మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి థార్ ఎస్‌యూవీ గిఫ్ట్
క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్(Cricketer Sarfaraz Khan) తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్ మహీంద్రా. దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా క్రీడారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందిస్తూ వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ప్రకటిస్తుంటారు. ఈక్రమంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి కూడా ఖరీదైన బహుమతిని అందించారు.
టీమ్ ఇండియా ప్లేయర్ సర్ఫరాజ్‌ఖాన్ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 'థార్' ఎస్‌యూవీని బహుమతిగా అందించారు ఆనంద్ మహీంద్రా. ఇందుకు సంబంధించిన వీడియోను సర్ఫరాజ్ ఖాన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ స్టేటస్‌లో సంబంధిత ఫొటో మరియు వీడియోను షేర్ చేశారు. సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ తన ఇద్దరు కుమారులతో కలిసి మహీంద్రా థార్ కారును డెలివరీ తీసుకుంటూ.. కారులో కూర్చోవడాన్ని చూడవచ్చు.

గత ఫిబ్రవరిలో, ఆనంద్ మహీంద్రా తన 'X' ఖాతాలో సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్(Mahindra Thar To Naushad Khan)కు మహీంద్రా థార్‌ను బహుమతిగా ఇస్తానని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'కఠోర శ్రమ, ధైర్యం, ఓర్పు.. కొడుకుల్లో స్ఫూర్తి నింపేందుకు తండ్రికి ఉండాల్సిన ఉత్తమ లక్షణాలు ఇవేనంటూ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. దీనికి రిప్లైగా థార్ కారును బహుమతిగా అందుకోవడం తన గౌరవమంటూ నౌషాద్ ఖాన్ పేర్కొన్నారు.
గత ఫిబ్రవరి 15న గుజరాత్ రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం చేసి హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టెస్టు క్యాప్‌ను ప్రదానం చేశాడు. ఈ సంఘటనను చూసి తండ్రి నౌషాద్ భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

కాగా సర్ఫరాజ్ తండ్రి నౌషాద్ ఖాన్ మహీంద్రా థార్ కారులో ఏ వేరియంట్‌ను పొందారనే వివరాలు స్పష్టంగా తెలియవు. దేశీయ మార్కెట్లో.. థార్ 3-డోర్ వేరియంట్‌లో రూ. 11.25 లక్షల నుండి రూ. 17.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో అందుబాటులో ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉంది. ఇది ఆఫ్-రోడ్ SUV కాగా లీటర్‌కు 15.2 కి.మీ మైలేజ్‌ని ఇస్తుంది.
ఇందులో ఫీచర్ల విషయానికొస్తే.. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ AC వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇందులో ఎయిర్ బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ఫీచర్లు ఉన్నాయి.

కాగా ఈ IPL మినీ వేలంలో సర్ఫరాజ్ అమ్ముడుపోలేదు. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబి) ద్వారా ఐపీఎల్‌లోకి ప్రవేశించిన సర్ఫరాజ్ 2015 నుంచి 2018 వరకు RCB లో కీలక పాత్ర పోషించాడు. మళ్లీ 2019 నుండి 2021 వరకు పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. 2022 మరియు 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








