రివ్యూ: టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ - ఈ కారుతో టాటా దశ తిరిగినట్లే..!

టాటా కార్లంటే కస్టమర్ల మనసులలో ఒక రకమైన భావన లోతుగా పాతుకుపోయింది. టాటా కార్లు నాణ్యమైనవి కావని, చవకైనవని, డబ్బుకు తగిన విలువను ఆఫర్ చేయవని, ఫిట్ అండ్ ఫినిష్ సరిగ్గా ఉండదని ఇలా అనేక రకాల భావనలను కస్టమర్లు వ్యక్తం చేస్తుంటారు. ఈ అపోహలకు చెక్ పెడుతూ టాటా మోటార్స్ సరికొత్త డిజైన్‌తో కూడిన కార్లను కస్టమర్లకు అందించేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగానే, టాటా మోటార్స్ తమ సరికొత్త కాంపాక్ట్ సెడాన్ జెస్ట్‌ను డిజైన్ చేసింది. ఇప్పుడు టాటా నుంచి రానున్న మరో మోడ్రన్ కారు 'టాటా బోల్ట్' (Tata Bolt). మరికొద్ది రోజుల్లో టాటా బోల్ట్ మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ తమ బోల్ట్ సెడాన్ కోసం ఉదయ్‌పూర్ వద్ద ఓ మీడియా టెస్ట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో మా డ్రైవ్‌స్పార్క్ బృందం కూడా పాల్గొంది.

బోరింగ్ ఇండికా ఫ్యామిలీ డిజైన్‌కి గుడ్‌బై చెబుతూ టాటా మోటార్స్, సరికొత్త లుక్ అండ్ ఫీల్ మరియు ప్రీమియం టచ్ ఉండేలా తమ కొత్త బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను డిజైన్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ ఓ సరికొత్త (ఎక్స్1) ప్లాట్‌ఫామ్‌ను కూడా సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన టాటా కార్లు ఒక ఎత్తయితే, టాటా బోల్ట్ కారు మరో ఎత్తు. ఇదివరకెన్నడూ టాటా కార్లలో చూడని విధంగా దీని ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్లని డిజైన్ చేశారు.

ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వంటి మోడళ్లకు నేరుగా సవాల్ విసిరేలా టాటా మోటార్స్ తమ కొత్త బోల్ట్ కారును అభివృద్ధి చేసింది. ఇందుకోసం టాటా తమ బ్రిటీష్ జాగ్వార్ ఇంజనీర్ల సహకారం కూడా తీసుకున్నట్లు సమాచారం.

మరి మా టెస్ట్ డ్రైవ్ పరీక్షలో టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎన్ని మార్కులు సంపాధించుకుందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షను పరీశిలించండి..!

పరిచయం

పరిచయం

* టెస్ట్ చేసిన మోడల్: టాటా బోల్ట్ (ఎక్స్‌టి, టాప్-ఎండ్ వేరియంట్)

* ఇంధన రకం: పెట్రోల్

* ఇంజన్: 1.2 లీటర్ రెవోట్రాన్ ఎమ్‌పిఎఫ్ఐ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌

* రోడ్ టెస్ట్ చేసిన ప్రాంతం: ఉదయ్‌పూర్

* అంచనా ధర: రూ.4.2 లక్షల నుంచి రూ.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఓవర్‌వ్యూ:

ఓవర్‌వ్యూ:

కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

టాటా బోల్ట్ పెట్రోల్ [ఎక్స్‌టి వేరియంట్]

ఇంజన్:

- ఇంజన్: రెవోట్రాన్ 1.2లీ, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్, ఎమ్‌పిఎఫ్ఐ

- ట్రాన్సిమిషన్: 5-స్పీడ్ మ్యాన్యువల్

- ఇంజన్ సామర్థ్యం: 1193 సీసీ (1.2 లీటర్)

- గరిష్ట పవర్: 90 పిఎస్ @ 5000 ఆర్‌పిఎమ్

- గరిష్ట టార్క్: 140 ఎన్ఎమ్ @ 1500 - 4000 ఆర్‌పిఎమ్

సేఫ్టీ:

- డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్

- రిమోట్ సెంట్రల్ లాకింగ్

- స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్

స్టయిలింగ్ - ఫ్రంట్

స్టయిలింగ్ - ఫ్రంట్

టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ హనీకోంబ్ గ్రిల్, ప్రొజెక్టర్ టైప్ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్‌లు ఇందులో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. షార్ప్ హుడ్ లైన్స్, నీట్‌గా క్రాఫ్ట్ చేసిన ఫ్రంట్ బంపర్, క్రోమ్ గార్నిష్‌లతో ఇది ముందు వైపు నుంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

స్టయిలింగ్ - సైడ్

స్టయిలింగ్ - సైడ్

సైడ్ నుంచి గమనిస్తే.. కొత్త టాటా బోల్ట్ కారులో వేవ్ టైప్ బాడీ లైన్స్‌తో ఇది ఫ్లోటింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో సి-పిల్లర్‌ను బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. పెద్ద విండోస్, బ్లాక్ అండ్ బాడీ కలర్ సైడ్ మిర్రర్, స్టయిలిష్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో గమనించవచ్చు.

తొలిసారిగా టాటా బోల్ట్‌ను సైడ్ నుంచి చూసిన వారికి పాపులర్ ఇండికా విస్టా డిజైన్ గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, వాస్తవానికి ఇండికా విస్టా సైడ్ డిజైన్‌కి, టాటా బోల్ట్ సైడ్ డిజైన్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది.

స్టయిలింగ్ - రియర్

స్టయిలింగ్ - రియర్

టాటా బోల్ట్ రియర్ డిజైన్ నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. ఇండికా విస్టా మోడళ్ల మాదిరి పెద్ద టెయిల్ ల్యాంప్స్ లేకుండా, బోల్ట్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్‌ను సింపుల్‌గా, చిన్నదిగా డిజైన్ చేశారు. నెంబర్ ప్లేట్‌కు పైభాగంలో పెద్ద క్రోమ్ బార్ ఉంటుంది. రియర్ బంపర్ ప్లెయిన్‌‌గా, సింపుల్‌గా ఉంటుంది. హై-మౌంట్ బ్రేక్‌ల్యాంప్‌తో కూడిన రియర్ రూఫ్ స్పాయిలర్, కారుకు మరింత స్పోర్టీ లుక్‌నివ్వటమే కాకుండా, ఏరోడైనమిక్స్‌ను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది.

పూనే (ఇండియా), కోవెంట్రీ (యూకే), ట్యురిన్ (టర్కీ)లలో ఉన్న టాటా మోటార్స్ డిజైన్ స్టూడియోల నుంచి సేకరించిన సలహాలు, సూచనలను ఆధారంగా చేసుకొని టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ని డిజైన్ చేశారు.

ఫ్యాక్ట్‌షీట్ (కొలతలు):

బోల్ట్ - (పొ x వె x ఎ): 3825 mm x 1695 mm x 1562 mm

స్విఫ్ట్ - (పొ x వె x ఎ): 3850 mm x 1695 mm x 1530 mm

ఇంటీరియర్

ఇంటీరియర్

బోల్ట్ ఇంటీరియర్స్ విషయంలో టాటా మోటార్స్ ఇంజనీర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌నిచ్చేలా ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డుపై అనవసరమైన ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా, స్టయిలిష్‌గా ఉంచారు. ఇలాంటి ఇంటీరియర్‌ని ఇదవరకెన్నడూ టాటా కార్లలో చూడని విధంగా ఉంటుంది. ఇన్‌స్ట్రుమెట్ క్లస్టర్, ఏసి వెంట్స్, సెంటర్ కన్సోల్ డిజైన్ చాలా స్టయిలిష్‌గా, కొత్తగా అనిపిస్తుంది.

ఏదేమైనప్పటికీ, ఇంటీరియర్‌లో ఉపయోగించిన మెటీరియల్స్ మాత్రం సాఫ్ట్ టచ్ ఫీల్‌ని కలిగి ఉండవు.

డ్రైవర్ కాక్‌పిట్

డ్రైవర్ కాక్‌పిట్

టాటా బోల్ట్ డ్రైవర్ సీట్ విషయంలో కూడా కంపెనీ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఈ అంశాన్ని ప్రత్యేకించి ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్‌ను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు. ఇందులో సీటు ఎత్తును డ్రైవర్‌కు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చు (హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్). అలాగే ఇందులో స్టీరింగ్‌ను కూడా సర్దుబాటు చేసుకునే సౌలభ్యం ఉంది. సీట్ బ్యాక్‌రెస్ట్ యాంగిల్స్‌ను సర్దుబాటు చేసుకోవటం ద్వారా సరైన డ్రైవింగ్ పొజిషన్‌ను సెట్ చేసుకోవచ్చు. బోల్ట్ కారులో ఇవన్నీ కలిసి డ్రైవర్‌కు ఓ సౌకర్యవంతమైన అనుభూతిని, డ్రైవింగ్ కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తాయి.

