ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

భారతదేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో రోజురోజుకి కొత్త కొత్త పరిణామాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అవి వాహనాల విషయంలో కావచ్చు, జీవన శైలిలో కావచ్చు. మనిషి తనకు నచ్చిన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే రెస్టారెంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. మనం ఇప్పటి వరకు సముద్రం ఒడ్డున ఉన్న రెస్టారెంట్, కొండలలో ఉన్న రెస్టారెంట్స్ వంటి వాటిని గురించి తెలుసుకుని ఉంటాము. అయితే ఇప్పుడు ఒక విమానం రెస్టారెంట్ గా మారింది. వినడానికి కొంత కొత్తగా ఉన్నప్పటికీ ఇది నిజమే.. ఈ ఏరోప్లేయిన్ రెస్టారెంట్ గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

సాధారణంగా చాలామంది ప్రజలు జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కళలు కంటూ ఉంటారు. కొంతమంది కళలు నిజమవుతాయి, మరికొంతమంది కళలు, కలలుగానే మిగిలిపోతాయి. అయితే ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలోని వడోదర ప్రాతంలో ఒక విమానాన్ని రెస్టారెంట్ గా మార్చారు. ఇది నిజంగా చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

గుజరాత్‌లో విమానం తరహా రెస్టారెంట్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ రకమైన ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ అక్టోబర్ 25న ప్రారంభించబడింది. వడోదరలోని దర్సాలి బైపాస్ ప్రాంతంలో ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో అనేక విమాన రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి, అయితే భారతదేశంలో గుజరాత్‌లో ప్రారంభించబడిన ఈ రెస్టారెంట్ ప్రపంచంలోనే 9వ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

ఇది భారతదేశంలోని 4వ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్‌లలో ఒకటిగా భారతదేశపు కీర్తిని నలుదిశల్లో వ్యాపింపజేస్తుంది. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి భోజనం చేయాలనుకునే వారికి ఈ రెస్టారెంట్ విమానంలో ప్రయాణించిన ఒక భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

నివేదికల ప్రకారం ఎయిర్‌బస్ 320 బెంగుళూరుకు చెందిన కంపెనీ నుండి ఈ రెస్టారెంట్‌ను స్థాపించడానికి కొనుగోలు చేయబడింది. ఈ విమానాన్ని రూ. 1.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. విమానంలోని ప్రతి భాగాన్ని వడోదరకు తీసుకొచ్చి రెస్టారెంట్ ఏర్పాటు చేస్తారు. ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ ఖరీదు ఇప్పుడు దాదాపు రూ. 2 కోట్లు. ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్‌లో మొత్తం 102 మంది కూర్చుని భోజనం చేయవచ్చు.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

ఇక్కడికి వచ్చిన వారికి నిజమైన విమానం ఎక్కిన అనుభవం కలుగుతుంది. ఈ రెస్టారెంట్ యొక్క సర్వర్లు మరియు సిబ్బంది విమాన సహాయకులు వలె దుస్తులు కూడా ధరిస్తారు. కావున మీరు ఈ రెస్టారెంట్‌లో విమాన ప్రయాణ అనుభవాన్ని తప్పకుండా పొందవచ్చు.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ లో వివిధ రకాల వంటకాలను అందుబాటులో ఉంటాయి, ఇందులో పంజాబీ, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్ మరియు థాయ్ వంటకాలు ఉన్నాయి. ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ లో గొప్ప అనుభూతిని పొందటం కోసం చాలామంది ప్రజలు వస్తున్నారు.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

వడోదర ప్రాంతం ప్రజలు మాత్రమే కాకుండా, గుజరాత్‌ చుట్టుపక్కల వివిధ ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ ఏరోప్లేన్ రెస్టారెంట్ నిజంగా చాలామంది కళను నెరవేరుస్తుంది.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

బోయింగ్ మరియు ఎయిర్‌బస్ ప్రపంచంలోని ప్రముఖ విమానయాన సంస్థలలో ఒకటి. ఎయిర్‌బస్ తన ప్రసిద్ధ విమానాలలో ఒకదానిని రెస్టారెంట్‌గా మార్చింది, దీనికి కస్టమర్ల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్‌కి ఒక్కసారైనా వెళ్లాలని సోషల్ మీడియాలో చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

భారతదేశంలో కరోనా మహమ్మారి సమయంలో అనేక రంగాల‌తో పాటు హోట‌ల్ రంగం కూడా తీవ్ర క్షీణ‌ణ‌ను చవిచూసింది. చాలా మంది హోటళ్లను మూసివేసి ఇతర ఉద్యోగాల కోసం వెతికే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, ఈ ఎయిర్‌ప్లేన్ రెస్టారెంట్ యజమానులు వేరే వ్యూహాన్ని ఆశ్రయించారు. ఈ వ్యూహం వినియోగదారులను ఎంతగానో ఆకర్శించడంలో విజయం పొందుతోంది.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

ఏరోప్లేన్ హోటల్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఇందులో నిజమైన విమానం ప్రయాణ అనుభవాన్ని పొందవచ్చు. ఇలాంటి విమాన హోటల్ లో మీరు కూడా భోజనం చేయాలనీ అనుకుంటే తప్పకుండా వడోదర ప్రాంతాన్ని సందర్శించి ఈ అద్భుతమైన అనుభవాన్ని పొందండి.

ఏరోప్లేయిన్ రెస్టారెంట్.. ఒక్క సారైన చూతము రారండి

సాధారణంగా విమానాల్లో ప్రయాణించే వారు, విమానంలోని డోర్స్ చుట్టూ మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చుట్టూ ఒక మందపాటి లైన్ గమనించవచ్చు. అయితే చాలామంది ప్రయాణికులకు ఈ మందపాటి లైన్ ఎందుకు ఇవ్వబడుతుందనే అనుమానాలు వస్తుంటాయి.

విమానాల్లో కనిపించే ఈ మందపాటి లైన్స్ విమానం యొక్క ఆకర్షణను పెంచడానికి రూపొందించబడ్డాయి అని కొందరు అనుకోవచ్చు. కానీ ఇది కొంతమేరకు నిజమే అయినా, నిజానికి దీనిని విమానాలలో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేయడం జరిగింది. విమానం డోర్స్ మరియు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చుట్టూ భద్రత కోసం బోల్డ్ లైన్లు ఉపయోగించబడ్డాయి.దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Airplane restaurant started in vadodara details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X