టాటా విస్టా డి90: మరింత పవర్, మరిన్ని ఫీచర్స్ - రివ్యూ
టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ 'విస్టా' హ్యాచ్‌బ్యాక్‌లో కెల్లా అత్యంత శక్తివంతమైన విస్టా (New Tata Vista D90)ను కంపెనీ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. టాటా విస్టాలో పవర్‌ఫుల్ వెర్షన్ కోరుకునే వారి కోసం, అలాగే ప్రస్తుత ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ కొత్త విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ధి చేసింది. ఈ కొత్త కారులో టాటా మోటార్స్ అందిస్తున్న అత్యాధునిక ఫీచర్ల వలన ఈ సెగ్మెంట్లో కెల్లా టాటా విస్టా డి90 విశిష్టంగా నిలువనుంది.
టాటా విస్టా డి90లో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల (90 పిఎస్) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. రీ-ట్యూన్ చేసిన ఇంజన్‌తో ఇది తిరుగులేని పెర్ఫామెన్స్ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తూనే, మైలేజ్ విషయంలో రాజీ పడకుండా లీటరుకు 21 కిలోమీటర్లకు పైగా మైలేజ్‌ను ఇది ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
మరి ఈ కొత్త టాటా విస్టా డి90 ప్రత్యేకతలేంటో ఈ ఫోటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

టాటా విస్టా డి90 - రివ్యూ
టాటా విస్టాలో పవర్‌ఫుల్ వెర్షన్ కోరుకునే వారి కోసం, అలాగే ప్రస్తుత ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ కొత్త విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ధి చేసింది. ఈ కొత్త కారులో టాటా మోటార్స్ అందిస్తున్న అత్యాధునిక ఫీచర్ల వలన ఈ సెగ్మెంట్లో కెల్లా టాటా విస్టా డి90 విశిష్టంగా నిలువనుంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* పవర్‌ఫుల్ 90 పిఎస్ 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్:
టాటా విస్టా డి90లో ఉపయోగించిన శక్తివంతమైన 1.3 లీటర్ 4-సిలిండర్, విజిటి (వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్) క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 90 పిఎస్‌ల శక్తిని, 1750-3000 ఆర్‌పిఎమ్ వద్ద 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* కంఫర్ట్ ఫీచర్స్:
ఫాలో మి హెడ్‌ల్యాంప్స్ - చీకటి వేళల్లో/ప్రదేశాల్లో ఇంజన్ ఆఫ్ చేసి, కారును లాక్ చేసిన బయటకు వచ్చిన తర్వాత కూడా హెడ్‌లైట్స్ 30 సెకండ్ల పాటు ఆన్‌లో ఉండి మీకు మార్గం చూపడంలో సహకరిస్తాయి.
సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ ఓఆర్‌విఎమ్ (సైడ్ మిర్రర్స్), లంబార్ సపోర్ట్‌తో కూడిన 6-వే హైట్ అడ్జస్టబల్ సీట్, 60:40 ఫ్లిప్ ఫ్లాప్ రియర్ సీట్ (ఫోల్డబిల్) ఇందులో కొత్తగా జోడించిన కంఫర్ట్ ఫీచర్స్.

టాటా విస్టా డి90 - రివ్యూ
* డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్:
ప్యాసింజర్, డ్రైవర్‌ల కోసం డ్యూయెల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్‌బ్యాగ్స్‌ను కొత్త టాటా విస్టా డి90లో అమర్చారు.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఏబిఎస్ విత్ ఈబిడి:
అత్యవసర సమయాల్లో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఇందులో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను టాటా మోటార్స్ ఆఫర్ చేస్తోంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ధృడమైన స్టీల్ బాడీ:
కొత్త టాటా విస్టా డి90 బాడీని ధృడమైన స్టీల్‌తో తయారు చేశారు. ఇందు కోసం 150 కేజీల అధనపు స్టీల్‌ను దీని బాడీ నిర్మాణంలో ఉపయోగించారు. ప్రమాద సమయాల్లో కారులోని ప్రయాణికులపై ప్రమాద తీవ్రతను తగ్గించేలా దీని బాడీ నిర్మాణం ఉంటుంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ప్లష్ ఇంటీరియర్స్:
దూర ప్రయాణాలలో సైతం సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేలా ఇందులో రీఫైన్ చేయబడిన, స్మూత్ ప్లష్ ఇంటీరియర్లను ఉపయోగించారు.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఇంటీరియర్ ఫీచర్స్:
కొత్త టాటా విస్టా డి90లో వన్-షాట్ పవర్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో, టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్, బ్లూ 5 టెక్నాలజీ, జిపిఎస్ నావిగేషన్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ వీల్‍పై ఆడియో కంట్రోల్స్, సహారా బీజ్, ఎబోనీ బ్లాక్ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లను జోడించారు.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ట్రెండీ యూత్‌ఫుల్ డిజైన్:
కొత్త టాటా విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్ ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని స్టయిలిష్ ఫ్రంట్ బంపర్, స్టయిలిష్ రియర్ స్పాయిలర్ మరియు బంపర్‌లతో కారు పైభాగంలో నలుపు రంగులో డిజైన్ చేసిన ఇన్ఫినిటీ కాన్‌ట్రాస్ట్ రూఫ్‍లతో ఇది కొనుగోలుదారులను ఇట్టే ఆకట్టుకుంటుంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఎక్స్టీరియర్ ఫీచర్స్:
రెండు రంగుల కలయికతో ఉండే సరికొత్త 2-టోన్ అల్లాయ్ వీల్స్ విస్టా డి90 హ్యాచ్‌బ్యాక్‌కు మంచి స్పోర్టీ లుక్‌ను అందిస్తాయి. వర్షాకాలమైన లేదా శీతాకాలమైనా ఈ కారులోని వెనుక విండ్‌స్క్రీన్‌కు ఏర్పాటు చేసిన డిమిస్టర్, ఇంటెలిజెంట్ వైపర్‌ల వలన విజిబలిటీ తగ్గకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు వీలవుతుంది.

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్స్:
స్పైస్ రెడ్

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్స్:
పోర్సిలైన్ వైట్

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్స్:
జెట్ సిల్వర్

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్స్:
కావెర్న్ గ్రే

టాటా విస్టా డి90 - రివ్యూ
* ఆకర్షనీయమైన కలర్ ఆప్షన్స్:
ఆల్ట్రా వైలెట్

టాటా విస్టా డి90 - రివ్యూ
* ధరలు:
రెండు వేరియంట్లలో లభ్యం కానున్న టాటా విస్టా డి90 ధరలు ఇలా ఉన్నాయి.
1. టాటా విస్టా డి90 విఎక్స్ ధర - రూ.5.99 లక్షలు
2. టాటా విస్టా డి90 జెడ్‌ఎక్స్ ప్లస్ ధర - రూ.6.83 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

టాటా విస్టా డి90 - రివ్యూ
టాటా విస్టా డి90 ఎక్స్టీరియర్స్

టాటా విస్టా డి90 - రివ్యూ
టాటా విస్టా డి90 ఎక్స్టీరియర్స్

టాటా విస్టా డి90 - రివ్యూ
టాటా విస్టా డి90 ఇంటీరియర్స్

టాటా విస్టా డి90 - రివ్యూ
టాటా విస్టా డి90 ఇంటీరియర్స్

టాటా విస్టా డి90 - రివ్యూ
ఆల్ కలర్ ఆప్షన్స్



Click it and Unblock the Notifications








