నవంబర్ 4వ తేదీన కొత్త మారుతి ఆల్టో కె10 విడుదల

ఇటీవలే సైలెంట్‌గా రిఫ్రెష్ట్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన మారుతి సుజుకి ఇండియా, తాజాగా మరో అప్‌గ్రేడెడ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఆల్టో కె10 మోడల్‌లో ఓ సరికొత్త వెర్షన్‌ను వచ్చే నెల 4వ తేదీన బెంగుళూరులో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపింది.

నవంబర్ 4, 2014వ తేదీన బెంగుళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ వద్ద ఈ కారును మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్ కల్సి విడుదల చేయనున్నట్లు మీడియా ఆహ్వానంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కొత్త ఆల్టో కె10 మోడల్‌కు సంబంధించిన ఫోటోలు మరియు వేరియంట్ల వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.


కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ మరియు విఎక్స్ఐ (ఆప్షనల్). ఇది రెగ్యులర్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా, కొత్త సెలెరియో మాదిరిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది.

ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ వేరియంట్‌
ఇందులో మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ (హీటర్ ఆప్షన్‌తో), ఫ్రంట్ అండ్ రియర్ ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్స్, ఫ్యాబ్రిక్ అప్‌హెలెస్ట్రీ వంటి ఫీచర్లున్నాయి. ఇందులో సేఫ్టీ ఫీచర్ అంటే కేవలం సీట్‌బెల్ట్స్ మాత్రమే. ఈ బేస్ వేరియంట్‌లో పవర్ స్టీరింగ్ కూడా లేదు.


మిడ్ లెవల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్
ఇందులో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. పవర్ స్టీరింగ్, టెయిల్‌గేట్ ఓపెనర్, వెనుక డోర్ల కోసం చైల్డ్ లాక్ సేఫ్టీ ఫీచర్ మరియు లోపలి వైపు నుంచే సర్దుబాటు చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్ (కుడివైపు మాత్రమే) వంటి ఫీచర్లు లభిస్తాయి.

టాప్ ఎండ్ విఎక్స్ఐ వేరియంట్
ఇందులో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. సిడి, రేడియో, యూఎస్‌బితో కూడిన ఆడియో ప్లేయర్, రెండు స్పీకర్లు, సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, హెడ్‌ల్యాంప్ బజర్ వార్నింగ్, టాకోమీటర్, డిజిటల్ క్లాక్, రియర్ పార్సిల్ ట్రే, వీల్ కవర్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

New Maruti Alto K10 Launch On 4th November 2014

విఎక్స్ఐ (ఆప్షనల్) వేరియంట్
ఇందులో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా.. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇందులో ఇదే టాప్-ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్‌లో సైతం ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) సిస్టమ్ లేకపోవటం విచారకరం.

ఇంప్రూవ్డ్ మైలేజ్
కొత్త మారుతి సుజుకి ఆల్టో కె10 మోడల్ పెట్రోల్ వెర్షన్ కారు లీటరుకు 24.07 కిలోమీటర్ల మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ కిలోకి 32.26 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. కొత్త 2014 మారుతి ఆల్టో కె10కు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti Suzuki India is all set to launch an all-new version of its Alto K10 on 4th November 2014 in Bangalore. The new Maruti Alto K10 will be available in petrol and CNG fuel options. It gets four trims – LX, LXi, VXi and VXi(O).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X