‘నువ్వు చెప్పినట్లు చేస్తే మేం దివాలా తీయడం ఖాయం'.. చిన్నారి వీడియోకు ఆనంద్‌ మహీంద్రా రిప్లై వైరల్.!!

మీరు చెప్పినట్లే చేస్తే త్వరలోనే నేను దివాలా తీయడం పక్కా అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతే కాకుండా ఆ వీడియో చూసి కూడా తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది.? ఆనంద్‌ మహీంద్రా ఎందుకు అలా రెస్పాండ్‌ అయ్యారు.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.. తన సోషల్ మీడియా అకౌంట్‌ X(ట్విట్టర్‌)లో ఆయన షేర్‌ చేసిన కొన్ని వీడియోలు, పోస్ట్‌లు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియోకు ఆయన ఇచ్చిన రిప్లై ఇప్పుడు నవ్వులు పుట్టించడమే కాకుండా తెగ వైరల్‌ అవుతోంది.

Anand-Mahindra-Thar-RS-700

ఇటీవల షోరూమ్‌కి వెళ్లి కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని రూ.700 కే కొనమని ఓ చిన్న పిల్లవాడు తన తండ్రిని కోరిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 'చీకు' అనే బాలుడు ఎక్స్‌యూవీ 700(XUV 700) మరియు థార్(Thar) ఒకే కారు అని భావించేవాడు. అందుకే రూ. 700 కే థార్ కొనగలనని తండ్రి చెబుతున్నాడు.

ఈ బాలుడి వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లింది. ఆ చిన్నారికి కార్లపై ఉన్న మక్కువ చూసి మెచ్చుకున్నాడు. వెంటనే ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా తన X ఖాతాలో షేర్‌ చేశారు. ఓ నెటిజన్‌ తనకు చీకూ వీడియో పంపించారని పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ చిన్నారికి కార్లపై ఉన్న ఇష్టం చూసి సంతోషిస్తున్నట్లు చెప్పారు.

Anand-Mahindra-Thar-RS-700

అయితే సమస్య ఏమిటంటే.. తాను కోరుకున్న కారును రూ. 700 కే అమ్మితే తన కంపెనీ త్వరలో దివాలా తీయడం ఖాయమని ఆనంద్ మహీంద్రా ఫన్నీగా రాసుకొచ్చారు. రూ. 700 ఇస్తే కారు కొంటానని చెప్పిన ఆ చిన్నారి వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. బాలుడి కోరికను తీర్చమని కొందరు ఆనంద్ మహీంద్రాను కోరారు.

లేదంటే రూ. 700 కే థార్ లేదా XUV 700 అనే కారు బొమ్మను తయారుచేసి బాలుడికి గిఫ్ట్‌గా ఇవ్వమంటూ మరొకరు కామెంట్‌ చేశారు. వాటిని పిల్లలకు బహుమతులుగా ఇస్తే సంస్థ ప్రశంసలు మరింతగా పెరుగుతాయని మరికొందరు సలహా ఇస్తున్నారు. ఇంకా రూ. 700 మొత్తానికి కారు కోసం లక్కీ డ్రా నిర్వహించవచ్చని చెబుతున్నారు. దీంతో విజేతకు అంతే మొత్తంలో కారు లభిస్తుందని కామెంట్‌ చేశారు.

Anand-Mahindra-Thar-RS-700

కాగా భారత మార్కెట్లో ప్రస్తుతం మహీంద్రా థార్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ. 16.94 లక్షల(ఎక్స్-షోరూమ్‌) మధ్యలో ఉంది. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. మహీంద్రా థార్‌ను మూడు ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఒకటి 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లు.

మహీంద్రా థార్‌ ఎస్‌యూవీ 4WD (ఫోర్ వీల్ డ్రైవ్), RWD (రేర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా జతచేయబడి ఉంటుంది. థార్‌ ఆఫ్-రోడ్ SUV కావడంతో.. ఇది 15.2 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

మహీంద్రా థార్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఎయిర్ బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఇక మహీంద్రా XUV 700 భారత మార్కెట్లో ప్రస్తుతం ధర రూ. 14.03 లక్షల నుంచి రూ. 26.57 లక్షల(ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌ల ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో XUV 700 అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 26, 2023, 12:12 [IST]
English summary
Boy wants thar for rs 700 anand mahindra replied to this video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+