సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రికి ఆనంద్‌ మహీంద్రా స్పెషల్‌ గిఫ్ట్‌.. తండ్రీకొడుకుల భావోద్వేగానికి ప్రశంసలు.!!

గ్రౌండ్‌లో క్రికెటర్ల పర్ఫామెన్స్‌కు ఫ్యాన్స్‌ ముగ్ధులవడం, చప్పట్లు కొట్టడం షరా మామూలే. ఈ ఆటను సెలబ్రిటీలు కూడా విపరీతంగా ఎంజాయ్‌ చేస్తారు. అందుకు ఆనంద్ మహీంద్రా కూడా అతీతం కాదు. అర్ధ సెంచరీ సాధించి బ్యాట్‌తో చెడుగుడు ఆడిన క్రికెటర్‌ ఆటతీరుకు ఫిదా అయి.. ఆనంద్‌ మహీంద్రా ఓ విలువైన బహుమతిని ప్రకటించారు. అదేంటంటే..

టీమిండియాకు ఆడాలనుకున్న తన కలను సుదీర్ఘ కాలం శ్రమించి నెరవేర్చుకున్నాడు ముంబయి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్. మొత్తానికి ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు టీమిండియా తుది జట్టులో స్థానం సంపాదించుకున్న ఈ యువ బ్యాటర్.. తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ కొట్డాడు. అదృష్టవశాత్తు రనౌట్‌ కాకుండా సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంతలా తన బ్యాటింగ్‌తో క్రికెట్‌ ప్రియులను అలరించాడు.

Mahindra-Thar-Sarfaraz-Khan-Father-Gift

సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఓ క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో అతని తండ్రి నౌషాద్‌ ఖాన్‌ కృషి ఎనలేనిది. అందుకే ఇంగ్లండ్‌పై అర్ధ సెంచరీ సాధించగానే.. గ్రౌండ్‌లోకి వచ్చిన నౌషాద్‌ ఖాన్‌.. కొడుకుని హత్తుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ వీడియో పట్ల, సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆట తీరు పట్ల.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయ్యారు.

దీనిపై ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌(X-Twitter) వేదికగా స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. తండ్రీకొడుకుల ఆప్యాయతకు ముగ్ధుడైన మహీంద్రా.. ఈ మేరకు సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రికి మహీంద్రా థార్‌ ఎస్‌యూవీని బహుమతిగా ప్రకటించారు. ఈ గిఫ్ట్‌ను అంగీకరించాలని కోరారు.

Mahindra-Thar-Sarfaraz-Khan-Father-Gift

"ధైర్యంగా ఉండండి.. అవకాశాలు రాలేదని సహనం కోల్పోవద్దు.. కఠోర శ్రమ, తెగువ, ఓర్పు.. విజయానికి దారులు ఇవే.. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఓ తండ్రికి ఇంతకంటే మెరుగైన లక్షణాలు ఇంకేం ఉంటాయి.??'' అని ఆనంద్‌ మహీంద్రా ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌లో ఓ సర్‌ప్రైజ్‌ను కూడా ప్రకటించారు.

"తన పిల్లలకు ఓ స్ఫూర్తిదాయకమైన తండ్రిగా ఉన్న నౌషాద్ ఖాన్‌కు మహీంద్రా థార్ ఎస్‌యూవీ వాహనాన్ని కానుకగా ఇద్దామని అనుకుంటున్నాను. మా బహుమతిని అందుకునేందుకు నౌషాద్ ఖాన్ అంగీకరిస్తే అందుకు ఎంతో ఆనందిస్తాం.. అది మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం" అని ఆనంద్ మహీంద్రా ఎక్స్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Mahindra-Thar-Sarfaraz-Khan-Father-Gift

కాగా నౌషాద్ ఖాన్ ముంబయిలో క్రికెట్ కోచ్‌గా వ్యవహరించారు. తండ్రి నౌషాద్ ఖాన్ శిక్షణలో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ మెళకువలు నేర్చుకుని.. ప్రస్తుతం దేశంలో ప్రతిభావంతులైన బ్యాటర్లలో గుర్తింపు సాధించాడు. అయితే, సెలెక్టర్లు అతడిని టీమిండియాకు ఎంపిక చేయడానికి చాలా సమయం తీసుకోవడమే అభిమానులకు నిరాశను మిగిల్చింది.

రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ మైదానంలో.. టీమిండియా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో మొదటిసారి సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం లభించడంతో.. తన తొలి అర్ధ సెంచరీని విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ మేరకు నెట్టింట్లో సర్ఫరాజ్‌ ఖాన్‌కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

మహీంద్రా ఈ కారును ఆఫ్-రోడ్ SUVగా భారత మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ కారు ధర మార్కెట్‌లో రూ. 13.31 లక్షల నుంచి రూ. 20.48 లక్షల ధరలో అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ ఇంజిన్ కారులో 1997 సీసీ ఇంజన్ అమర్చారు.

డీజిల్ వెర్షన్ కారులో 2,174 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 4x4 డ్రైవ్ కారు. గ్లోబల్‌ క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు 4 స్టార్ ర్యాంకింగ్‌ను సాధించింది. ఆఫ్‌ రోడ్‌ డ్రైవింగ్‌ పరంగా ఈ కారు భారత మార్కెట్లో మంచి ప్రజాదరణను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 17, 2024, 12:46 [IST]
English summary
Anand mahindra gifts mahindra thar suv to sarfaraz khans father check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+