రైలు హారన్లు 11 రకాలని మీకు తెలుసా.. ఒక్కో కూతకి ఒక్కో అర్థం.. తెలిస్తే ఆశ్చర్యపోతారు.!!
దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే ముఖ్యమైనది. ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. మీకు ఇప్పటివరకు రైళ్ల బోగీలు, ఇంజిన్, కోచ్‌ల గురించి తెలిసే ఉంటుంది. కానీ రైలు హారన్ల గురించి, అవి మొత్తం 11 రకాలు ఉంటాయని.. ఒక్కో హారన్‌కు ఒక్కో అర్థం ఉందని మీకు తెలుసా..
సాధారణంగా రైళ్లలో ప్రయాణించేటప్పుడు రకరకాల హారన్స్ మనకు వినిపిస్తున్నాయి. కిలోమీటర్ దూరం నుంచే స్టేషన్‌కు వచ్చే ముందు రైలు కూత వినిపిస్తుంది. ఇంకా స్టార్ట్ అయ్యేముందు వినిపిస్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా రకాల హారన్లు ఉన్నాయి. ఒక్కో హారన్‌కి ఒక్కో సంకేతం ఉంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

One Short Horn: ముందుగా 11 రకాల హారన్లలో మొదటిది వన్ షార్ట్ హారన్.. రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందుగా రైలును శుభ్రం చేసేందుకు సంబంధిత యార్డుకు తరలిస్తారు. ఆ సమయంలో ఈ హారన్ ఉపయోగిస్తారు. అయితే ఇది చాలా తక్కువ సమయం పాటు అంటే ఒకసారి మాత్రమే మోగుతుంది.
Two Short Horn: రెండవది టు షార్ట్ హారన్.. ఈ హారన్‌ను కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా రెండు సార్లు మోగిస్తారు. మోటార్ మెన్ రెండు షార్ట్ హారన్‌లు ఇచ్చినప్పుడు.. రైలును స్టార్ట్ చేయడానికి రైల్వే సిగ్నల్‌ను డైరెక్ట్ చేయమని గార్డుకి సూచించినట్లు అర్థం.

Three Smaller Horns: త్రీ షార్ట్ హారన్స్‌ను కూడా చాలా తక్కువ సమయం పాటు వరుసగా మూడుసార్లు మోగిస్తారు. లోకో పైలట్ ఇంజిన్‌పై నియంత్రణ కోల్పోయినప్పుడు వాక్యూమ్ బ్రేక్‌ను లాగాల్సిందిగా సిబ్బందికి సూచించడం కోసం ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.
Four Smaller horns: ఫోర్ షార్ట్ హారన్‌ను కూడా లోకో పైలట్ చాలా తక్కువ సమయం పాటు వరుసగా నాలుగు సార్లు ఈ హారన్‌ను మోగిస్తారు. రైలులో ఏదైనా టెక్నికల్ సమస్య తలెత్తినప్పుడు.. రైలు ముందుకు కదలలేదని సూచించడానికి లోకో పైలట్ ఈ హారన్‌ను ఉపయోగిస్తారు.

Continuous Horn: ఈ హారన్ ఆగకుండా కాసేపు మోగుతూనే ఉంటుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఎక్కువగా ఈ హారన్ ఉపయోగిస్తారు. ఈ హారన్ ఓ రకంగా ప్రయాణికులకు అలర్ట్ లాంటిది. కొన్ని స్టేషన్ల వద్ద రైలు ఆగదని సూచిస్తూ ఈ హారన్ మోగిస్తూ స్టేషన్ మీదుగా వెళ్తుంది.
One long horn and one short: ఈ హారన్‌ను రైలును ప్రారంభించే ముందు లోకో పైలట్ మోగిస్తారు. ఒక లాంగ్ హారన్ మోగిన తర్వాత షార్ట్ హారన్ ఉపయోగిస్తారు. రైలు ఇంజిన్‌ను స్టార్ట్ చేసేముందు బ్రేక్ పైప్ సిస్టమ్‌ను సెట్ చేయమని సిబ్బందికి సూచించేందుకు ఈ హారన్ ఉపయోగిస్తారు.

Two long and two short horns: రైలు ఇంజిన్‌ను ప్రాథమికంగా కంట్రోల్ చేయాల్సిన సమయంలో గార్డ్‌కు సూచిస్తూ లోకో పైలట్ ఈ హారన్ ఉపయోగిస్తారు. ఈ హారన్‌లో లోకో పైలట్ రెండు సార్లు లాంగ్ హారన్, రెండు సార్లు షార్ట్ హారన్ మోగిస్తారు.
Two horns with two pauses: టూ హార్న్స్ విత్ టూ పాజెస్ హారన్‌ను రైలు రైల్వే క్రాసింగ్‌ను దాటే సమయంలో లోకో పైలట్ మోగిస్తారు. ఈ హారన్ అర్థమేమిటంటే.. ఈ సందర్భంలో లోకో పైలట్ రెండు సార్లు హారన్లను ఆగి ఆగి మోగిస్తారు.

Two long and short horns: రైలు పట్టాలపై ట్రాక్‌ను మార్చే ముందు లోకో పైలట్ ఈ హారన్‌నను మోగిస్తారు. రెండు సార్లు లాంగ్ హారన్, ఒక షార్ట్ హారన్‌ను వరుసగా మోగిస్తారు. పదవది Two Short One Long Horn ఈ హారన్‌ను రెండు సందర్భాల్లో మోగిస్తారు. ఒకటి ప్రయాణికుడు చైన్ లాగిన సందర్భంలో లేదా.. గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్‌ను ఆన్ చేసినప్పుడు ఈ హారన్ మోగిస్తారు.
వరుసగా రెండు సార్లు షార్ట్ హారన్, ఒక లాంగ్ హారన్‌ను ఈ సందర్భంలో ఉపయోగిస్తారు. చివరిది.. Six times short horns రైలు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లోకో పైలట్ ఈ సిగ్నల్ ఉపయోగిస్తారు. వరుసగా ఆరు సార్లు చిన్న హారన్‌లు మోగిస్తారు.


Click it and Unblock the Notifications








