నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 విడుదల
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవల దేశీయ విపణిలో విడుదల చేసిన మరింత శక్తివంతమైన విస్టా బ్రాండ్ హ్యాచ్‌బ్యాక్ 'టాటా విస్టా డి90'ని కంపెనీ ఇప్పుడు నేపాల్ మార్కెట్లో విడుదల చేసింది. నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 జెడ్ఎక్స్ ప్లస్ (టాప్-ఎండ్) వేరియంట్ ధర 26.95 లక్షల నేపాలీ రుపాయిలుగా ఉంది. భారత కరెన్సీతో పోల్చుకుంటే నేపాల్ కరెన్సీ విలువ తక్కువ కాబట్టే అక్కడి మార్కెట్లో ఈ కారు ధర ఇంత అధికంగా ఉంది.
నేపాల్ మార్కెట్లో విడుదలైన టాటా విస్టా డి90 హ్యాచ్‌లో ఇంజన్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల (90 పిఎస్) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
రీ-ట్యూన్ చేసిన ఇంజన్‌తో ఇది తిరుగులేని పెర్ఫామెన్స్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తూనే, మైలేజ్ విషయంలో రాజీ పడకుండా లీటరుకు 21 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను ఇది ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (ఆల్ట్రా వైలెట్, పోర్సెలైన్ వైట్, స్పైస్ రెడ్, కావెర్న్ గ్రే, జెట్ సిల్వర్) లభిస్తుంది. ఇది రెండేళ్లు లేదా 75,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీతో అందుబాటులో ఉంది.
టాటా విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 విడుదల

నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 విడుదల

నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 విడుదల

నేపాల్ మార్కెట్లో టాటా విస్టా డి90 విడుదల

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90

టాటా విస్టా డి90



Click it and Unblock the Notifications








