డీజిల్ కార్లనే ఎందుకు కొనుగోలు చేయాలి..??

వీరంతా ఎందుకు తొందరపడుతున్నారు అనుకుంటున్నారా.. మరేం లేదండీ, ఈసారి బడ్జెట్‌లో డీజిల్ కార్లపై 15 శాతం అదనపు పన్ను విధించాలని సర్కారు యోచిస్తోంది. ఇదే గనుక అమల్లోకి వస్తే డీజిల్ కార్ల ధరలు ఏకంగా ఒక లక్ష రూపాయాల వరకూ పెరిగిపోయే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పడిలేస్తున్న పెట్రోల్ ధరలు కూడా ఇందుకు మరో కారణం.
సాధారణంగా పెట్రోల్ వేరియంట్ కారుకు డీజిల్ వేరియంట్ కారుకు ధరలో వ్యత్యాసం రూ.75 వేల నుండి రూ.1.5 లక్షల వరకూ ఉంటుంది. ఒకప్పుడు పాపులర్ డీజిల్ కార్లకు మాత్రమే మంచి డిమాండ్ ఉండేది. అయితే తాజా పరిణామాల వల్ల అంతంత మాత్రంగా సాగుతున్న డీజిల్ కార్లకు కూడా గిరాకీ గణనీయంగా పెరిగింది. దీంతో దేశంలో డీజిల్ ఇంధన వినియోగం కూడా పెరిగిపోతుంది.
మనదేశంలో వినియోగిస్తున్న మొత్తం డీజిల్‌లో 15 శాతానికి పైగా వాహనాలకే ఉపయోగించడం జరుగుతుంది. డీజిల్ ధరల విషయంలో కాస్తంత ఓదార్పునిచ్చే విషయం ఏంటంటే, ప్రస్తుతానికి వీచి ధరల నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. పెట్రోల్ ధరల మాదిరిగా చమురు సంస్థల కంపెనీల చేతుల్లో లేదు. ప్రస్తుతం డీజిల్ ధరలను పెంచితే ఇటు ప్రజలు అటు ప్రతిపక్షాలను ఆక్షేపణలు వస్తాయి కాబట్టి అధిక పన్నుల రూపంలో వినియోగదారులపై భారం మోపాలని ప్రభుత్వం యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








