కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం థార్ ఎస్‌యూవీ అతికొద్ది సమయంలోనే అశేష ప్రజాదరణ పొందింది. ఈ సరికొత్త ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

మహీంద్రా థార్‌లో ఇదివరకెన్నడూ లేని విధంగా కంపెనీ గణనీయమైన డిజైన్ మార్పులు మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ చేయడమే ఈ మోడల్ విజయానికి కారణంగా చెప్పుకోవచ్చు. ప్రతి కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మరియు వారి అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే సౌలభ్యంతో కొత్త థార్ అందుబాటులోకి వచ్చింది.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

కొత్త తరం మహీంద్రా థార్ కోసం కంపెనీ ఇప్పటికే అధికారిక యాక్ససరీలను మరియు కస్టమైజేషన్/పర్సనలైజేషన్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. అయితే, వీటికి భిన్నంగా కొత్త 2020 మహీంద్రా థార్ కోసం ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ దిలీప్ చాబ్రియాకు సంబంధించిన డిసి డిజైన్స్ సరికొత్త డ్రెస్ కిట్‌ను పరిచయం చేసింది.

MOST READ:చెన్నై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నెల్

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

కంపెనీ అందిస్తున్న లెవల్స్‌కు మించి కస్టమైజేషన్ ఆప్షన్స్ పొందాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకొని కొత్త తరం మహీంద్రా థార్ కోసం డిసి2 (గతంలో డిసి డిజైన్స్ అని పిలిచేవారు) ఓ సుందరమైన కాస్మెటిక్ అప్‌గ్రేడ్ కిట్‌ను పరిచయం చేసింది. ఇందుకు సంబంధించిన రెండర్లను డిసి2 తమ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

డిసి2 ఆఫర్ చేయనున్న ఈ కస్టమైజేషన్ కిట్‌ను స్టాక్ మోడల్‌పై సులువుగా బోల్ట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ కిట్‌లోని మార్పులను గమనిస్తే, డిసి2 డ్రెస్ కిట్‌తో కొత్త థార్‌ను పూర్తిగా భిన్నమైన ఫ్రంట్ డిజైన్‌లో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన రెండర్లను ఈ చిత్రాలలో గమనించవచ్చు.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన న్యూ హాలండ్ కంపెనీ ; ఏంటో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

డిసి వెర్షన్ థార్‌లో కొత్త స్కిడ్ ప్లేట్ మరియు బోనెట్‌లో ఎత్తుగా ఉండే డిజైన్ ఉంటుంది, ఇది మహీంద్రా థార్‌కు మరింత అగ్రెసివ్ రూపాన్ని మరియు మజిక్యులర్ లుక్‌నిస్తుంది. అలాగే, ఇందులో స్టాక్ టైర్లకు బదులుగా పెద్ద ఆఫ్-రోడ్ క్యాపబిలిటీ ఉన్న టైర్లను అమర్చారు మరియు ఇవి భారీ వీల్ ఆర్చెస్‌ని కలిగి ఉంటాయి. వెనుక ప్రొఫైల్ కొత్త టెయిల్ లైట్లతో పాటుగా బంపర్‌ను భారీగా రీడిజైన్ చేశారు.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

కొత్త మహీంద్రా థార్ కోసం డిసి2 అందిస్తున్న డ్రెస్-కిట్‌లో ఇంటీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ డిజైన్ హౌస్ ఈ మార్పులను ఇంకా ఆవిష్కరించలేదు. కొత్త డ్రెస్-కిట్ ధరలను కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ మొత్తం మేకోవర్‌కు భారీగానే ఖర్చు అవుతుందని అంచనా.

MOST READ:కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, ఏంటో తెలుసా ?

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లో కొత్త తరం థార్ డెలివరీలను ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఈ ఎస్‌యూవీ కోసం కొత్త డిసి2 డ్రెస్-కిట్ లాంచ్ అవుతుందని అంచనా.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి డ్రెస్ కిట్

మహీంద్రా థార్ కోసం డిసి2 రిలీజ్ చేసిన డ్రెస్ కిట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కొత్త 2020 మహీంద్రా థార్ కోసం డిసి2 లేదా డిసి డిజైన్స్ విడుదల చేసిన డ్రెస్ కిట్ నిజంగా అద్భుతంగా ఉంది. స్టాక్ మోడల్‌తో పోలిస్తే ఈ డ్రెస్ కిట్‌తో కూడిన థార్ చాలా విభిన్నంగా మరియు బోల్డ్‌గా కనిపిస్తుంది. ఆఫ్-రోడ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని డిసి2 ఈ డ్రెస్ కిట్‌ను తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే, ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు.

MOST READ:భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

Most Read Articles

English summary
Mahindra & Mahindra introduced their new-generation Thar SUV in the Indian market earlier this month. The all-new SUV has been received extremely well across the country, with demand for the SUV still building. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X