రియర్ క్యాబిన్

రియర్ క్యాబిన్

రియర్ క్యాబిన్టాటా బోల్ట్ కారులో కేవలం డ్రైవర్ సీటుకే కాదు, ప్యాసింజర్ సీట్లకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, షోల్డర్‌రూమ్‌లను పరిగణలోకి తీసుకొని రియర్ ప్యాసింజర్ సీట్లను డిజైన్ చేశారు. వెనుక సీటులో కూర్చుంటే, ఓ కంఫర్టబల్ కుర్చీలో (చైర్ లైక్ సీటింగ్) కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఈ సీటులో ముగ్గురు పెద్దవాళ్లు సౌకర్యంగా కూర్చోవచ్చు.

వెనుక సీట్లలో రెండు అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్, 60:40 ఫోల్డింగ్ ఆప్షన్, రెండు 3-పాయింట్ సీట్ బెల్ట్స్, ఒక సెంటర్ ల్యాప్ బెల్ట్ ఉంటాయి.

బూట్ స్పేస్

బూట్ స్పేస్

వెనుక వరుసలో ప్యాసింజర్ సీట్లను సౌకర్యంగా అమర్చే క్రమంలో, టాటా మోటార్స్ తమ బోల్ట్ బూట్ స్పేస్ విషయంలో రాజీ పడిందనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ, ఇది ఈ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర మోడళ్ల కన్నా మెరుగైన బూట్ స్పేస్‌నే ఆఫర్ చేస్తుంది. ఈ కారులోని వెనుక సీట్లను 60:40 నిష్పత్తిలో మడుచుకొని బూట్ స్పేస్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు.

ఫ్యాక్ట్‌షీట్:

మారుతి స్విఫ్ట్ - 205 లీటర్లు

టాటా బోల్ట్ - 210 లీటర్లు

గ్రాండ్ ఐ10 - 256 లీటర్లు

ఇంజన్, గేర్‌బాక్స్

ఇంజన్, గేర్‌బాక్స్

మేము టెస్ట్ డ్రైవ్ చేసినది పెట్రోల్ వెర్షన్ బోల్ట్ కారు. ఇందులో టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త నెక్స్ట్-జనరేషన్ రెవోట్రాన్ 1.2 లీటర్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేయటంలో ఇండియన్ ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్ నారయణ్ కార్తికేయన్ హస్తం కూడా ఉంది. ఇది పూర్తిగా సరికొత్త ఇంజన్. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఫ్యాక్ట్‌షీట్ (బోల్ట్ ఇంజన్ ఆప్షన్స్):

బోల్ట్ పెట్రోల్ (1193సీసీ)

4 సిలిండర్, టర్బోచార్జ్డ్ ఎమ్‌పిఎఫ్ఐ

బోల్ట్ డీజిల్ (1248సీసీ)

4 సిలిండర్, టర్బో ఇంటర్‌కూల్డ్

రెవోట్రాన్ ఇంజన్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి
డ్రైవబిలిటీ

డ్రైవబిలిటీ

టాటా బోల్ట్ ఇటు సిటీ డ్రైవ్‌కి, అటు హైవే డ్రైవ్‌కి చక్కగా సూట్ అవుతుంది. ఇరుకుగా ఉండే రోడ్లపైనైనా లేదా విశాలంగా ఉండే ఓపెన్ రోడ్లపైనైనా పరుగులు పెట్టించేందుకు మీరు ఓ మోడ్రన్ స్మాల్ కార్ కోసం చూస్తున్నట్లయితే, బోల్ట్ మిమ్మల్ని నిరుత్సాహపరచదు. అప్-మార్కెట్ ఫీల్‌నిచ్చే ఇంటీరియర్స్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్స్ వలన ఇందులో డ్రైవింగ్ స్పోర్టీగా అనిపిస్తుంది.

