హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా
Style: ఎస్‌యూవీ
11.00 - 20.15 లక్ష
జీఎస్టీ ఎక్స్-షోరూమ్ ధర

హ్యుందాయ్ ప్రస్తుతం 28 విభిన్న వేరియంట్లు మరియు 6 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. హ్యుందాయ్ క్రెటా ధరలు, సాంకేతిక వివరాలు మరియు మైలేజీతో పాటు మరిన్ని వివరాలు మీ కోసం. అంతే కాకుండా, హ్యుందాయ్ క్రెటా ఆన్-రోడ్ ధర మరియు ఇఎంఐ తెలుసుకోవచ్చు. పూర్తి వివరణతో కూడిన పోలిక ద్వారా హ్యుందాయ్ క్రెటా మరియు ఇతర ఎమ్‌యూవీ వాహనల గురించి సంక్షిప్త సమాచారాన్ని పొందవచ్చు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రతి హ్యుందాయ్ క్రెటా గురించి కావాల్సిన పూర్తి సమాచారాన్నిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
10,99,900
ఎస్‌యూవీ | Gearbox
12,17,700
ఎస్‌యూవీ | Gearbox
13,39,200
ఎస్‌యూవీ | Gearbox
14,32,400
ఎస్‌యూవీ | Gearbox
15,26,900
ఎస్‌యూవీ | Gearbox
15,41,900
ఎస్‌యూవీ | Gearbox
15,82,400
ఎస్‌యూవీ | Gearbox
15,94,900
ఎస్‌యూవీ | Gearbox
16,09,900
ఎస్‌యూవీ | Gearbox
17,23,800
ఎస్‌యూవీ | Gearbox
17,38,800
ఎస్‌యూవీ | Gearbox
17,44,900
ఎస్‌యూవీ | Gearbox
17,59,900
ఎస్‌యూవీ | Gearbox
18,69,800
ఎస్‌యూవీ | Gearbox
18,84,800
ఎస్‌యూవీ | Gearbox
19,99,900
ఎస్‌యూవీ | Gearbox
20,14,900

హ్యుందాయ్ క్రెటా డీజిల్ మోడళ్లు

వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధర
ఎస్‌యూవీ | Gearbox
12,44,900
ఎస్‌యూవీ | Gearbox
13,67,700
ఎస్‌యూవీ | Gearbox
14,89,200
ఎస్‌యూవీ | Gearbox
15,82,400
ఎస్‌యూవీ | Gearbox
17,32,400
ఎస్‌యూవీ | Gearbox
17,44,900
ఎస్‌యూవీ | Gearbox
17,59,900
ఎస్‌యూవీ | Gearbox
18,73,900
ఎస్‌యూవీ | Gearbox
18,88,900
ఎస్‌యూవీ | Gearbox
19,99,900
ఎస్‌యూవీ | Gearbox
20,14,900

హ్యుందాయ్ క్రెటా మైలేజ్

గేర్ బాక్స్ ఇంధన రకం మైలేజ్
పెట్రోల్ 0
డీజిల్ 0

హ్యుందాయ్ క్రెటా రివ్యూ

Rating :
హ్యుందాయ్ క్రెటా Exterior And Interior Design

హ్యుందాయ్ క్రెటా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్

హ్యుందాయ్ కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ, క్రెటా యొక్క ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను 2020 ఫిబ్రవరి నెలలో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ క్రెటా, పూర్తిగా రిఫ్రెష్ చేసిన డిజైన్‌తో వస్తుంది. ఇది కొత్త మరియు అదనపు ఫీచర్లను కలిగి ఉంటుంది. 

కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క డిజైన్ విషయానికి వస్తే, దీని ముందుభాగంలో పెద్ద క్యాస్కేడింగ్ గ్రిల్‌తో బ్రాండ్ యొక్క సరికొత్త డిజైన్ ల్యాంగ్వేజ్ తో వస్తుంది. గ్రిల్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఉంటాయి. కొత్త క్రెటాలోని ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు సి ఆకారపు ఆకృతిలో హెడ్‌ల్యాంప్‌లను చుట్టుముట్టాయి. ఫ్రంట్ బంపర్ కూడా తిరిగి రూపకల్పన చేయబడింది. సెంట్రల్ ఎయిర్ ఇన్టేక్ మరియు ఇరువైపులా ఫాగ్ లాంప్స్ ఉంటాయి.

