తక్కువ ధరలో అధిక మైలేజీ ఇచ్చే బైక్‌ల కోసం చూస్తున్నారా.. ఈ లిస్ట్ మీకోసం!
భారత్‌లో సాధారణంగా పండుగల సీజన్‌లో ఎక్కువగా వాహనాల విక్రయాలు జరుగుతాయి. ఈ సీజన్‌లో వాహనాల సంస్థలు కూడా తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్ల, డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఫలితంగా కస్టమర్లను ఆకట్టుకోవచ్చని సంస్థలు భావిస్తాయి.
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అధిక మైలేజీ, సరసమైన ధరకు అందుబాటులోకి ఇచ్చే వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ కథనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధిక మైలేజీ ఇచ్చే మోటార్ సైకిళ్ల ఇంజిన్, పనితీరు సహా పూర్తి వివరాలు అందించాం.

Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ భారత్ ప్రజల నుంచి భారీ ఆదరణ పొందింది. ఈ బైక్ గత 30 సంవత్సరాలుగా విక్రయానికి సిద్ధంగా ఉంది. మన్నిక, మైలేజీ, ధర కారణంగా ఈ బైక్ దేశంలో అత్యుత్తమ వాహనాల్లో ఒకటిగా ఉంది.
ఈ బైక్ 97.2cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7.91bhp శక్తి, 8.05Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ రహదారి, పరిస్థితులకు అనుగుణంగా 60 kmpl కి పైగా మైలేజీ ఇస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ధర రూ.74,641 నుంచి రూ.75,701 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ బైక్ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Bajaj Platina 100 : ప్రస్తుతం భారత్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అధిక మైలేజీ ఇచ్చే బైక్‌లలో బజాబ్ ప్లాటినా 100 మోటార్ సైకిల్ ఒకటి. ఈ బైక్ 102cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 7.79bhp శక్తి, 8.30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 70 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ ధర రూ.69,638 (ఎక్స్‌షోరూం)గా ఉంది. ఈ బైక్‌కు మంచి డిమాండ్ ఉంది.
TVS Radeon : భారత్ మార్కెట్‌లో అధిక మైలేజీ, సరసమైన ధరకు కొనుగోలు చేసే బైక్‌ల్లో టీవీఎస్ రేడియన్ ఒకటి. ఈ బైక్ 109.7సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8bhp శక్తి, 8.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 70 కి.మీ మైలేజీని ఇస్తుంది. టీవీఎస్ రేడియన్ బైక్ ప్రారంభ ధర రూ.62,405 (ఎక్స్‌షోరూం)గా ఉంది.
Honda Shine 125 : హోండా షైన్ బైక్ భారత్‌లో గరిష్ఠ సంఖ్యలో విక్రయాలు నమోదు చేసింది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ 123.9సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 10.59bhp శక్తి, 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 65 kmpl మైలేజీ ఇవ్వనుంది. ఈ బైక్ ధర రూ.80,426 (ఎక్స్‌షోరూం)గా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








