మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య భీభత్సమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు వదిలారు. అంతే కాకుండా చాలా మంది ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ భీకరమైన యుద్ధంలో తమను తాము కాపాడుకోవడానికి బి ఈ వైద్య విద్యార్థులు స్వదేశాలకు పయనమయ్యారు. ఇందులో భారతీయ వైద్య విద్యార్థులను మనదేశానికి తీసుకురావడానికి భారతప్రభుత్వం 'ఆపరేషన్ గంగ'ను ప్రారంభించి ఏంతోంది విద్యార్థులను మనదేశానికి తీసుకువచ్చింది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

అయితే ఇందులో నవీన్‌ అనే విద్యార్థి బాంబు దాడిలో చనిపోయాడు, ఈ విషయంలో భారతప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఇప్పుడు వీలైనంత త్వరగా మన దేశ విద్యార్థులు మనదేశానికి తీసుకురావడానికి సన్నాహాలను మరింత వేగవంతం చేసింది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

ఈ విషయం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రను కూడా చాలా కలిచి వేసింది. ఈ కారణంగా ఆనంద్ మహీంద్రా భారతదేశంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఉక్రెయిన్‌లో 18,000 మంది భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటాను విడుదల చేసిన తర్వాత, ఆనంద్ మహీంద్రా మనదేశంలో ఇలాంటి కాలేజీల కొరత ఉందని తనకు స్పష్టంగా తెలియదన్నారు. కానీ ఇప్పుడు వైద్య కళాశాలల నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

ఆనంద్ మహీంద్రా తన ఆలోచనలను గురించి టెక్ మహీంద్రా MD & CEO, CP గుర్నానీని ట్విట్టర్‌లో ట్యాగ్ చేశాడు. ఆనంద్ మహీంద్రా కూడా భారతదేశంలో వైద్య కళాశాలలకు ఇంత కొరత ఉందని నాకు తెలియద, అని అన్నారు. అంతే కాకూండా అతను CP గుర్నానీని "CP గుర్నానీ, మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టడీస్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనను మనం అన్వేషించగలమా?" అని అడిగాడు.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

దీనిపైన చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు మహీంద్రా ఛైర్మన్ ఆలోచనను స్వాగతించగా, వారిలో కొందరు భారతదేశంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో భారీ ఫీజుల నిర్మాణం గురించి కూడా హెచ్చరించారు. వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తరుణంలో ఈ ట్వీట్ వచ్చింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, యూరోపియన్ దేశంలో దాదాపు 18,000 మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో 605 మెడికల్ కాలేజీలు మరియు సంవత్సరానికి 90,825 సీట్లు ఇస్తున్నామని తెలిపారు. 2021లో MBBS అడ్మిషన్ కోసం దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కి హాజరయ్యారు.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

అయితే మన దేశంలో మాత్రమే కాకూండా భారతదేశం నుండి చాలా మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్, బెలారస్, రష్యా, జార్జియా, ఆర్మేనియా, చైనా, ఫిలిప్పీన్స్ మరియు ట్రినిడాడ్ వంటి దేశాలను ఎంచుకుంటున్నారు. ఇందులో చదువుకోడానికి మనదేశంలో కంటే కూడా తక్కువ ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంటుంది0 అంతే కాకూండా ఎక్కువమంది విదేశాల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆశిస్తున్నారు.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

ఆనంద్ మహీంద్రా ఇప్పటికే భారతదేశంలో మహీంద్రా విశ్వవిద్యాలయాన్ని నడుపుతోంది. మహీంద్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్, BA, BBA, BA LLB, M.Tech, MBA మరియు PhD ప్రోగ్రామ్‌లతో సహా అనేక అధ్యయన కోర్సులను అందిస్తుంది. అయితే ఎక్కువమంది కొన్ని ప్రొఫెషనల్ కోర్సులను చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కావున ఉన్న కళాశాలలు వారికి సరిపోవడం లేదు. అయితే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా కొత్త కాలేజీని నిర్మిస్తే కొంతవరకు సీట్ల కొరత తగ్గుతుందని ఆశిస్తున్నాము.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

ఆనంద్ మహీంద్రా భారాతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలలో ఒకరుగా ఉన్నారు. ఎందుకంటే 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ దేశీయ వాహన తయారీ సంస్థ మరియు ప్రజలు కంపెనీ యొక్క ఉత్పత్తులపైన పెంచుకున్న నమ్మాకమె. ఇప్పటికే కంపెనీ మహీంద్రా థార్ అనే ఆఫ్ రోడ్ SUV విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ SUV విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందింది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

మహీంద్రా & మహీంద్రా కంపెనీ ఇటీవల మహీంద్రా XUV700 విడుదల చేసి మరిన్ని మంచి అమ్మకాలతో ముందుకు వెళుతోంది. ఇది కూడా ఇప్పుడు అత్యధిక అమ్మకాలను చేపడుతున్న కంపెనీ యొక్క లేటెస్ట్ ఉత్పత్తి. కంపెనీ త్వరలో కొత్త అప్డేటెడ్ మహీంద్రా స్కార్పియో విడుదల చేయనుంది.

మెడికల్ కాలేజ్ నిర్మాణానానికి ఆనంద్ మహీంద్రా ముందడుగు.. కారణం అదే

2022 మహీంద్రా స్కార్పియో (2022 Mahindra Scorpio) ఇప్పటికే చాలా సార్లు టెస్ట్ చేయబడింది. టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన ఈ కొత్త మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త స్కార్పియోలో అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలు అందుబటులో ఉన్నాయి. దీని గురించి పూర్తి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Monday, March 7, 2022, 10:12 [IST]
English summary
Anand mahindra plans to start medical college in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+