ఫుల్‌గా తాగి రైల్వే ట్రాక్‌పై డ్రైవింగ్.. కట్‌చేస్తే ఎదురుగా గూడ్స్‌రైలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఏదో విధంగా సమాజంలో ఫేమస్ కావడానికి పిచ్చి పిచ్చి చేష్టలతో రీల్స్ చేస్తూ కొంతమంది వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. రీల్స్ పేరుతో కొంతమంది రోడ్లు, పబ్లిక్ ప్రాంతాలు, మెట్రో రైళ్లు, ఎయిర్‌పోర్ట్‌లు, బస్‌స్టాండ్‌లు వంటి చోట్ల ఇతరులను ఇబ్బందికి గురిచేస్తూ రీల్స్ చేస్తూ అరెస్ట్ కాగా, మరికొంతమంది అయితే ఏకంగా తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఒక వ్యాధిలా మారిపోయింది. అందరి దృష్టిని ఆకర్షించడానికి, సబ్‌స్క్రైబర్‌లను, లైక్‌లను, షేర్లను పెంచుకోడానికి రీల్స్ పేరుతో వీడియోలు తీసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక వ్యక్తి రీల్స్ పిచ్చిలో తాగిన మైకంలో ఏకంగా రైలు పట్టాలపైకి తన మహీంద్రా థార్‌ను తీసుకొచ్చాడు.
ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాళ్లోకి వెళితే, ఒక వ్యక్తి తాగిన మైకంలో తన మహీంద్రా థార్ ఎస్‌యూవీని రోడ్డుపై డ్రైవింగ్ చేస్తూ ప్రక్కన ఉన్న రైల్వే ట్రాక్ మీదకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అదే ట్రాక్‌పై గుడ్స్ రైలు వస్తుంది. రైలును చూసిన అతను కంగారు పడి పోయి, తన వాహనాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినప్పటికీ అది వీలు కాలేదు.

ట్రాక్‌పై ఎస్‌యూవీ చిక్కుకోవడాన్ని గమనించిన లోకోపైలెట్ వెంటనే అలర్ట్ అయి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశాడు. అదృష్టవశాత్తు లోకో పైలట్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి బ్రేకులు వేయడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వ్యక్తి ఎస్‌యూవీని పట్టాలపై నుంచి బయటకు తీయడానికి చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు.
దీనిని అటువైపుగా వచ్చిన వారు గమనించి థార్‌ను పట్టాల మధ్య నుంచి బయటకు తీయడానికి సహాయపడ్డారు. అతను థార్‌ను 20-30 మీటర్ల వరకు రివర్స్‌లో తీసుకొచ్చి టైర్లను ట్రాక్ నుంచి బయటకు వచ్చేలా చేశాడు. ట్రాక్ నుంచి టైర్లు బయటకు వచ్చిన వెంటనే ఫాస్ట్‌గా అక్కిడి నుంచి రోడ్డుపైకి డ్రైవింగ్ చేస్తూ ఆ ఏరియా నుంచి పరారయ్యాడు. అలా వెళ్తున్న క్రమంలో ముగ్గురి, నలుగురికి ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అయితే ఆ వ్యక్తి ఫుల్‌గా తాగి ఉండటంతో పాటు రీల్స్ చేయడానికి ట్రాక్‌పై ఈ స్టంట్లకు పాల్పడినట్టు అక్కడి వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంబడించి కొంత దూరంలో అరెస్ట్ చేశారు.
పోలీసులు అతని కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే ట్రాక్‌లపై వాహనాన్ని నడిపినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. తాగిన మైకంలో రీల్స్ పేరుతో అతను చేసిన ఈ హంగామకు భారీ జరిమానాతో పాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే రీల్స్ పిచ్చిలో రైల్వే ట్రాక్‌లపై వీడియోలు చేయడం ఇదే మొదటి సారి కాదు.

దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లపై రీల్స్ చేస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. మూడు నెలల క్రితం దంపతులు తమ కొడుకుతో కలిసి రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా అదే ట్రాక్‌పై వచ్చిన రైలు ఢీకొట్టడంతో వారంతా అక్కిడకక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి ముందు ట్రాక్ ప్రక్కన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు ట్రాక్‌లపై వీడియోలు తీయద్దని హెచ్చరించినప్పటికి వారి మాటలు పట్టించుకోకుండా గంటల కొద్ది రీల్స్ షూట్ చేస్తుండగా, రైలు ఢీకొనడంతో తమ చిన్నారితో సహా ప్రాణాలు విడిచారు. ఈ ఒక్క ఘటనే కాకుండా చాలా మంది ఇలా రీల్స్ పేరుతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications








