అతివేగంతో టాటా నెక్సాన్‌ను ఢీకొట్టిన బస్సు.. చెక్కు చెదరని క్యాబిన్, ఆ ఫీచర్లే కాపాడాయి.!!
స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన కార్లు.. క్వాలిటీ పరంగా ప్రతి సందర్భంలో అత్యుత్తమైనవిగా నిరూపించుకుంటున్నాయి. ఎలాంటి ప్రమాదం సంభవించినా టాటా కార్ల బిల్ట్ క్వాలిటీతో ప్రయాణికులకు భద్రతను కల్పిస్తూ.. వారి ప్రాణాలను కాపాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా Tata Nexon SUV ఈ వరుసలో ముందుంటుంది.
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్ SUV 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో ఉత్తమ స్కోర్ సాధించడంతో పాటు సైడ్ కొలిజన్‌లో కూడా భేష్ అనిపించుకుంది. ఈ క్రమంలో ఇటీవల టాటా నెక్సాన్ కారుకు సంబంధించిన రేండు వేర్వేరు యాక్సిడెంట్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మొదటగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఓ యాక్సిడెంట్‌కు సంబంధించిన విజువల్‌ను యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. అహ్మదాబాద్‌లో టాటా నెక్సాన్ EV.. జంక్షన్ రూట్‌లో వెళుతుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. అయితే ఇక్కడ కారు డ్రైవర్ తప్పేమీ లేదని స్థానికులు చెబుతున్నట్లు సమాచారం.
ఈ యాక్సిడెంట్‌లో క్రాష్ కారణంగా నెక్సాన్ EV బంపర్, ఫెండర్, డోర్లు డ్యామేజ్ అయ్యాయి. కారుకు ఎడమవైపు ఫ్రంట్ వీల్స్ దెబ్బతిన్నాయి. అయితే కారు లోపల భాగంలో ఏ మేరకు నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. కాగా ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఎయిర్‌బ్యాగ్‌లు ఆన్ అవ్వడంతో.. డ్రైవర్‌తో పాటు ఫ్రంట్ సీట్ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఘటనలో బస్సు బంపర్ దెబ్బతినడం చూడవచ్చు.

మరో యాక్సిడెంట్ ఘటనలో ఫ్యూయెల్‌తో నడిచే Tata Nexon SUV కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కేరళలో జరిగింది. అయితే ఇక్కడ టాటా నెక్సాన్‌ను వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఘటనలో ప్రైవేట్ బస్సు ఎడమ ముందు భాగం దెబ్బతిన్నట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది.
కాగా ప్రమాదంలో నెక్సాన్ కారు అంతగా డ్యామేజ్ కాలేదని అర్థమవుతోంది. నెక్సాన్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమా అనేది స్పష్టంగా తెలియదు. ఏదేమైనా ఈ రెండు ఘటనల్లోనూ టాటా నెక్సాన్ SUV దాని అద్భుతమైన పనితీరుతో ప్రయాణికులను కాపాడింది.

ఫ్యూయెల్‌తో నడిచే టాటా నెక్సాన్ SUV దేశీయ మార్కెట్లో రూ.8.09 లక్షల ప్రారంభ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్, 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇంకా ఫీచర్ల విషయానికొస్తే ఇందులో పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, కనెక్ట్ కార్ టెక్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
టాటా నెక్సాన్ SUV భద్రతా ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్, పార్కింగ్ సెన్సార్లతో ది బెస్ట్ కారుగా రూపొందించారు. అందుకే సేఫ్టీ పరంగా కూడా చాలా మంది టాటా నెక్సాన్ కార్లను కొనడానికి ఇష్టపడతారు.

దేశీయ మార్కెట్లో అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ EV కారు అందుబాటులో ఉంది. Tata Nexon EV ఆన్-రోడ్ ధర రూ. 15.52 లక్షలు (ఎక్స్ షోరూమ్-ఢిల్లీ)గా ఉంది. ఇందులో 30 kWh మరియు 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి 325 km నుంచి 465 km రేంజ్‌ను ఇస్తుంది.

ఇక భద్రతా పరంగా టాటా నెక్సాన్ EV కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ వంటి వివిధ భద్రతా ఫీచర్లతో అద్భుతంగా రూపొందించారు. ఇంకా ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో వివిధ ఫీచర్లతో అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








