కుక్కకు ఉద్యోగం ఇచ్చిన ఓలా.. తొలిరోజు సంతకం చేయకుండా స్కూటర్ సీటు ఎక్కి హల్‌చల్‌

దేశంలో ఓలా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో వినియోగదారుల నుంచి మంచి స్పందనను పొందుతోంది. ఓలా తన లైనప్‌లో మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు S1 ప్రో, S1, S1 ఎయిర్‌ను విడుదల చేసి మంచి విక్రయాలను నమోదు చేసింది. తాజాగా ఎస్‌ 1 స్కూటర్‌ ఉత్పత్తిని నిలిపివేసి ఎస్‌1 ఎయిర్‌కు ప్రాధాన్యత ఇస్తూ బుకింగ్‌లను ప్రారంభించింది.

అయితే ఇటీవల ఓలా ఎలక్ట్రిక్‌ ఎస్‌1 ఎయిర్‌ను లైమ్‌ గ్రీన్‌ కలర్‌లో విడుదల చేసింది. ఈ కలర్‌ వాహనప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ తమ సంస్థలో కొత్త ఉద్యోగిని నియమించిన సంగతి తెలిసిందే. దాని పేరు బిజ్లీ. అది ఓ కుక్క. కంపెనీ నియమాల ప్రకారం దానికి ఐడీ కార్డు, వసతులు, సౌకర్యాలు కల్పించింది.

Ola-S1-Air

ఈ క్రమంలో ఓలా ఎస్‌1 ఎయిర్‌ లైమ్‌ గ్రీన్‌ కలర్‌ స్కూటర్‌ మీద కంపెనీ ఉద్యోగులు సంతకాలు చేశారు. కానీ ఇటీవల నూతనంగా జాయిన్‌ అయిన బిజ్లీ మాత్రం సంతకం చేయలేకపోయింది. సంతకం చేయకుండా స్కూటర్‌ సీటుపై కూర్చుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను భవిష్‌ అగర్వాల్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఐడీ కార్డ్ ప్రకారం బిజ్లీ ఎంప్లాయ్ కోడ్ '440 V'. ఇది వోల్టేజ్‌ను సూచిస్తుంది. బిజ్లీ బ్లడ్ గ్రూప్ 'PAW+Ve' అని కార్డులో రాయించారు. అంతే కాదు బిజ్లీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ను BA కార్యాలయంగా ముద్రించారు. బిజ్లీ ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకోవాలంటే.. చిరునామా హోసూర్ రోడ్‌లోని ఓలా ఎలక్ట్రిక్ కార్యాలయంగా కార్డులో పేర్కొన్నారు.

ఓలాలో ఉద్యోగిగా మారడంతో బిజ్లీకి ట్విటర్‌లో ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కామెంట్లు, షేర్, ట్యాగుల రూపంలో తమ ఉత్సాహం, ప్రేమను పంచుకున్నారు. అయితే ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఆఫీస్‌లో కుక్కలపై పోస్ట్‌లను షేర్ చేయడం ఇది తొలిసారి కాదు.

ఇటీవల ఓలా కార్యాలయంలో సోఫాలపై నిద్రిస్తున్న మూడు కుక్కల ఫొటోను షేర్ చేశారు. గతేడాది ఆఫీసులో కుక్కతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఏదేమైనా శునకాలతో ఓలా కార్యాలయానికి అవినాభావ సంబంధం ఉందనేది ఈ కథనం ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే ఈ ట్వీట్‌కు లక్షల్లో వ్యూస్‌ రాగా.. వేలల్లో లైక్‌లను సంపాదించింది.

ఇక ఓలా S1 ఎయిర్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 15 తర్వాత, Ola S1 ఎయిర్ ధర సుమారు రూ. 10,000 వరకు పెరుగుతుంది. ఇక డెలివరీలు త్వరలేనో ప్రారంభం కానున్నాయి.

గత అక్టోబర్ 2022లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ మరియు రూ. 79,999 ధరతో ఓలా ఎస్‌1 ఎయిర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. అయితే Ola S1 ఎయిర్ ఫిబ్రవరి 2023లో మరో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను ప్రవేశపెట్టింది. 3 kWh మరియు 4 kWh. మళ్లీ ఇప్పుడు తాజాగా S1 ఎయిర్‌ను కేవలం ఇప్పుడు 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే ప్రవేశపెడుతున్నట్లు సంస్థ ధ్రువీకరించింది.

S1తో పోల్చితే, S1 ఎయిర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, ట్యూబులర్ పిలియన్ గ్రాబ్ రైల్ మరియు బ్లాక్-అవుట్ లోయర్-సైడ్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంది. 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో, S1 ఎయిర్ గరిష్ఠంగా 125 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. అయితే 4.5 kW ఎలక్ట్రిక్ మోటారు సాయంతో గంటకు 90 km గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.

ఓలా S1 ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌తో ముందు వైపున ట్విన్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు డ్యూయల్ షాక్‌లు ఉన్నాయి. స్కూటర్‌లో డిస్క్ బ్రేక్‌లు లేవు. ఇది 5 గంటల్లో పూర్తి ఛార్జ్‌ అవుతుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ 6 కలర్స్‌ ఎంపికల్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ను ఓలా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, August 7, 2023, 17:37 [IST]
English summary
Employees signatures on ola s1 air first scooter but bijlee can not sign
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+