డీజిల్ కార్లనే ఎందుకు కొనాలి: కారణాలు

Diesel vs Petrol

అసలు డీజిల్ కార్లనే ఎందుకు కొనాలి? కొనుగోలుదారులు ఎందుకు డీజిల్ కార్ల వెంట పరుగులు తీస్తున్నారు:

ఇందుకు ప్రధాన కారణం మైలేజ్ అని చెప్పవచ్చు. పెట్రోల్ కార్లతో పోల్చి చూస్తే డీజిల్ కార్ల మైలేజ్ అధికంగా ఉంటుంది. అందువలనే వీటి ధరలు కాస్తంత ఎక్కువైనా డీజిల్ కార్లనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలలో దాదాపు సగానికి పైగా వ్యత్యాసం ఉంది. లీటర్ డీజిల్‌తో సగటున 20-25 కి.మీ. ప్రయాణంచ గలిగితే, లీటర్ పెట్రోల్‌తో 10-18 కి.మీ. వరకూ ప్రయాణించవచ్చు.

మీరు సాధారణంగా నెలకు సగటున 1,500 కి.మీ. ప్రయాణించినట్లయితే, ఇంధన ఖర్చు రూ.3,375 గా ఉంటుంది, ఇదే దూరానికి అయ్యే పెట్రోల్ ఖర్చు రూ.7,500 గా ఉంటుంది. అంటే దాదాపు సగానికి సగం అన్నమాట. ఈ ధరలో వ్యత్యాసమే డీజిల్ కార్లను కొనేందుకు కొనుగోలుదారులను ముందుకు నడుపుతోంది. మరో వైపు ప్రభుత్వపు పన్ను విధింపు భయం కూడా కొనుగోలుదారులను వెంటాడుతుండటంతో డీజిల్ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి.

ఒకప్పుడు డీజిల్ కార్ల మెయింటినెన్స్ అధికంగా ఉండేది. అయితే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వివిధ మెరుగైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా వీటి మెయింటినెన్స్ కూడా అందుబాటు ధరలో ఉంటుంది. డీజిల్ కార్లను కొనుగోలు చేసే ముందు మీరు ప్రతి నెలా ఎన్ని కి.మీ. దూరం ప్రయాణిస్తారో బేరీజు వేసుకోవాలి. ఒకవేళ మీరు 1,200 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించే వారైతే మీకు డీజిల్ కార్ల చక్కగా సరిపోతాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 19, 2011, 17:31 [IST]
English summary
Indian car buyers prefer to buy diesel cars and here are some reasons for this preference. The diesel cars are more fuel efficient and run on a cheaper fuel. here is a possibility of the government imposing a tax on diesel cars in the future while not increasing diesel's price.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+