నిస్సాన్ టెర్రానో ఎస్‌యూవీ విడుదల: ధర రూ.9.58 లక్షలు

By Ravi

జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం నిస్సాన్ ఇండియా తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ టెర్రానోను, నేడు (అక్టోబర్ 9, 2013) భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నిస్సాన్ ఇండియా సీఈఓ కెనిచిరో యోమురా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేశారు. దేశీయ విపణిలో నిస్సాన్ టెర్రానో ప్రారంభ ధరను రూ.9.58 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ పేర్కొంది.

రెనో డస్టర్ మాదిరిగానే నిస్సాన్ టెర్రానో కూడా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ (104 పిఎస్) మరియు 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ (రెండు విభిన్న ట్యూనింగ్‌లతో - 85 పిఎస్, 110 పిఎస్) ఆప్షన్లతో లభిస్తుంది. అన్ని వేరియంట్లు (110 పిఎస్ డీజిల్ మినహా) 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. 110 పిఎస్ డీజిల్ వెర్షన్ మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ అందుబాటులో లేదు.

ఇది కూడా చదవండి: నిస్సాన్ టెర్రానో టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్


మొత్తం ఏడు వేరియంట్లలో లభ్యమయ్యే నిస్సాన్ టెర్రాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
  • టెర్రానో ఎక్స్‌ఎల్ (1.6 లీటర్ పెట్రోల్) - రూ.9.78 లక్షలు
  • టెర్రానో ఎక్స్ఈ (1.5 లీటర్, 85 పిఎస్ డీజిల్) - రూ.9.58 లక్షలు
  • టెర్రానో ఎక్స్ఎల్ (1.5 లీటర్, 85 పిఎస్ డీజిల్) - రూ.10.65 లక్షలు
  • టెర్రానో ఎక్స్ఎల్ ప్లస్ (1.5 లీటర్, 85 పిఎస్ డీజిల్) - రూ.10.92 లక్షలు
  • టెర్రానో ఎక్స్ఎల్ (1.5 లీటర్, 110 పిఎస్ డీజిల్) - రూ.11.31 లక్షలు
  • టెర్రానో ఎక్స్‌వి (1.5 లీటర్, 110 పిఎస్ డీజిల్) - రూ.12.14 లక్షలు
  • టెర్రానో ఎక్స్‌వి ప్రీమియం (1.5 లీటర్, 110 పిఎస్ డీజిల్) - రూ.12.44 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, చెన్నై)

నిస్సాన్ టెర్రానో పెరల్ వైట్, బ్లేడ్ సిల్వర్, సఫైర్ బ్లాక్, స్టెర్లింగ్ గ్రే, బ్రాంజ్ గ్రే మరియు ఫైర్ రెడ్ కలర్లలో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 9, 2013, 14:02 [IST]
English summary
Today Nissan India has finally launched the all-new compact SUV Terrano for a starting price of Rs 9.58 lakh, ex-showroom, Chennai. It is nearly Rs 70,000 more than Renault Duster. Checkout the variant wise price details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+