అయితే, మందంగా ఉన్న ఏ పిల్లర్ వలన కార్నర్స్‌లో విజిబిలిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్‌కి మార్చేటప్పుడు గేర్ షిఫ్టింగ్ కాస్తంత రఫ్‌గా అనిపించినప్పటికీ, ఆ తర్వాత (3, 4, 5) గేర్ల షిప్టింగ్ మాత్రం చాలా స్మూత్‌గా అనిపిస్తుంది.

డ్రైవబిలిటీ

డ్రైవబిలిటీ

టాటా బోల్ట్ కారులో మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ (సిటీ, ఈకో, స్పోర్ట్) ఉంటాయి. ఒక్కొక్క మోడ్‌లో డ్రైవింగ్ అనుభూతి ఒక్కో రకంగా అనిపిస్తుంది.

- ఈకో మోడ్: ఇంధనం ఆదా చేసేందుకు ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.

- స్పోర్ట్ మోడ్: మరింత వేగంగా యాక్సిలరేట్ చేసేందుకు థ్రోటల్ (యాక్సిలరేటర్) రెస్పాన్స్‌ను పెంచుతుంది.

- సిటీ మోడ్: ఈకో మరియు స్పోర్ట్ మోడ్‌లను బ్యాలెన్స్ చేస్తుంది. (ఇది డిఫాల్ట్ మోడ్)

* ఈ ఫొటోలో డ్రైవింగ్ మోడ్స్‌ని హైలైట్ చేయటాన్ని చూడొచ్చు.

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్

పెర్ఫార్మెన్స్ విషయంలో టాటా మోటార్స్ కొత్త రెవోట్రాన్ ఇంజన్ నిజంగా ఓ అద్భుతమైన ఇంజన్. ఐడ్లింగ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ వేసి, క్లచ్ రిలీజ్ చేయగానే ఆర్‌పిఎమ్ కొద్దిగా పెరుగుతుంది, ఈ సందర్భంలో యాక్సిలరేటర్ ఇవ్వాల్సిన అసరం లేకుండా క్లచ్‌ను రిలీజ్ చేస్తూ కారును ముందుకు నడపవచ్చు. నిత్యం రద్దీగా ఉండే మన ట్రాఫిక్ రోడ్లపై ఇది చక్కగా పనికొస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. టెస్టింగ్ సమయంలో మేము గంటకు 140 కి.మీ. వేగాన్ని చేరుకున్నాం. అంత స్పీడ్ వద్ద కూడా కారు చాలా స్థిరంగా అనిపించింది.

ఫ్యాక్ట్‌షీట్:

టాటా బోల్ట్:

- గరిష్ట పవర్: 88.8 బిహెచ్‌పి @ 5000 ఆర్‌పిఎమ్

- గరిష్ట టార్క్: 140 ఎన్ఎమ్ @ 1500 - 4000 ఆర్‌పిఎమ్

- గరిష్ట వేగం: గంటకు 160 కి.మీ

మారుతి స్విఫ్ట్:

- గరిష్ట పవర్: 83 బిహెచ్‌పి @ 6000 ఆర్‌పిఎమ్

- గరిష్ట టార్క్: 115 ఎన్ఎమ్ @ 4000 ఆర్‌పిఎమ్

మైలేజ్

మైలేజ్

టాటా బోల్ట్ కారులోని 1.2లీ రెవోట్రాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ పెర్ఫార్మెన్స్ పరంగా మమ్మల్ని సంతృప్తిపరచినప్పటికీ, మైలేజ్ పరంగా మాత్రం నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. మా టెస్టింగ్ సమయంలో టాటా బోల్ట్ 10.7 కెఎమ్‌పిఎల్ మైలేజీనిచ్చింది. ఈ మోడల్ సర్టిఫైడ్ మైలేజీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. మేము ఉదయ్‌పూర్-మౌంట్ అబూ హైవేపై ఈ కారును గంటకు 100-140 కి.మీ. వేగం వద్ద డ్రైవ్ చేయటం వలన బహుశా మైలేజ్ తగ్గి ఉండొచ్చు. ఒకవేళ నెమ్మదిగా ఈకో మోడ్‌లో డ్రైవ్ చేసి ఉంటే ఇది 13 కెఎమ్‌పిఎల్ మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.

