ఆటో విడిభాగాలకు కూడా క్లెయిమ్ పొందవచ్చు..!

ప్రస్తుతం మార్కెట్లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా సంస్థలు వాహన బీమా సేవలను అందిస్తున్నాయి. వాహన బీమా తీసుకునేటప్పుడు సదరు బీమా ఏ కంపెనీ నుండి కొనుగోలు చేయాలో నిర్ధారించుకోవడం అత్యంత ప్రధానమైన అంశం. బీమా కంపెనీ విశ్వనీయతా స్థాయి, క్లెయిమ్ హిస్టరీ, క్యాష్ లెస్ సర్వీసింగ్, ఇతర అదనపు సేవల గురించి పూర్తిగా విచారించుకున్న తర్వాత మాత్రమే వాహన బీమా పాలసీను తీసుకోవాలి.
బోనస్ ఎవరికి వర్తిస్తుంది..?
సాధారణంగా వాహన బీమాలో ప్రీమియం అనేది రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా నిర్ణయిస్తారు. అంతేకాకుండా, సగటు క్లెయిమ్‌తోతో పాటు మరికొన్ని ఇతర అంశాలు కూడా ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. వాహన తరగతి (వెహికల్ క్లాస్), వాహనం తయారీ అయిన సంవత్సరం, వాహన ఖరీదులను బట్టి ప్రీమియంను లెక్కించడం జరుగుతుంది. వాస్తవానికి ఖరీదైన కార్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. సురక్షితమైన డ్రైవింగ్ ట్రాక్ రికార్డు ఉంటే ఓన్ డ్యామేజ్ ప్రీమియంలో బీమా కంపెనీల నుండి కొంత తగ్గింపును కూడా పొందవచ్చు.
అనగా, నో క్లెయిమ్ బోనస్‌గా అందుకోవచ్చన్నమాట. ఈ బోనస్ వాహన యజమానికే వర్తిస్తుంది. అంతేకానీ వాహనానికి వర్తించదు. ఒకవేళ ఏదైనా వాహన యజమాని ప్రస్తుతం తన వద్ద ఉన్న వాహనాన్ని విక్రయించి వేరొక కొత్త వాహనాన్ని కొనాలనుకున్నప్పుడు నో క్లెయిమ్ బోనస్ బదిలీ అవుతుంది. ఎందుకంటే, ప్రస్తుత వాహనం యజమాని పేరుతో ఉంటుంది కాబట్టి, ఈ నో క్లెయిమ్ బదిలీ అవుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధారణ వాహన బీమా పాలసీలకు కూడా అనేక యాడ్ ఆన్ కవర్లు లభిస్తున్నాయి.
బీమా క్లెయిమ్‌లో కోత ఉండదు:
కొన్ని బీమా కంపెనీలు వాహన బీమా క్లెయిమ్ చేసినప్పుడు పూర్తి క్లయిమ్‌ను చెల్లించవు, మొత్తం పరిహారంలో కొంత కోతను విధిస్తుంటాయి. అయితే, వాహన విడిభాగాలను మార్పిడి చేయించుకున్నప్పుడు మాత్రం పూర్తి పరిహారాన్ని పొందే అస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








