ఫన్నీ యాక్సిడెంట్‌ వీడియోను షేర్‌ చేసిన ఏథర్‌ ఎనర్జీ యజమాని.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు

రోడ్డుపై ఎవరికైనా యాక్సిడెంట్‌ జరిగితే అయ్యో పాపం అనుకుంటాం. వీలైతే వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ వీడియోలోని యాక్సిడెంట్‌(Funny Accident Video) దృశ్యాలను చూస్తే మాత్రం.. మీరు పడీ పడీ నవ్వుకుంటారు. ఎందుకంటే వీడియో మొదట్లో మీరు అయ్యో అనుకున్న కాసేపటికే ఫక్కున నవ్వడం ప్రారంభిస్తారు.

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కానీ చాలా వరకు ప్రమాదాలు మనకు బాధనే కలిగిస్తాయి. కానీ ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ కో ఫౌండర్‌ తరుణ్‌ మెహతా షేర్‌ చేసిన ఓ వీడియో మాత్రం ఇప్పుడు తెగ నవ్వు తెప్పించడమే కాకుండా వైరల్‌ అవుతోంది.

Funny-Accident-Video-By-Ather-Energy

తరుణ్‌ మెహతా ఈ వీడియోను తన X(గతంలో ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. అయితే ఈ సంఘటన భారత్‌లో జరిగింది కాదు.. ఎక్కడో విదేశాల్లో జరిగింది. అయితే ఎక్కడ జరిగిందనే సమాచారం మాత్రం అందుబాటులో లేదు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియోలోని సమాచారం ప్రకారం ఇద్దరు యువతులు స్కూటర్‌పై వెళ్తున్నారు. వారు వెళ్తున్న దారిలో రోడ్డుపై కారు ఆగి ఉంది. దీంతో వారు బండి సడెన్‌గా రైట్‌ టర్న్‌ తీసుకోలేక ఆపి కిందకు దిగేందుకు ప్రయత్నించారు. కానీ ఒక్కసారిగా వారు తమ బ్యాలెన్స్‌ తప్పి కింద పడిపోయారు. కానీ అక్కడ స్కూటర్‌ కారును ఢీకొట్టకుండా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు.

Funny-Accident-Video-By-Ather-Energy

యువతులు కింద పడటం గమనించిన అక్కడున్న ఓ వ్యక్తి వారిని కాపేందుకు వారి దగ్గరకు వస్తారు. రోడ్డుపై పడిపోయిన స్కూటర్‌ను పైకి లేపేందుకు యత్నిస్తారు. అయితే యువతులు కిందకు దిగేముందు స్కూటర్‌ ఇంజిన్‌ ఆఫ్‌ చేయడం మర్చిపోయారు. దీంతో ఆ వ్యక్తి స్కూటర్‌ను పైకి లేపగానే.. అది ఆన్‌లో ఉండటంతో స్కూటర్‌తో పాటు అతను కూడా నేరుగా వెళ్లి పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు.

అయితే స్కూటర్లలో క్లచ్ లేదా గేర్ ఉండదు. యాక్సిలరేటర్ సాయంతో మాత్రమే అంటే యాక్సిలేటర్‌ను వేసిన వెంటనే అవి స్పీడ్‌గా మూవ్‌ అవుతాయి. ఈ సంఘటనలో యువతి స్కూటర్‌ను ఆపిన వెంటనే ఇంజిన్‌ కూడా ఆఫ్‌ చేసి ఉంటే సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి నీళ్లలో పడిపోయేవాడు కాదని తెలుస్తోంది. మోటార్ సైకిళ్లకు గేర్లు, క్లచ్‌లు ఉంటాయి కాబట్టి.. సడెన్‌గా బండి కింద పడిపోయినా ఇలాంటివి జరగవు.

Funny-Accident-Video-By-Ather-Energy

ఈ వీడియోను ఏథర్‌ ఎనర్జీ కో ఫౌండర్‌ తరుణ్ మెహతా తన X ఖాతాలో షేర్‌ చేశారు. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కస్టమర్లు ఇలాంటి సమస్యను చూడలేరని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో మోటారు ఆటోమేటిక్‌గా ఆగిపోతుందన్నారు. కాగా రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల్లో మరిన్ని భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టడం గురించి ఆలోచన చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా నీళ్లలో పడిపోయిన వ్యక్తి పట్ల తరుణ్‌ మెహతా విచారం వ్యక్తం చేశారు. అతను మరింత జాగ్రత్తగా ఉండాల్సిందన్నారు. ఏదేమైనా ఈ వీడియో మనకు హాస్యాస్పదంగా కనిపించినా ఇలాంటివి ప్రమాదాలకు దారి తీస్తాయి. ఆ దారిలో మరేదైనా వాహనం వచ్చి ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 17, 2023, 12:32 [IST]
English summary
Ather energy co founder shares funny scooter accident video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+