మీరు రూల్స్ పాటించకపోయినా.. మేము పాటిస్తాం..!

* ఎల్లప్పుడూ రోడ్డుకు ఎడమవైపే డ్రైవ్ చేయండి, ఎదురుగా వచ్చే వాహనాలకు దారి ఇవ్వండి.
* ఎల్లప్పుడూ కుడి వైపున ట్రాఫిక్‌కు దారి ఇవ్వండి, ముఖ్యంగా రోడ్ జంక్షన్స్, సర్కిల్స్ వద్ద.
* లెఫ్ట్ టర్న్ లేదా రైట్ టర్న్ తీసుకునేటప్పుడు స్ట్రైట్‌గా వెళ్లే వాహనాలకు దారి ఇవ్వండి.
* ఎడమవైపుకు తిరిగేటప్పుడు (లెఫ్ట్ టర్న్), మీరు ప్రవేశించే అవతలి రోడ్డుకు ఎడమవైపుగా మాత్రమే టర్న్ తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఆ రోడ్డులో కుడివైపు నుండి వచ్చే వాహనాలకు దారి ఇచ్చినట్లవుతుంది.
* జంక్షన్లు, ఇంటర్‌సెక్షన్లు, పాదచారులు రోడ్డు దాటే ప్రదేశాలు (పెడస్టేరియన్ క్రాసింగ్స్), పాఠశాల ప్రదేశాలు (స్కూల్ జోన్స్), దేవాలయాలు (టెంపుల్స్) మొదలగు రద్దీ ప్రదేశాల్లో వాహనం నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్లండి.
* జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్‌లను బ్లాక్ చేయకండి.
* ఒకవేళ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్లయితే, సహనంతో ఉండండి. మధ్య లైన్లను క్రాస్ చేసి, అవతలి లైన్లను (ఆపోజిట్ లైన్) బ్లాక్ చేయకండి.
* ద్విచక్ర వాహనంపై వెళ్తున్నప్పుడు ఎల్లవేళలా హెల్మెట్‌ను ధరించండి. హెల్మెట్ స్ట్రాప్ సరిగ్గా బిగించుకోండి.
* నిర్దేశించబడిన వేగ పరిమితి (స్పీడ్ లిమిట్)ను దాటి డ్రైవ్ చేసి ప్రమాదాలకు గురికాకండి. ట్రాఫిక్ పరిస్థితులకు అనుగుణంగానే వేగ పరిమితులు నిర్దేశించబడుతాయని గుర్తుంచుకోండి.
మరింత సమాచారం కోసం (NEXT)పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