సైడ్ మరియు రియర్ ప్రొఫైల్స్ కొత్త డిజైన్ తో ముందుకు వెళ్తాయి. సైడ్ ప్రొఫైల్ సరికొత్త డిజైన్‌తో వస్తుంది, ముఖ్యంగా దాని సి-పిల్లర్. హ్యుందాయ్ క్రెటా యొక్క అల్లాయ్ వీల్స్‌ కూడా పునఃరూపకల్పన చేయబడు మునుపటికంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది.

ఇక రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది సి-ఆకారపు టైల్ లైట్స్ తో వస్తుంది, ఇది ఎస్‌యూవీ హెడ్‌ల్యాంప్ యూనిట్ల మాదిరిగానే ఉంటుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్లతో పైకప్పుతో అమర్చిన స్పాయిలర్ తో వస్తుంది. హ్యుందాయ్ కొత్త క్రెటా యొక్క బూట్-లిడ్ పూర్తిగా రీ డిజైన్ చేయబడింది.

రీ-స్టైలింగ్ కేవలం బాహ్య భాగాలకు మాత్రమే పరిమితం కాదు, ఇంటీరియర్స్ కూడా పెద్ద మార్పులకు లోనయ్యాయి. క్రొత్త క్రెటా యొక్క ఇంటీరియర్స్ దాని పాత మోడల్‌తో పోలిస్తే ఎక్కువ ప్రీమియంగా అనిపిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఇంజన్ మరియు పనితీరు

హ్యుందాయ్ క్రెటా Engine And Performance

కొత్త హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు పూర్తిగా కొత్త బిఎస్ 6 ఇంజన్ అప్సన్స్ తో వస్తుంది. హ్యుందాయ్ తన పాత 1.6-లీటర్ మరియు 1.4-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ సమర్పణలను నిలిపివేసింది. క్రెటా ఇప్పుడు తన పవర్‌ట్రెయిన్‌ను, కియా సెల్టోస్ నుండి తీసుకుంది.

కొత్త హ్యుందాయ్ క్రెటాలో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్‌తో పాటు 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ అప్సన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ 115 బిహెచ్‌పి మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అయితే 1.5 లీటర్ డీజిల్ 115 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది.

రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు ఆప్సనల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ అందుకుంటాయి. మూడవ 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ యొక్క ఆప్సన్ లేకుండా, స్టాండర్డ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది.

హ్యుందాయ్ క్రెటా ఇంధన సామర్థ్యం

హ్యుందాయ్ క్రెటా Fuel Efficiency

కొత్త హ్యుందాయ్ క్రెటా దాని కొత్త బిఎస్ 6-కంప్లైంట్ ఇంజిన్లను కలిగి ఉండటం వల్ల మెరుగైన మైలేజ్ గణాంకాలను ఇస్తుంది. ఎంచుకున్న ఫ్యూయెల్ టైప్ మరియు ప్రసార ఎంపికలను బట్టి, ఇది 15 కిమీ/ లీటర్ నుండి 21 కిమీ/ లీటర్ మధ్య మైలేజ్ గణాంకాలను అందిస్తుందని హ్యుందాయ్ పేర్కొంది. ఏదేమైనా, వాస్తవ ఇంధన సామర్థ్య గణాంకాలు అనేక విభిన్న బాహ్య కారకాలపై కూడా మారుతూ ఉంటాయి.

