సరైన వాహన బీమాను పొందడం ఎలా - చిట్కాలు

Insurance
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో వాహనం అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసరాల్లో ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. తమ రోజూవారీ ప్రయాణ అవసరాల కోసం కొనుగోలుదారులు కొత్త/పాత వాహనాలను కొనుగోలుచేస్తూనే ఉన్నారు. ఫలితంగా వాహన రద్దీగా కూడా నానాటికీ పెరుగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న వాహనాల్లో సుమారు 80 శాతం ద్విచక్ర వాహనాలకు, 15 శాతం నాలుగు చక్రాల వాహనాలకు బీమా రక్షణ (ఇన్సూరెన్స్ కవరేజ్) లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మోటారు వాహన చట్టం ప్రకారం, థర్డ్‌పార్టీ బీమాను తప్పనిసరి చేసినప్పటికీ, చాలా వరకూ వాహనాలు బీమా (ఇన్సూరెన్స్) లేకుండానే రహదారులపై సంచరిస్తున్నాయి. సాధారణంగా కొనుగోలుదారులు కొత్తగా వాహనం కొనేటప్పుడు చూపించే ఉత్సాహాన్ని వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసేటప్పుడు చూపించడం లేదు. ఫలితంగా వాహనానికి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, అనవసరంగా మరమ్మత్తులకు అయ్యే ఖర్చులను తానే భరిస్తున్నారు.

ఇలా కాకుండా.. మరమ్మత్తులకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ నుండి పొందాలంటే ఒక్కటే మార్గం ఉంది. అది, నమ్మదగిన బీమా కంపెనీ నుండి, సమర్థవంతమైన పాలసీను ఎన్నుకొని ఎప్పటికప్పుడు సదరు పాలసీలను సరైన సమయంలో రెన్యువల్ చేసుకోవటమే. మరి సరైన పాలసీని ఎన్నుకోవడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..!!

కాంప్రహెన్సివ్‌ పాలసీ:
కేవలం వాహనానికే కాకుండా, వాహన యజమానికి మరియు ఇతరులకు అన్ని విధాల రక్షణ కావాలనుకునే వారు ఈ పాలసీని ఎంచుకోవచ్చు. అగ్ని ప్రమాదం, పేలుళ్లు, భూకంపం, వరదలు వంటి వివిధ ప్రకృతి భీభత్సాల కారణంగా వాహనానికి ఏదైనా నష్టం జరిగితే ఈ పాలసీ సదరు నష్టాన్ని భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా... రైలు, రోడ్డు, విమానం, షిప్‌లు వంటి వివిధ రవాణా సాధనాల్లో వాహనాన్ని తరలించేటప్పుడు ఏదైనా నష్టం జరిగినా కూడా ఈ పాలసీ ద్వారా పరిహారాన్ని పొండటానికి వీలుంటుంది.

థర్డ్‌‌పార్టీ లీగల్‌ లయబిలిటీ:
ఈ పాలసీ ప్రమాదం కారణంగా ఇతరులకు జరిగిన నష్టాన్ని మాత్రమే ఇది భర్తీ చేస్తుంది. అంటే, ఏదైనా శాశ్వతగాయం తగిలినా లేదా ప్రమాదంలో వ్యక్తి మరణించినా, వాహనానికి నష్టం జరిగినా పరిహారం అందుతుంది. ఈ పాలసీ వాహన యజమానికి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తప్పనిసరి చేయబడినది.

More from DriveSpark

Article Published On: Monday, November 14, 2011, 14:39 [IST]
English summary
Just a scratch on your hard earned bike can make you sigh every time you see it. Imagine the plight, if you see it in bits and pieces due to a major accident. No, this is not an article to sell an insurance but to give a fine guideline to find the best insurance for your bike. Read further to avoid the common mistakes while buying a safe insurance and other safety measures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+