హ్యాపీ బర్త్ డే బాలయ్య.. 'లెజండ్' సినిమాలో ఉపయోగించిన కస్టమైజ్డ్ టాటా సఫారీ చూసారా..?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో 'లెజండ్' అనే కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో బాలయ్య కోసం కస్టమైజ్డ్ బైక్‌నే కాకుండా ఓ కస్టమైజ్డ్ టాటా సఫారీ ఎస్‌యూవీని కూడా తయారు చేయించారు. తాజాగా విడుదల చేసిన లెజెండ్ ఫస్ట్ లుక్ ఫొటోలో బాలకృష్ట ఈ కస్టమైజ్ట్ టాటా సఫారీ ఎస్‌యూవీ ముందుకు నిలుచుకొని కనిపిస్తాడు.
బాలయ్యకు అభిరుచికి అనుగుణంగా ఈ కారును కస్టమైజ్ చేసినట్లు కనిపిస్తుంది. రెగ్యులర్ టాటా సఫారీ ఎస్‌యూవీని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. ముందు వైపు డిజైన్‌ను పూర్తిగా మార్చి వేశారు. కొత్త డిజైన్‌తో కూడిన ఫ్రంట్ బంపర్, బంపర్‌లో చివర్లలో ఉండే ల్యాంప్స్, బంపర్‌కు మధ్యలో పైభాగంలో ఉండే అదనపు హెడ్‌ల్యాంప్స్, కారు పైభాగంలో ఉండే నాలుగు సెర్చ్ లైట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ఇది కూడా చదవండి: బాలయ్య బైక్ మేకింగ్ వీడియో
ఫ్రంట్ బంపర్‌పై మధ్యలో ఒరలో ఉండే రెండు కత్తులతో కూడిన ప్రత్యేకమైన డిజైన్, దానిపై సింహపు బొమ్మ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫ్రంట్ బానెట్‌పై ఎయిర్ ఇన్‌టేక్‌తో కూడిన కొత్త డిజైన్, సైడ్ మిర్రర్లపై టర్న్ ఇండికేటర్స్ కొత్తగా ఉంటాయి. ఈ కస్టమైజ్డ్ ఎస్‌యూవీలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన టైర్లు. ఆఫ్-రోడ్ వాహనాలకు ఉపయోగించే వెడల్పాటి, పెద్ద టైర్లను ఇందులో ఉపయోగించారు.
ఈ పెద్ద టైర్లను ఉపయోగించడం వలన టాటా సఫారీ గ్రౌండ్ క్లియరెన్స్ భారీగా పెరిగింది. దీని కస్టమైజేషన్‌లో ఎక్కువ భాగం క్రోమ్ గార్నిష్ చేశారు. ఈ కారుకు ఏపి 31 ఏ 6666 అనే రిజిస్ట్రేషన్ నెంబరును ఉపయోగించారు. ఇక లెజెండ్ చిత్రం విషయానికి వస్తే, వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. ఫిబ్రవరి 2014లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications









