బీచ్‌లో మహీంద్రా థార్‌ నడుపుతూ దుమ్ము లేపుతున్న కీర్తి సురేష్‌.. మహానటి మల్టీ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.!!

మహానటి సినిమాతో నేషనల్‌ అవార్డు అందుకుని దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి కీర్తి సురేష్‌.. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దసరా సినిమాతో సూపర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ టాలెంటెడ్‌ స్టార్‌.. ఇప్పుడు మహీంద్రా థార్‌ను డ్రైవ్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది.

కీర్తి సురేష్‌ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీగా మారిపోయింది. వరుస చిత్రాలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఎన్నో హిట్స్‌ను ఖాతాలో వేసుకున్న ఈ మహానటి ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా నటిస్తున్నట్లుగా ఇటీవల నెట్టింట్లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి ఆఫ్‌ రోడ్‌ డ్రైవింగ్‌(Off Road Driving) వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Keerthy-Suresh-Mahindra-Thar-Driving

ఇందుకు సంబంధించి కీర్తి సురేష్(Keerthy Suresh) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. కీర్తి కడలా బీచ్‌లో మహీంద్రా థార్ నడపడాన్ని చూడవచ్చు. 'ఆఫ్‌ రోడింగ్‌ ఇన్‌ అవర్‌ చెన్నై' అని పేర్కొంటూ ఈ బ్యూటీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 55 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. 7 లక్షల వరకూ లైక్‌ చేశారు.

ఈ పోస్ట్‌ పట్ల నెటిజన్లు తెగ క్రేజ్‌ ఫీల్‌ అవుతున్నారు. కీర్తి సురేష్‌ టాలెంట్‌కు ఫిదా అవుతున్నారు. వైవిధ్యమైన పాత్రలతో పాటు ఇలా మహీంద్రా థార్‌(Mahindra Thar)ను ఇసుకలో స్వయంగా తానే డ్రైవ్‌ చేయడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో వాట్‌ ఏ టాలెంట్‌ అంటూ కీర్తిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే సినిమా షూటింగ్‌లో భాగంగానే ఈ ఆఫ్‌ రోడర్‌ను డ్రైవ్‌ చేశారా అనేది స్పష్టంగా తెలియదు.

Keerthy-Suresh-Mahindra-Thar-Driving

ఇక మహీంద్రా థార్‌ SUV గురించి చెప్పాలంటే.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీని రూ. 10.98 లక్షల నుంచి రూ. 16.94 లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉంది. ఇందులో మూడు ఇంజిన్ల ఆప్షన్‌ ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను అందించారు.

మహీంద్రా థార్‌లో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. 4WD (Four Wheel Drive), RWD (Rear Wheel Drive) టెక్నాలజీని ఇందులో అమర్చారు. అయితే ఇది ఆఫ్-రోడర్‌ కావడం వల్ల ఇది ఆన్‌ రోడ్ వాటి కంటే తక్కువ మైలేజ్‌ ఇస్తుంది. లీటరుకు 15.2 మైలేజ్‌ ఇస్తుంది.

Keerthy-Suresh-Mahindra-Thar-Drivingన
Keerthy-Suresh-Mahindra-Thar-Driving

ఎవరెస్ట్ వైట్, ఆక్వామెరిన్, రెడ్ రేజ్‌తో సహా విభిన్నమైన ఆకర్షణీయమైన కలర్స్‌లో మహీంద్రా థార్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్‌లో సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రేర్‌ పార్కింగ్ సెన్సార్‌లతో సహా అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. కాగా ప్రస్తుతం, చెన్నై బీచ్‌లో కీర్తి సురేష్ నడుపుతున్న మహీంద్రా థార్ తనదేనా అనే సమాచారం అందుబాటులో లేదు.

Keerthy-Suresh-Mahindra-Thar-Driving

ఇక టాలీవుడ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌కు ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 1.3 కోట్ల విలువైన BMW X7 లగ్జరీ కారు ఉంది. ఇంకా రూ. కోటి విలువైన పోర్షే కయెన్‌కు ఆమె సొంతం. ఇంకా Mercedes-Benz CLA కారులో అప్పుడప్పుడూ కీర్తి బయటకు వస్తుంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 6, 2023, 14:22 [IST]
English summary
Actress keerthi suresh drives mahindra thar in chennai beach video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+