Just In
- 10 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 21 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 22 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 24 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Movies
Rang De Total Collections: నితిన్‌కు రెండో షాక్.. 24.50 కోట్ల టార్గెట్.. చివరకు వచ్చింది ఎంతంటే!
- Sports
మంచి గిఫ్ట్‌తో బెన్‌స్టోక్స్‌కు రాజస్థాన్ రాయల్స్ వీడ్కోలు..!
- News
కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు
- Finance
జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో ట్రాన్సాక్షన్స్ ఛార్జీలపై ఎస్బీఐ వడ్డీ రేటు, ఫ్రీ ట్రాన్సాక్షన్స్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ న్యూస్: ఫోర్జరీ కేసులో డిసి డిజైన్స్ అధినేత దిలీప్ ఛాబ్రియా అరెస్ట్!
భారతదేశపు ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ చాబ్రియాను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డిసి డిజైన్ వ్యవస్థాపకులైన దిలీప్ ఛాబ్రియాను మోసం, ఫోర్జరీ కేసులో అరెస్టు చేసినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (సిఐయు) పోలీసులు తెలిపారు.

బహుళ కార్ల రిజిస్ట్రేషన్ రాకెట్‌కు సంబంధించిన మోసం, ఫోర్జరీ కేసులో ఛాబ్రియాపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే తెలిపారు.

ఇందర్మాల్ రమణి పేరిట నమోదు చేసిన సుమారు 75 లక్షల రూపాయల విలువైన హైఎండ్ స్పోర్ట్స్ కారును ఛాబ్రియా నుండి తమిళనాడు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
MOST READ:ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ధైర్యం కావాలి.. ఈ వీడియో చూడటానికి గుండె ధైర్యం కావాలి

ఈ కేసులో ఛాబ్రియాపై చీటింగ్, ఫోర్జరీ, విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్రలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఇందుకు సంబంధించి త్వరలో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని ముంబై పోలీసులు తెలిపారు.

ఈ కేసులో రిజిస్ట్రేషన్ పత్రాలను నకిలీ చేసి, వాటి సాయంతో బహుళ వాహనాలను రిజిస్టర్ చేయడం వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఛాబ్రియాపై ఐదు మంది వ్యక్తులు ఫిర్యాదు చేయగా, వారిలో ఒక ప్రముఖ నటి కూడా ఉన్నట్లు సమాచారం.
MOST READ:అటల్ టన్నెల్‌లో కొత్త రికార్డ్ ; ఏంటో అది అనుకుంటున్నారా.. ఇది చూడండి

దిలీప్ ఛాబ్రియా భారత టాప్ కార్ డిజైనర్లలో ఒకరు మరియు డిసి డిజైన్ అనే కార్ మోడిఫికేషన్ స్టూడియో వ్యవస్థాపకుడు. ఛాబ్రియా అనేక మంది ప్రముఖుల కోసం కస్టమైజ్డ్ కార్లను, ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకమైన వానిటీ వ్యాన్లను రూపొందిస్తుంటారు. అంతేకాకుండా, డిసి అవంతి అనే మేడ్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ కారును కూడా సృష్టించారు.

కాగా, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు మిలింద్ భరంబే నిరాకరించారు. అయితే, ఈ కేసులో ఛాబ్రియా అరెస్టును ఆయన ధృవీకరించారు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున మరిన్ని వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పారు.
MOST READ:ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసిన బాలీవుడ్ భామ.. ఈ కార్ ధర ఎంతంటే ?

అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజ్ కేసును పరిశీలిస్తున్నారు. ఛాబ్రియాను మంగళవారం నాడు ఎస్‌ప్లాందే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మహీంద్రా థార్ కోసం డిజి డిజైన్స్ డ్రెస్ కిట్
మహీంద్రా థార్ కోసం కంపెనీ అందిస్తున్న లెవల్స్‌కు మించి కస్టమైజేషన్ ఆప్షన్స్ పొందాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని డిసి2 (గతంలో డిసి డిజైన్స్ అని పిలిచేవారు) ఓ సరికొత్త డ్రెస్ కిట్‌ను పరిచయం చేసింది.
MOST READ:ఇకపై ఈ రైళ్లకు డ్రైవర్ అవసరం లేదు.. ఇదెక్కడో కాదు మనదేశంలోనే..

డిసి2 ఆఫర్ చేయనున్న ఈ కస్టమైజేషన్ కిట్‌ను స్టాక్ మోడల్‌పై సులువుగా బోల్ట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కిట్‌లోని మార్పులను గమనిస్తే, డిసి2 డ్రెస్ కిట్‌తో కొత్త థార్‌ను పూర్తిగా భిన్నమైన ఫ్రంట్ డిజైన్‌లో కనిపిస్తుంది. ఈ కొత్త మార్పులతో మహీంద్రా థార్ చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.