేస్ సాధ్యమైంది. ఇందులో వెడల్పుగా, విశాలంగా ఉండే సీట్లు మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ కారులో ఐదుగురు పెద్దవాళ్లు (డ్రైవర్‌తో కలిపి) హాయిగా ప్రయాణించవచ్చు.

రియర్ ఏసి వెంట్స్

రియర్ ఏసి వెంట్స్

వెనుక సీటులోని ప్రయాణికులకు చల్లగా ఏసి వచ్చేలా ముందు సీట్లకు మధ్యలో రియర్ ఏసి వెంట్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి కంట్రోల్ స్విచ్ కూడా ఉంటుంది. రియర్ ఏసి వెంట్స్‌కు దిగువన స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

స్కొడా తమ ట్రేడ్‌మార్క్ స్పేస్‌బ్యాక్ స్టైల్ బూట్ డోర్‌ను కొత్త ఆక్టావియాలో పరిచయం చేసింది. ఈ డోర్ వెనుక విండ్‌షీల్డ్‌తో పాటుగా పైకి లేస్తుంది. ఫలితంగా 590 లీటర్ల బూట్ స్పేస్ సాధ్యమైంది. అదే వెనుక సీట్లను మడిచినట్లయితే, 1000 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్

1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్

కొత్త స్కొడా ఆక్టావియాలో 1.4 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

పెట్రోల్ వెర్షన్‌ను నడపటం ఎలా ఉంటుంది

పెట్రోల్ వెర్షన్‌ను నడపటం ఎలా ఉంటుంది

ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు (కానీ ట్యూనింగ్ పెంచారు). పెట్రోల్ వెర్షన్‌ను నడుపుతున్న పవర్, పెర్ఫామెన్స్ చక్కగా ఉంటుంది. అయితే, తక్కువ ఆర్‌పిఎమ్ వద్ద టర్బో లాగ్ ఉంటుంది, ఎక్కువ ఆర్‌పిఎమ్‌కు చేరుకునే కొద్దీ ఇది మెరుగు పడుతుంటుంది. మొత్తమ్మీద పెట్రోల్ ఇంజన్ పెర్ఫామెన్స్ సమర్థవంతంగా, స్పోర్టీగా అనిపిస్తుంది.

2.0 లీటర్ డీజిల్ ఇంజన్

2.0 లీటర్ డీజిల్ ఇంజన్

డీజిల్ వెర్షన్ ఆక్టావియా విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ టిడిఐ (టర్బో) ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 148 హెచ్‌పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

డీజిల్ వెర్షన్‌ను నడపటం ఎలా ఉంటుంది

డీజిల్ వెర్షన్‌ను నడపటం ఎలా ఉంటుంది

తక్కువ స్పీడ్‌లో ఉన్నప్పుడు, ప్రత్యేకించి ఐడిల్‌గా ఉన్నప్పుడు ఈ ఇంజన్ నాయిసీ (శబ్ధం ఎక్కువగా ఉన్నట్లు)గా అనిపిస్తుంది. అయితే, ఎక్కువ స్పీడ్‌లో వెళ్తున్నప్పుడు ఇంజన్ శబ్ధం పెద్దగా వినిపించదు. డీజిల్ వెర్షన్ కూడా టర్బో లాగ్ ఉంటుంది. ఇందులో ఎక్కువ టార్క్ అందుబాటులో ఉన్నప్పటికీ, తక్కువ ఆర్‌పిఎమ్ టర్బో లాగ్ తెలుస్తుంది. నడపటానికి ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగా స్పోర్టీగా అనిపించదు. అయితే, లాంగ్ డ్రైవ్‌లకు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.

పవర్‌ఫుల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్

పవర్‌ఫుల్ 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్

ఇందులో చివరి ఇంజన్ ఆప్షన్ 1.8 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్. శక్తివంతమైన హైపెర్ఫామెన్స్ ఆక్టావియాను కోరుకునే వారి కోసం కంపెనీ ఈ ఇంజన్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది గరిష్టంగా 177 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

దీన్ని నడపటం ఎలా ఉంటుంది

దీన్ని నడపటం ఎలా ఉంటుంది

పవర్‌ఫుల్ 1.8 లీటర్ టిఎస్ఐ (టర్బో) పెట్రోల్ ఇంజన్ కలిగిన కొత్త ఆక్టావియాలో మల్టీ లింక్ రియర్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఈ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్ లభిస్తుంది. డ్రైవింగ్ ఫన్, మరింత స్పోర్టీ రైడ్ కోరుకునే వారు ఈ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. దీన్ని డ్రైవ్ చేయటం చాలా సరదాగా అనిపిస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ సేఫ్టీ ఫీచర్లు అన్ని వేరియంట్లలోను స్టాండర్డ్ ఫీచర్‌గా లభ్యమవుతాయి.

ట్రాక్షన్ కంట్రోల్

ట్రాక్షన్ కంట్రోల్

అన్ని వేరియంట్లలో (యాక్టివ్ వేరియంట్ మినహా) ఎలక్ట్రానికి ట్రాక్షన్ అండ్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి.

పార్కింగ్ సెన్సార్స్

పార్కింగ్ సెన్సార్స్

అన్ని వేరియంట్లలో (యాక్టివ్ వేరియంట్ మినహా) ఆడియో సిగ్నల్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్‌పై డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

ఎయిర్‌బ్యాగ్స్

ఎయిర్‌బ్యాగ్స్

యాక్టివ్, యాంబిషన్ వేరియంట్లలో ముందువైపు డ్రైవర్, ప్యాసింజర్స్ కోసం ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఎలిగాన్స్ వేరియంట్లో మాత్రం ఫ్రంట్, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

ధర

ధర

2013 స్కొడా ఆక్టావియా సెడాన్ అక్టోబర్ 3, 2013న భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల కానుంది. ఆరోజనే దీని ధరను అధికారికంగా వెల్లడించనున్నారు. మా అంచనా ప్రకారం, దీని ధరలు రూ.11.5 లక్షల నుంచి రూ.16 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని తెలుస్తోంది. ఖచ్చితమైన ధరను విడుదల రోజు తెలియజేస్తాం.

చివరిమాట

చివరిమాట

కొత్త స్కొడా ఆక్టావియా విశాలంగా ఉంటుంది. టాప్-ఎండ్ వేరియంట్లలో ఆఫర్ చేస్తున్న అధునాతన ఎలక్ట్రానిక్, సేఫ్టీ ఫీచర్లు కారు లోపలి వ్యక్తులకు మంచి సౌకర్యాలను, సేఫ్టీని అందిస్తాయి. మొత్తమ్మీద సరసమైన ధరకే విలాసవంతమైన ప్రీమియం కారును సొంతం చేసుకోవాలనుకునే వారికి స్కొడా ఆక్టావియా చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు.

'2013 స్కొడా ఆక్టావియా' సెడాన్ సమీక్ష

స్కొడా ఆక్టావియా సెడాన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

2017 స్కోడా ర్యాపిడ్ ఫోటోలు.....

More from DriveSpark

Article Published On: Saturday, September 28, 2013, 12:34 [IST]
English summary
New 2013 Skoda Octavia review. Built on MQB platform detailed review of 2013 Skoda Octavia, providing details about engine specs, features, variants and more. Slide through the gallery to learn all about the car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+