జనవరి 20, 2015వ తేదీన టాటా బోల్ట్ విడుదల

By Ravi

టాటా మోటార్స్ నుంచి కస్టమర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదల తేదీ ఖరారైంది. టాటా మోటార్స్ తమ సరికొత్త బోల్ట్ కారును వచ్చే నెల 20వ తేదీన మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా మోటార్స్ నుంచి సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తున్న టాటా బోల్ట్ జనవరి 20, 2015వ తేదీ విపణిలో విడుదల కానుంది.

ఇప్పటికే టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ కోసం కంపెనీ ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు https://bookonline.tatamotors.com/book-a-car/bolt సైట్‌ను సందర్శించి, రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టాటా బోల్ట్ పెట్రోల్ (1.2టి రెవోట్రాన్) మోడల్‌ను ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ కూడా చేసిన సంగతి తెలిసినదే.

టాటా బోల్ట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ కారులో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ ఫొటోపై కానీ లేదా పై లింకుపై కానీ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, December 26, 2014, 10:29 [IST]
English summary
Tata Motors will launch its much-awaited Bolt hatchback on 20th January 2015. The company has already opened the online bookings for Tata Bolt hatchback. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+