మొదటి సారి ఆ కారులో కనిపించిన నటి సమంత [వీడియో]

సాధారణంగానే సెలబ్రెటీలు, పారిశ్రామికవేత్తలు మరియు క్రికెటర్లు మొదలైనవారు ఖరీదైన & విలాసవంతమైన లగ్జరీ కార్లను కలిగి ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే మనం చాలాసార్లు హీరోలు, హీరోయిన్లను సైతం చాలా ఖరీదైన కార్లలో చూసాము. అయితే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న 'సమంత' అత్యంత ఖరీదైన 'రోల్స్ రాయిస్ ఘోస్ట్‌' (Rolls Royce Ghost) కారులో కనిపించింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

పుష్ప సినిమాలో 'ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా' అంటూ కుర్రకారును ఉర్రూతలూగించిన 'సమంత' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'ఏ మాయ చేసావే' సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'సమంత' అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈ నటి ఇటీవల అత్యంత ఖరీదైన 'రోల్స్ రాయిస్ ఘోస్ట్‌' కారులో ముంబై విమానాశ్రయంలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

ఈ వీడియోలో నటి సమంతను 'రోల్స్ రాయిస్ ఘోస్ట్‌' తో చూడవచ్చు. ఇందులో సమంత ఫోటోగ్రాఫర్లకు పోజులివ్వడం వంటివి కూడా చూడవచ్చు. ఆ తరువాత అభిమానవులకు చేతులు ఊపుకుంటూ ముందుకు వెళ్ళింది. ఈ వీడియోలో మనం రోల్స్ రాయిస్ కారుని స్పష్టంగా చూడలేము. ఎందుకంటే అది కేవలం కొంత సమయం మాత్రమే అక్కడ ఉండి ముందుకు వెళ్ళిపోతుంది. అయితే ఈ కారు 'సమంత' కి చెందినదా.. లేదా విమానాశ్రయానికి చేరుకోవడానికి ఆ కారుని ఉపయోగించిందా అనేది స్పష్టంగా తెలియదు.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

సహజంగానే సమంతకు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే తన గ్యారేజిలో ఖరీదైన కార్లను కలిగి ఉంది.సమంత కార్ గ్యారేజ్ లో ఇప్పటికే కేమాన్ జిటిఎస్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ వంటి వాటితో పాటు బిఎండబ్ల్యు 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్ఎఫ్ మరియు ఆడి క్యూ7 వంటి కార్లను కూడా కలిగి ఉంది. సమంత బ్యారీజీలో ఖరీదైన కార్లను గురించి మరింత సమాచారం కోసం ఈ లింకుపైన క్లిక్ చేయండి.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

సమంత ఇప్పటికే చాలా సార్లు ఇతర ఖరీదైన కార్లలో కనిపించింది. కానీ రోల్స్ రాయిస్ ఘోస్ట్‌లో కనిపించడం బహుశా ఇదే మొదటిసారి. వీడియోలో కనిపిచ్చే ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ మునుపటి తరం మోడల్. ఈ మోడల్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 6.6-లీటర్ వి12 ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 562 బిహెచ్‌పి పవర్ మరియు 780 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జాతఃచేయబడి ఉంటుది.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్స్. ఇవి ఖరీదైనప్పటికీ ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఇవి ఎక్కువగా సంపన్నులు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర విషయానికి వస్తే.. దీని ధర అక్షరాల రూ. 6.95 కోట్ల నుండి రూ. 7.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఇదిలా ఉండగా పుష్ప సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ ప్రస్తుతం 'యశోద' మరియి 'శాకుంతలం' వంటి సినిమాలతో బిజీగా ఉంది. ఇవి త్వరలోనే విడుదలకానున్నాయి.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

భారతదేశంలో ఎంతో మంది ప్రముఖులు మరియు పారిశ్రామిక వేత్తలు ఈ రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో సంజయ్ దత్, ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, బాలీవుడ్ రాపర్ బాద్ షా వంటి నటులకు కూడా రోల్స్ రాయిస్ ఉంది. వీరు మాత్రమే కాకుండా అంబానీ ఫ్యామిలీ కూడా ఈ ఖరీదైన 'రోల్స్ రాయిస్ కల్లినన్' కలిగి ఉంది.

రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్న కుటుంబాలలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కూడా ఒకటి. ఈ కార్లు ఎక్కువ ధర కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. ఈ కారణంగానే భారతదేశంలో చాలా తక్కువమంది మాత్రమే ఈ రోల్స్ రాయిస్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.

రోల్స్ రాయిస్ కారుతో కనిపించిన 'సమంత': ఈ కారు ఎవరిదో?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రోల్స్ రాయిస్ కారులో నటి సమంత కనిపించడం ఇదే మొదటిసారి. అయితే ఈ కారు ఆమెకు సంబంధించిందా.. లేదా అనేది తెలియరాలేదు.సెలబ్రెటీలు లగ్జరీ కార్లలో కనిపించడం ఇదే మొదటిసారి కారు. గతంలో సన్నీలియోన్ కూడా ఎంజి గ్లోస్టర్ SUV తో కనిపించింది.

Most Read Articles

English summary
Actress samantha ruth prabhu seen in roll royce ghost details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X