డ్రింక్ అండ్ డ్రైవ్: భారీ జరిమానాలు ప్లస్ 4 ఏళ్ల జైలు

* రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసినట్లయితే మొదటి తప్పుకు రూ.100 నుండి రూ.500 మధ్య జరిమానా విధిస్తారు. అదే తప్పును రెండోసారి కూడా చేసినట్లయితే ఈసారి రూ.300 నుండి రూ.1500 మధ్య జరిమానా విధించటం జరుగుతుంది.

* మితిమీరిన వేగంతో వాహనం నడిపితే మొదటి తప్పుకు రూ.400 నుండి రూ.1,000 మధ్య జరిమానా విధిస్తారు. అదే తప్పును మళ్లీ చేసినట్లయితే ఈసారి రూ.2,000 నుండి రూ.5,000 మధ్య జరిమానా విధించటం జరుగుతుంది.

* ప్రమాదకరంగా వాహనం నడిపితే రెండవ తప్పుకు జరిమానాను రూ.2,000 నుండి రూ.5,000 లకు లేదా రెండేళ్ల పాటు జైలుశిక్షకు పెంచడం జరిగింది. ఈ విషయంలో మొదటిసారి తప్పుకు పెనాల్టీ ఎలాంటి మార్పు ఉండదు. మొదటి తప్పుకు రూ.1,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు శిక్షలు అమలయ్యే అవకాశం ఉంది.

ఆల్కహాల్ సేవించి వాహనం నడిపినట్లయితే విధించే జరిమానాలు, శిక్షలను మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది, అవి క్రింది విధంగా ఉన్నాయి:

1. 100 మి.లీ. రక్తంలో 30-60 మి.గ్రా. ఆల్కహాల్ నమోదైనట్లయితే, ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది.

2. 100 మి.లీ. రక్తంలో 60-150 మి.గ్రా. ఆల్కహాల్ నమోదైనట్లయితే, ఒక్క ఏడాది పాటు జైలుశిక్ష లేదా రూ.4,000 జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది.

3. 100 మి.లీ. రక్తంలో 150 మి.గ్రా. లకు పైగా ఆల్కహాల్ నమోదైనట్లయితే, రెండేళ్ల పాటు జైలుశిక్ష లేదా రూ.5,000 జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది.

* ఒకవేళ, ఎవరైనా మత్తుపదార్థాలు (నార్కోటిక్స్, డ్రగ్స్) తీసుకుని వాహనం నడపుతూ పట్టుబడ్డట్లయితే, మొదటి తప్పుగా ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.5,000 జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది. ఇదే తప్పును రెండోసారి చేసినట్లయితే ఆరు నెలల జైలుశిక్షతో పాటుగా రూ.10,000 జరిమానాను విధించి లైసెన్సు రద్దు చేయటం జరుగుతుంది.

ఇక చివరిగా.. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణించినట్లయితే, పరిహారాన్ని రూ.25,000 నుండి రూ.1,00,000 లకు, తీవ్రంగా గాయపడినట్లయితే రూ.50,000 లకు పెంచడం జరిగింది.

కాబట్టి, మిత్రులారా..! ఇకనైనా.. మేలుకోండి.. తెలుసుకోండి.. ప్రాణం/నిండు జీవితం కన్నా విలువైనది మరొకటి లేదు.

More from DriveSpark

Article Published On: Friday, March 2, 2012, 19:27 [IST]
English summary
The fines for traffic violations such as drunken driving will soon be made more strict as part of the amendments to the Motor Vehicles Act. Drunk drivers would not only be fined five times higher, but will also face jail terms up to four years.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+