స్పాట్ టెస్ట్‌లో కనిపించిన 2022 Mahindra Scorpio: పూర్తి వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) కంపెనీ యొక్క 2022 మహీంద్రా స్కార్పియో (2022 Mahindra Scorpio) ఇప్పటికే చాలా సార్లు టెస్ట్ చేయబడింది. టెస్టింగ్ సమయంలో గుర్తించబడిన ఈ కొత్త మోడల్ త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త స్కార్పియోలో అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలు అందుబటులో ఉన్నాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

2022 మహీంద్రా స్కార్పియో అనేది ఇప్పడూ లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పైన నిర్మించబడుతోంది. ఈ కొత్త SUV లో సన్‌రూఫ్ ఉంటుందని ఇప్పటికే గుర్తించబడింది. కావున త్వరలో దేశీయ విఫణిలో విడుదల కానున్న కొత్త 2022 మహీంద్రా స్కార్పియో పెద్ద సన్‌రూఫ్‌ని పొందుతుంది. మహీంద్రా యొక్క స్కార్పియోలో ఇప్పటివరకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

2022 మహీంద్రా స్కార్పియో యొక్క ఇంటీరియర్ కూడా పూర్తిగా కొత్తదిగా ఉంటుంది. కావున ఇందులో చాలావరకు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు బ్లూ సెన్స్ కనెక్టివిటీ టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లను ఇప్పుడు ఒక యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు.

కొత్త మహీంద్రా స్కార్పియో కొత్త డిజైన్ పొందుతుంది, తద్వారా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ అమర్చబడి ఉంటుంది. ఈ గ్రిల్ హారిజాంటల్ మరియు మధ్యలో ఐదు వర్టికల్ స్లేట్‌లను పొందుతుంది. దీనితో పాటు, రెండు వైపులా హెడ్‌లైట్ యూనిట్లు ఇవ్వబడ్డాయి, వీటిని రెండు భాగాలుగా విభజించి, దిగువ భాగంలో ఫాగ్ లైట్ ఉంచారు. వెనుక భాగంలో రిజిస్ట్రేషన్ ప్లేట్ కూడా ఉంటుంది. మొత్తానికి ఇది మంచి డిజైన్ పొందుతుంది.

స్కార్పియో యొక్క బానెట్‌పై లైన్‌లను కూడా చూడవచ్చు. ఇది ముందు వైపు నుండి వాహనానికి చాలా బలమైన రూపాన్ని ఇస్తుంది. పెద్ద అల్లాయ్ వీల్స్ దాని సైడ్ పార్ట్‌లో కనిపిస్తాయి. ఇది ఈ SUV పరిమాణానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. దీని సైడ్ స్టెప్‌లు మునుపటి కంటే పెద్దవిగా ఉంచబడతాయి. కావున ఇవి ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక ఈ కొత్త మోడల్ యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ టెయిల్‌గేట్ మరియు దానిని ఓపెన్ చేయడానికి సైడ్ లో డోర్ హ్యాండిల్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా మీరు చూడవచ్చు. ఇవన్నీ కూడా మహీంద్రా స్కార్పియోని మరింత అద్భుతంగా చూపిస్తాయి.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులోని ఇంజిన్లు విభిన్నంగా ట్యూన్ చేయబడ్డాయి. ఈ ఇంజిన్ అనేది టాప్ వేరియంట్లో ఒకరకంగా మరియు లో వేరియంట్లో ఒకరకంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులోని కొన్ని వేరియంట్లు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్సన్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా పొందే అవకాశం ఉంది.

2022 మహీంద్రా స్కార్పియో 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ పొందే అవకాశం ఉంటుంది. ఇందులోని ఇంజిన్లు తప్పకుండా మంచి పనితీరుని అందిస్తాయని చెప్పవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక సేఫ్టీ పరంగా కొత్త స్కార్పియో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ పొందుతుంది.

ఈ కొత్త మహీంద్రా స్కార్పియో యొక్క సీటింగ్ సమాచారం గురించిన సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ కెప్టెన్ సీట్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. ఈ కెప్టెన్ సీట్ అనేది మహీంద్రా యొక్క ఎక్స్‌యువి700 లో కూడా త్వరలో అందుబటులో ఉంటుంది.

ఇదిలా ఉండగా దేశీయ మార్కెట్లో మహీంద్రా కంపెనీ SUV అమ్మకాలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో కంపెనీ 2022 జనవరి నుంచి తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ఈ ధరల పెరుగుదల కంపెనీ యొక్క అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

మహీంద్రా యొక్క కొత్త 2022 స్కార్పియో విడుదలకు సంబంధించిన సమాచారం కూడా ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. ఇవన్నీ కూడా త్వరలోనే వెల్లడవుతాయి. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.
Source: Rushlane


Click it and Unblock the Notifications








