లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

లోయలో చిక్కుకున్న పెద్ద లారీని లాగేందుకు ఊరులోని ప్రజలే టో ట్రక్‌గా మారారు. భారీ సంఖ్యలో లారీ వద్దకు చేరుకొని తాళ్ల సాయంతో లోయలో చిక్కుకున్న లారీని బయటకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అయ్యింది.

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

ఈ సంఘటన నాగాలాండ్‌లోని కచ్‌బో గ్రామంలో జరిగింది. రహదారులు అంతంత మాత్రంగా ఉన్న ఈ ప్రాంతంలో ఓ పెద్ద లారీ లోయలోకి జారిపోయింది. అదృష్టవశాత్తు సదరు లారీలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

అంతేకాకుండా, లారీ కూడా లోయ చివరకు వెళ్లిపోకుండా, కొంత దూరంలోనే ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న లారీని బయటకు తీసేందుకు గ్రామస్థులంతా ఏకమయ్యారు. వందలాది మంది చేరి, భారీ తాళ్ల సాయంతో ఈ లారీని బయటకు లాగారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో చూడండి

గ్రామంలో తగిన సౌకర్యాలు లేనందునే, వారు నిత్యం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన మొత్తాన్ని ఓ నెటిజన్ తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, వందల సంఖ్యలో గ్రామస్థులు ట్రక్కును తాడుతో లాగడం చూడవచ్చు.

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఈ వీడియో వైరల్‌గా మారింది. లారీని విజయవంతంగా బయటకు లాగినందుకు గానూ గ్రామస్థులకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా, రాజకీయ నాయకులను ట్యాగ్ చేస్తూ, వారికి కూడా తెలిసేలా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

ప్రజలు ఎలాంటి యంత్రాలు లేకుండా, తాళ్లు మరియు వెదురు బొంగుల సాయంతో ట్రక్‌ను కొంచెం కొంచెంగా కదుపుతూ పైకి లాగారు. ఇంత భారీ ట్రక్కును సాధారణ రోడ్లపైనే లాగడం చాలా కష్టం, అలాంటి లోయ నుండి దీనిని ఎటవాలుగా పైకి లాగడం ఇంకా కష్టం.

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

కానీ ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి ట్రక్కును లాగడం పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి ట్రక్కులు సాధారణంగా సుమారు 15 టన్నుల నుండి 20 టన్నుల బరువును కలిగి ఉంటాయి. ఇందులో కనిపించిన టాటా మోటార్స్ బ్రాండ్‌కి చెందినదిగా తెలుస్తోంది.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

లోయలో పడిన లారీని బయటకు లాగేందుకు ఏకమైన ఊరు వాడ..

టాటా మోటార్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ భారతదేశంలో నిలిపివేసిన టాటా సఫారీ ఎస్‌యూవీని తిరిగి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ టాటా హారియర్‌కు 7-సీటర్ వెర్షన్‌గా టాటా సఫారీ రానుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
People power! Entire village comes together to pull truck out from valley. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X