Just In
Don't Miss
- Lifestyle
గోధుమ రవ్వ పాయసం
- Sports
వేలంలో మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ ఎంత ధరైనా చెల్లిస్తుంది: ఆకాశ్ చోప్రా
- Movies
డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
- News
Lovers: కాలేజ్ అమ్మాయి లవ్ స్టోరీ, ఎస్కేప్, ప్రియుడికి ఎయిడ్స్: ప్రియురాలికి నోప్రాబ్లమ్, మైండ్ బ్లాక్!
- Finance
మోడీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మీటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా సఫారీ అలియాస్ గ్రావిటాస్ టీజర్ ఆవిష్కరణ; జనవరిలోనే విడుదల
టాటా మోటార్స్ నిలిపివేసిన సఫారీ బ్రాండ్‌ను, తాజాగా తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పటి వరకూ గ్రావిటాస్ పేరుతో అభివృద్ధిని టాటా హారియర్ బిగ్ బ్రదర్‌నే కంపెనీ టాటా సఫారీ పేరుతో విడుదల చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

కొత్త టాటా సఫారీ (అలియాస్ గ్రావిటాస్)ను కంపెనీ 2020 ఆటో ఎక్స్‌పోలో 'టాటా గ్రావిటాస్' పేరుతో కాన్సెప్ట్ వెర్షన్‌గా పరిచయం చేసింది. ఈ మోడల్‌ను టాటా హారియర్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. నిజానికి ఇది టాటా హారియర్‌కు పొడగించిన 7-సీటర్ వెర్షన్.

టాటా మోటార్స్ ఈ కొత్త కారును హారియర్ ప్లస్ లేదా గ్రావిటాస్ పేర్లతో విడుదల చేసి ఉండొచ్చు. కానీ, టాటా సఫారీ బ్రాండ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఆ బ్రాండ్ పేరును ఉపయోగించుకోవడం ద్వారా కస్టమర్ల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని కంపెనీ కొత్త మార్కెట్ స్ట్రాటజీని ప్లాన్ చేసింది.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

గ్రావిటాస్ ఎస్‌యూవీని సఫారీ పేరుతో విడుదల చేయటం ద్వారా ఈ బ్రాండ్‌ను పునరుద్ధరించాలని టాటా మోటార్స్ భావిస్తోంది. ఈ మేరకు టాటా మోటార్స్ విడుదల చేసిన టీజర్‌లో కొత్త టాటా సఫారీ ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌ను టీజ్ చేశారు.

ఇంకా ఇందులో 'అధునాతనం కోసం పదును పెట్టబడినది. సఫారీ, #మీ జీవితాన్ని తిరిగి పొందండి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. ఈ కారును జనవరి 2021లోనే విడుదల చేయనున్నట్లు టాటా ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

కొత్త టాటా సఫారీ టీజర్‌లో ముందు భాగంల Y-ఆకారపు ఫ్రంట్ గ్రిల్‌ను చూడొచ్చు. టాటా నెక్సాన్‌లో కూడా ఇదే తరహా గ్రిల్ ఉంటుంది. ఇందులో గ్రిల్‌లోనే అమర్చబడిన సన్నని ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, ఫ్రంట్ బంపర్‌లో ఒకే హౌసింగ్‌లో అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌లను కూడా ఇందులో చూడొచ్చు.

మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్త టాటా సఫారీని జనవరి 26వ తేదీన మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని మరియు అదే రోజున బుకింగ్‌లు కూడా ప్రారంభించవచ్చని అంచనా. టాటా మోటార్స్ తమ కొత్త డిజైన్ లాంగ్వేజ్ 'ఇంపాక్ట్ 2.0' ఆధారంగా భారత మార్కెట్ కోసం అనేక కొత్త కార్లను డిజైన్ చేస్తోంది.
MOST READ:హోండా కార్ మాస్క్.. కారుకి మాస్క్ ఏంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

ఇందులో భాగంగానే, కొత్త టాటా సఫారీ (అలియాస్ గ్రావిటాస్)ను కూడా డిజైన్ చేసింది. ఈ కారును ఒమేగ ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు. ఈ ఆర్కిటెక్చర్‌లో భాగంగా, సఫారీ అనేక ఇంజన్, ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం టాటా హారియర్ ఎస్‌యూవీలో ఉపయోగిస్తున్న అన్ని ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను యధావిధిగా కొత్త సఫారీలోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం.
MOST READ:డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారు వేలం; వెల ఎంతంటే..?

టాటా సఫారీ కోసం కంపెనీ ఇటీవలే ఓ ట్రిబ్యూట్ వీడియోని కూడా విడుదల చేసి, ఈ బ్రాండ్ గురించి కస్టమర్లకు మరోసారి కంపెనీ గుర్తు చేసింది. "సఫారీ నీవు మాకిచ్చిన విజయాలు అన్నీ ఇన్నీ కావు, నీతో మాకున్న జ్ఞాపకాలు వెలకట్టలేనివి, వుయ్ మిస్ యూ" అంటూ టాటా సఫారీకి నివాళి (ట్రిబ్యూట్)గా ఓ వీడియోని విడుదల చేసింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.