హ్యుందాయ్ క్రెటా ముఖ్యమైన ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా Important Features

కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, ఎల్‌ఈడీ కార్నరింగ్ లాంప్స్, కీలెస్ ఎంట్రీ, స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, ఆపిల్ కార్ప్లేతో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు హ్యుందాయ్ యొక్క బ్లూ లింక్ కనెక్ట్ టెక్నాలజీ,ఫుల్లీ-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVM వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిడి విత్ ఎబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్ విత్ రియర్ వ్యూ సెన్సార్లు / కెమెరా, సీట్‌బెల్ట్ ప్రెటెన్షనర్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, లేన్-చేంజ్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా తీర్పు

హ్యుందాయ్ క్రెటా Verdict

హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్ మరియు బలమైన పనితీరు గల ఇంజిన్‌ల కారణంగా ఈ ఎస్‌యూవీ చాలామంది వినియోగదారులను ఆకర్షిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా హ్యుందాయ్ క్రెటా కలర్లు


Abyss Black Pearl
Robust Emerald Pearl
Ranger Khaki
Titan Grey
Fiery Red
Atlas White

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ క్రెటా డీజిల్ కాంపిటీటర్స్

హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ మైలేజ్ కంపారిజన్

  • మహీంద్రా స్కార్పియో-ఎన్ మహీంద్రా స్కార్పియో-ఎన్
    local_gas_station పెట్రోల్ | 0
  • ఎంజి హెక్టర్ ప్లస్ ఎంజి హెక్టర్ ప్లస్
    local_gas_station పెట్రోల్ | 0
  • టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ టొయోటా ఇన్నోవా హైక్రాస్‌
    local_gas_station పెట్రోల్ | 16.13

హ్యుందాయ్ క్రెటా డీజిల్ మైలేజ్ కంపారిజన్

  • టాటా సఫారీ టాటా సఫారీ
    local_gas_station డీజిల్ | 16.3
  • ఎంజి హెక్టర్ ఎంజి హెక్టర్
    local_gas_station డీజిల్ | 0
  • కియా సెల్టోస్ కియా సెల్టోస్
    local_gas_station డీజిల్ | 19.1

హ్యుందాయ్ హ్యుందాయ్ క్రెటా ఫోటోలు

హ్యుందాయ్ క్రెటా Q & A

కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఆఫర్‌లో ఉన్న వేరియంట్లు ఏవి?

హ్యుందాయ్ క్రెటా ఐదు వేరియంట్లలో అందించబడుతుంది. అవి ఇ, ఇఎక్స్, ఎస్, ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ).

Hide Answerkeyboard_arrow_down
కొత్త హ్యుందాయ్ క్రెటాలో కలర్ అప్సన్స్ ఏవి?

కొత్త హ్యుందాయ్ క్రెటా ఏడు పెయింట్ స్కీమ్ లతో అందించబడుతుంది. అవి టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్, పోలార్ వైట్, గెలాక్సీ బ్లూ, లావా ఆరెంజ్ మరియు రెడ్ మల్బరీ.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ క్రెటాకు ప్రత్యర్థులు ఏవి?

కొత్త హ్యుందాయ్ క్రెటా కియా సెల్టోస్, ఎంజి హెక్టర్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు ఫోక్స్వ్యాగన్ టి-రాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hide Answerkeyboard_arrow_down
కొనుగోలు చేయడానికి హ్యుందాయ్ క్రెటా యొక్క ఉత్తమ వేరియంట్ ఏది?

1.4-లీటర్ టర్బో-పెట్రోల్‌తో ఉన్న టాప్-స్పెక్ హ్యుందాయ్ క్రెటా ఉత్తమ ఎంపిక.

Hide Answerkeyboard_arrow_down
హ్యుందాయ్ క్రెటా లేదా కియా సెల్టోస్ లలో ఏది మంచిది?

రెండూ చాలా మంచి ఉత్పత్తులు మరియు ఫీచర్స్ మరియు పరికరాల హోస్ట్‌ను అందిస్తాయి. ఏదేమైనా, క్రెటా ఇప్పుడే ప్రారంభించబడినందున, ఈ సమయంలో తుది తీర్పు ఇవ్వడం కష్టం.

Hide Answerkeyboard_arrow_down
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X