పేదలు సైతం ఈ కారును కొనగలరు.. ఒకేసారి 6 మంది వెళ్లొచ్చు, 26 కి.మీ మైలేజ్! చాలా మంది కొంటున్నారు
భారత మార్కెట్లో వ్యాన్ సెగ్మెంట్ అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు చాలా మందికి మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). సాధారణ కుటుంబాల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజ్ ఇవన్నీ కలిపి ఈ మోడల్‌ను ఒక విశ్వసనీయ ఎంపికగా నిలబెట్టాయి. ఈ విశ్వాసమే ఫిబ్రవరి 2026లో కూడా అమ్మకాల రూపంలో స్పష్టంగా కనిపించింది. ఫిబ్రవరి 2026 నెలలో మాత్రమే దేశవ్యాప్తంగా 11,620 యూనిట్ల ఈకో విక్రయించడం ద్వారా మారుతి సుజుకి మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది.
వ్యాన్ విభాగంలో పోటీ పెరుగుతున్నప్పటికీ, ఈకో మాత్రం తన స్థిరమైన కస్టమర్ బేస్‌ను నిలబెట్టుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, టూరిస్ట్ వాహనాలుగా ఉపయోగించే డ్రైవర్లు, చిన్న వ్యాపార అవసరాల కోసం వాహనం కావాల్సిన వారు అందరికీ ఈకో ఒక సరైన పరిష్కారంగా మారింది. గత ఏడాది ఫిబ్రవరి 2025లో 11,493 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది అదే నెలలో కాస్త ఎక్కువగానే విక్రయాలను జరిపింది.

ఈ రెండింటి మధ్య తేడాను చూసినట్లయితే సుమారు 1.10 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం విశేషం. ఈ వృద్ధి పెద్ద సంఖ్యలా అనిపించకపోయినా, వ్యాన్ సెగ్మెంట్‌లో స్థిరత్వం చాలా ముఖ్యమైన అంశం. అదే స్థిరత్వాన్ని ఈకో నిరంతరం కొనసాగిస్తోంది. సాధారణ డిజైన్ ఉన్నప్పటికీ, విస్తృతమైన ఇంటీరియర్ స్పేస్, సరసమైన ధర, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి అంశాలు ఈ మోడల్‌ను ప్రజల్లో మరింత ఆదరణ పొందేలా చేస్తున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో చిన్న వ్యాపార కార్యకలాపాలకు ఈ వాహనం కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే, ఫిబ్రవరి 2026 అమ్మకాలు మరోసారి ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. వ్యాన్ సెగ్మెంట్‌లో ఈకో ప్రభావం ఇంకా తగ్గలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య కూడా తన స్థిరమైన పనితీరుతో ఈ మోడల్ భారత ఆటోమొబైల్ రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కొనసాగిస్తోంది.

ఫిబ్రవరి నెలలో మాత్రమే కాకుండా, మొత్తం ఆర్థిక సంవత్సర పనితీరు పరంగా కూడా మారుతి సుజుకి ఈకో తన స్థిరమైన ప్రగతిని కొనసాగిస్తోంది. 2026-2027 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు కాలంలో, మారుతి సుజుకి ఈకో దేశవ్యాప్తంగా మొత్తం 1,28,436 యూనిట్ల ఈకో వ్యాన్‌లను విక్రయించింది. ఇది వ్యాన్ విభాగంలో ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను మరోసారి స్పష్టం చేస్తోంది.
ఇదే కాలాన్ని 2024-2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, అప్పట్లో 1,25,26 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ సంఖ్యతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఈకో 3.77 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. వ్యాన్ సెగ్మెంట్‌లో సాధారణంగా భారీ శాతం వృద్ధి కనిపించడం అరుదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ స్థాయి పెరుగుదల నమోదు కావడం విశేషమే.

ప్రస్తుతం రూ. 5.21 లక్షల ప్రారంభ ధర నుంచి టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 6.36 లక్షల వరకు ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఇంజిన్ విషయానికి వస్తే, ఈకో 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 80 bhp శక్తిని, 104.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG మోడ్‌లో 70.67 bhp శక్తిని, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ముఖ్యంగా ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనుకునే వినియోగదారులకు CNG వెర్షన్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. మైలేజ్ పరంగా చూస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.71 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక CNG వెర్షన్ కిలోకు 26.78 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటిస్తోంది. రోజువారీ ఎక్కువ ప్రయాణాలు చేసే వారికి ఇది ఖర్చు పరంగా లాభదాయకంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