ఫ్యాక్ట్‌షీట్ (ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ):

టాటా బోల్ట్ - 44 లీటర్లు (ఫుల్ ట్యాంక్‌పై 550 కి.మీ. ప్రయాణించవచ్చు)

మారుతి స్విఫ్ట్ - 42 లీటర్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 - 43 లీటర్లు

మాకు నచ్చినవి - స్టీరింగ్ వీల్

మాకు నచ్చినవి - స్టీరింగ్ వీల్

టాటా బోల్ట్ కారులో స్టీరింగ్ వీల్‌ను చక్కగా డిజైన్ చేశారు. ఇది తక్కువ డయామీటర్ (వ్యాసార్థాన్ని) కలిగి ఉండి, సన్నటి రోడ్లపై సైతం సులువుగా టర్న్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సహకరిస్తుంది. ఈ స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. డ్రైవర్ స్టీరింగ్ నుంచి తన చేతిని కదపాల్సిన అవసరం లేకుండానే ఆడియో సిస్టమ్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఇంకా దీనిపై ఉండే క్రోమ్ ఇన్‌సెర్ట్స్ ఇంటీరియర్‌కు మరింత అందమైన లుక్‌ని తెచ్చిపెడుతాయి.

అయితే, హారన్‌ను నొక్కాలంటే కొద్దిగా బలప్రయోగం చేయాల్సి వస్తుంది. దీనిని కొంచెం సులువు చేసి ఉంటే బాగుండేది.

ఫ్యాక్ట్‌షీట్:

- స్టీరింగ్ వీల్ డయామీటర్: 14.17 ఇంచ్‌లు

- టర్నింగ్ సర్కిల్ రేడియస్: 5.1 మీటర్లు

మాకు నచ్చినవి - అల్లాయ్ వీల్స్

మాకు నచ్చినవి - అల్లాయ్ వీల్స్

టాప్-ఎండ్ వేరియంట్ టాటా బోల్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. ఇందులో 8-స్పోక్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. ఈ అల్లాయ్ వీల్స్ డిజైన్ సింపుల్‌గా ఉంటూనే, స్పోర్టీ లుక్‌నిస్తుంది.

ఫ్యాక్ట్‌షీట్:

- వీల్స్: 15 ఇంచ్ అల్లాయ్

- టైర్ సైజ్: 175/65 R15

- టైర్ కంపెనీ: గుడ్ఇయర్

- టైర్ టైప్: ట్యూబ్‌లెస్

- ఫ్రంట్ బ్రేక్: డిస్క్

- రియర్ బ్రేక్: డ్రమ్

ఇన్ఫోటైన్‌మెంట్

ఇన్ఫోటైన్‌మెంట్

టాటా బోల్ట్ కారులో హర్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది కేవలం ఆడియో సిస్టమ్ మాదిరిగానే కాకుండా, డ్రైవర్‌కు కావల్సిన సమాచారాన్ని అందించే సాంకేతిక వ్యవస్థలా కూడా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ కీలక ఫీచర్లు:

- 5-ఇంచ్ టచ్‌స్క్రీన్

- వీడియో ప్లేబ్యాక్

- స్మార్ట్ ఫోన్ ఆధారిత నావిగేషన్*

- అడ్వాన్స్డ్ బ్లూటూత్ టెక్నాలజీ

- స్మార్ట్ వాయిస్ రికగ్నైజేషన్

- అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్

- ఇన్‌కమింగ్ ఎస్ఎమ్ఎస్ నోటిఫికేషన్, రీడవుట్స్**

గమనిక:

* ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే, ** కనెక్ట్ అయిన ఫోన్ బ్లూటూత్ ప్రొఫైల్ ఆధారంగా

మాకు నచ్చినవి - స్మార్ట్‌ఫోన్ ఆధారిత నావిగేషన్

మాకు నచ్చినవి - స్మార్ట్‌ఫోన్ ఆధారిత నావిగేషన్

టాటా బోల్ట్ కారులో ఆఫర్ చేస్తున్న హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మన చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సాయంతో జిపిఎస్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. కారు ఇన్ఫోటైన్‌మెంట్‌లో నావిగేషన్‌ను యాక్సిస్ చేసుకోవాలంటే, క్రింది పద్ధతులను పాటించాలి:

- మీ ఫోన్‌లో మ్యాప్‌మైఇండియా అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి

- ఈ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూఎస్‌బి పోర్టు సాయంతో మీ స్మార్ట్‌ఫోన్‌ని ఇన్ఫోటైన్‌మెంట్‌కి కనెక్ట్ చేయండి.

- ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌లో మ్యాప్‌మైఇండియా యాప్‌ను ఓపెన్ చేసినట్లయితే, అదే అప్లికేషన్ మీ కారులోని 5-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌పై కూడా డిస్‌ప్లే అవుతుంది.

మాకు నచ్చనిది!

ఈ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా స్మూత్‌గా, రెస్పాన్సివ్‌గా ఉండదు. మెనూని యాక్సెస్ చేయటం, స్క్రాల్ చేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది.

మాకు నచ్చినవి - ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

మాకు నచ్చినవి - ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

టాటా బోల్ట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను క్లీన్‌గా డిజైన్ చేశారు. ఇందులో రెండు పెద్ద అనలాగ్ మీటర్స్ (ఆర్‌పిఎమ్ మీటర్, స్పీడోమీటర్) మరియు వాటి మధ్యలో ఓ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే ద్వారా మనం నడుపుతున్న డ్రైవింగ్ మోడ్, డోర్ అజర్ వార్నింగ్, ట్రిప్ మీటర్, మైలేజ్ మొదలైన అంశాలు తెలుసుకోవచ్చు. ఓ నిర్దిష్ట ట్రిప్‌లో వచ్చిన మైలేజ్‌ను కూడా ఈ డిస్‌ప్లే సాయంతో తెలుసుకోవచ్చు. తర్వాతి స్లైడ్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లేకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చూడండి.

మాకు నచ్చినవి - మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే

మాకు నచ్చినవి - మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే

మల్టీ-ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లేకి వివిధ మోడ్‌లను ఒక్కటిగా చేర్చి తయారు చేసిన ఫొటో ఇది. ఇందులో..

- బాహ్య ఉష్ణోగ్రత

- మైలేజ్

- శూన్యం నుంచి దూరం

- సగటు మైలేజ్

- ట్రిప్ లాగ్

- టైమ్

- డ్రైవింగ్ మోడ్స్ (స్పోర్ట్, ఈకో)

మొదలైన వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

మాకు నచ్చినవి - ఫ్రంట్ సీట్స్

మాకు నచ్చినవి - ఫ్రంట్ సీట్స్

మొదట్లో చెప్పుకున్నట్లుగానే టాటా బోల్ట్ కారులో ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఈ సీట్లన్నీ పూర్తి ఫ్యాబ్రిక్ సీట్స్. ఫ్రంట్ సీట్లలో సైడ్ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది (కంపెనీ వీటిని రగ్బీ సీట్స్ అని పిలుస్తుంది). కార్నరింగ్స్‌లో మంచి సపోర్ట్ ఇచ్చేందుకు టాటా మోటార్స్ ఈ సీట్లను సైడ్ సపోర్టుతో విశిష్టంగా డిజైన్ చేసింది.

మాకు నచ్చనివి - సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)

మాకు నచ్చనివి - సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)

టాటా బోల్ట్ కారులోని అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్)లను యాంత్రికంగా సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, వీటి డెప్త్ సరిగ్గా ఉండదు. బ్లైండ్ స్పాట్స్‌ను ఇవి సరిగా గుర్తించవు.

మాకు నచ్చనివి - హ్యాండ్ బ్రేక్

మాకు నచ్చనివి - హ్యాండ్ బ్రేక్

సాధారణంగా కార్లలో హ్యాండ్ బ్రేక్ రిలీజ్ బటన్‌ను ప్రెస్ చేయకుండా పైకి లాగినట్లయితే క్లిక్ క్లిక్ మనే సౌండ్ రాదు. ఆ బటన్ ప్రెస్ చేయకుండా పైకి లాగినట్లయితే, సౌండ్ వస్తుంది. అలా వచ్చే సౌండ్‌ని బట్టి మనం హ్యాండ్ బ్రేక్‌ను ఎంత పైకి లాగామో అర్థమవుతుంది. కానీ బోల్ట్ విషయంలో బటన్ నొక్కకుండా హ్యాడ్ బ్రేక్ పుల్ చేసినా సరే సౌండ్ రాదు. కాబట్టి, ఇందులో హ్యాండ్ బ్రేక్ క్లిక్ సౌండ్, సాఫ్ట్ లిఫ్టింగ్ ఫీల్ మిస్ అయినట్లు అనిపిస్తుంది.

