టాటా బోల్ట్ కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరికొద్ది రోజుల్లో బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ ఈ మోడల్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. వీలైనంత ముందుగా టాటా బోల్ట్ కారును సొంతం చేసుకోవాలనుకునే వారు కంపెనీ వెబ్‌సైట్ https://bookonline.tatamotors.com/book-a-car/bolt ను సందర్శించి, రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
టాటా హారిజానెక్స్ట్ ప్రణాళికలో భాగంగా, వస్తున్న రెండవ ఉత్పత్తి టాటా బోల్ట్ కావటం విషేశం. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటికే టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కంపెనీ విడుదల చేసింది. మార్కెట్లో మంచి విజయం సాధించిన టాటా జెస్ట్‌కు హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌గా వస్తున్న టాటా బోల్ట్ మోడల్‌పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మోడల్‌ను ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన సంగతి తెలిసినదే.
టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ కారులో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ ఫొటోపై కానీ లేదా పై లింకుపై కానీ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications









