డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తే రూ.5,000 జరిమానా!

Mobile Phone Driving
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఖబడ్డార్..!! ఇకపై మీ ఆటలు సాగవు..! మందుకొట్టి, ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారి వీపు విమానం మ్రోత మోగనుంది. ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు జైలుశిక్షలు విధించాలని ప్రవేశపెట్టిన "మోటార్ వెహికల్ అమెండ్‌మెంట్ బిల్ 2007"కు యూనియన్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది.

ఈ బిల్లును ఆమోదిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా బిల్లు ప్రకారం జరిమానాలు భారీగా అంటే, ఐదు రెట్ల మేర పెరగనున్నాయి. ప్రమాద బాధితులకు చెల్లిస్తున్న పరిహారం పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కూడా భారీ జరిమానాలు విధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మార్చి 12 నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఓ సవరణ (అమెండ్‌మెంట్) ద్వారా మోటార్ వాహన చట్టంలో మార్పులు చేయనున్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు లేదా ఐప్యాడ్‌లను ఉపయోగించినట్లయితే, మొదటి తప్పుకు జరిమానాగా రూ.500 లను వసూలు చేస్తారు. అదే తప్పును మళ్లీ (రెండవసారి) చేసినట్లయితే రూ.2,000 నుండి రూ.5,000 ల జరిమానాను విధించనున్నారు.

డ్రైవింగ్ చేస్తున్న కేవలం ఫోన్ చేయటమే కాదండోయ్.. మెసేజ్‌లు పంపించటం, మొబైల్ ఫోన్ల కోసం హ్యాండ్స్‌ ఫ్రీ పరికరాలు (బ్లూటూత్) ఉపయోగించటం వంటివి కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన క్రిందకు రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, March 2, 2012, 19:29 [IST]
English summary
The fines for traffic violations such as drunken driving will soon be made more strict as part of the amendments to the Motor Vehicles Act. Drunk drivers would not only be fined five times higher, but will also face jail terms up to four years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+