మాకు నచ్చనివి - స్టోరేజ్ స్పేస్

మాకు నచ్చనివి - స్టోరేజ్ స్పేస్

టాటా బోల్ట్ కారులో స్టోరేజ్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. డోర్ పాకెట్స్ చాలా సన్నవిగా ఉంటాయి, వీటి స్థానంలో బాటిల్ హోల్డర్లు ఉంచుంటే బాగుండేది. సెంటర్ కన్సోల్‌లో ఇచ్చిన బాటిల్ హోల్డల్ లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బహుశా దీనిని స్మార్ట్‌ఫోన్ ఉంచేందుకు లేదాయి కాయిన్స్ ఉంచేందుకు మాత్రమే పనికొస్తుంది.

కాంపిటీషన్

కాంపిటీషన్

ఈ సెగ్మెంట్లో ఇప్పటికే బెస్ట్ సెల్లర్‌గా ఉన్న మారుతి స్విఫ్ట్, కొత్తగా వచ్చి హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మోడళ్ల నుంచి టాటా బోల్ట్ గట్టి పోటీని ఎదుర్కోనుంది. టాటా బోల్ట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, విపణిలో దీని ధర రూ.4.2 లక్షలు ఉండొచ్చని అంచనా.

ఫ్యాక్ట్‌షీట్:

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 [1.2లీ పెట్రోల్]

రూ.4.3 లక్షల నుంచి 5.8 లక్షలు

మారుతి సుజుకి స్విఫ్ట్ [1.2లీ పెట్రోల్]

రూ.4.4 లక్షల నుంచి 5.9 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

చివరిమాట

చివరిమాట

మంచి:

- విశాలమైనది

- రైడ్ క్వాలిటీ

- కంఫర్టబల్ సీటింగ్

- బిల్డ్ క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్

- మంచి ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ [ఈపిఎస్]

- మల్టీ డ్రైవింగ్ సిస్టమ్ [సిటీ, ఈకో, స్పోర్ట్]

- హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

చెడు:

- క్యాబిన్ స్టోరేజ్ స్పేస్

- ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ రెస్పాన్సివ్‌గా లేదు

- మందంగా ఉన్న ఏ పిల్లర్, పరిమిత డెప్త్ కలిగిన సైడ్ మిర్రర్స్

- పెట్రోల్ ఇంజన్ (మిడ్-రేంజ్ పంచ్ మిస్ అయ్యింది)

ఎక్స్-ఫ్యాక్టర్:

- ఒకవేళ టాటా మోటార్స్ ఈ కారు ధరను పోటీగా నిర్ణయించినట్లయితే, బోల్ట్ ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుంది.

మెరుగుపరచాల్సిన అంశం:

- ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ నాణ్యత

- ఈకో, స్పోర్ట్ మోడ్ బటన్స్‌ని స్టీరింగ్ వీల్‌పై అమర్చి ఉంటే బాగుండేది

టాటా ఫాస్ట్ ఫ్యాక్ట్స్

టాటా ఫాస్ట్ ఫ్యాక్ట్స్

- హెడ్‌క్వార్టర్స్: బాంబే హౌస్ 24, హోమీ మోడి స్ట్రీట్ ముంబై 400 001

- స్థాపితం 1868: జమ్‌సెట్‌జి నుస్సెర్‌వాంజీ టాటా ద్వారా టాటా సన్స్ స్థాపించబడినది

- ప్రమోటర్ హోల్డింగ్ కంపెనీలు: టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్

- వ్యాపార విభాగాలు: ఐటి, కమ్యూనికేషన్స్, ఇంజనీరింగ్, మెటీరియల్స్, సర్వీసెస్, ఎనర్జీ, కెమికల్స్, కన్జ్యూమర్ ప్రోడక్ట్స్

- గ్రూప్ ఆదాయం 2013-14: 103.27 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.624,757 కోట్లు)

- షేర్‌హోల్డర్ బేస్: 3.9 మిలియన్లు

- కంపెనీల సంఖ్య: సుమారు 100కు పైమాటే

- లిస్టెడ్ కంపెనీల సంఖ్య: బాంబే స్టాక్ ఎక్సేంజీలో 32

- ఉద్యోగుల సంఖ్య: 5,81,470 మందికి పైనే

More from DriveSpark

Article Published On: Wednesday, December 10, 2014, 12:25 [IST]
English summary
Tata Bolt review: Our experts test drive the Tata Bolt petrol hatchback. The first drive impression report on Tata Bolt petrol highlights pros, cons, specs, features, price, mileage & more.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+