భవిష్యత్తు కార్లు వస్తున్నాయి.. ఈ ఏడాదిలో టాటా నుంచి 3 కార్లు! అవి ఏమిటి, ధర ఎంత, ఫీచర్లు ఏమిటి?

భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో, టాటా మోటార్స్ (Tata Motors) ఈ మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకుని ముందుకు సాగుతోంది. సస్టైనబుల్ మొబిలిటీ వైపు దేశం అడుగులు వేస్తున్న నేపథ్యంలో, కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లు వినియోగదారుల నుంచి విశేష స్పందనను అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరం టాటా మోటార్స్‌కు ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ ఏడాదిలో కంపెనీ పలు కీలక ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. వాటిలో ముఖ్యంగా టియాగో ఈవీ (Tata Tiago EV) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, అలాగే ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సియోర్రా ఈవీ (Tata Sierra EV), భవిష్యత్తు టెక్నాలజీని ప్రతిబింబించే అవిన్య ఈవీ (Tata Avinya EV) వంటి మోడళ్లు ఉండనున్నాయి. వీటి గురించి ఈ కథణంలో తెలుసుకుందాం.

Tata Tiago EV Facelift: భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న టియాగో ఈవీ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో త్వరలో రానుంది. ఈ మోడల్‌ను 2026 ద్వితీయార్థంలో లాంచ్ చేసే అవకాశముందని సమాచారం. ఇటీవల టెస్ట్ డ్రైవ్ సమయంలో ఈ కారు కనిపించగా, స్పై ఫోటోలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే కారు పూర్తిగా కవర్‌తో కప్పబడి ఉండటంతో డిజైన్‌లో జరిగే మార్పులపై పూర్తి వివరాలు బయటకు రాలేదు.

Tata Motors New Electric Cars Launching 2026 Tiago Sierra And Avinya Details

ఇందులో 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌‌లు ఉండే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్‌పై సుమారు 293 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని నివేదికలు చెబుతున్నాయి. ధర రూ.8.10 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండొచ్చని అంచనా. ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది.

Tata Sierra EV: ఎంతోకాలంగా ఆటోమొబైల్ అభిమానులు ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ SUVల్లో ఒకటి టాటా సియోర్రా. టాటా మోటార్స్ ఈ మోడల్‌ను 2026లో భారత మార్కెట్లో అమ్మకానికి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. డిజైన్ పరంగా చూస్తే, ఇది క్లాసిక్ సియెర్రా మోడల్‌కు సమానమైన స్టైలింగ్‌తో వస్తుందని చెబుతున్నారు, అందుకే ఈ కారు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆసక్తిని కలిగిస్తోంది.

Tata Motors New Electric Cars Launching 2026 Tiago Sierra And Avinya Details

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు ఈ SUV సుమారు 627 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా. ఐదుగురు సౌకర్యంగా కూర్చునేలా ఈ కారు డిజైన్ చేయబడుతుంది. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించబడతాయి. ధర విషయానికి వస్తే, ఇది సుమారు రూ.15 లక్షల నుండి రూ.25 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Tata Avinya EV: టాటా అవిన్య ఈవీ మోడల్‌ను 2026లో మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటార్స్ భావిస్తోంది. స్టైలిష్, ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో ఈ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉండే అవకాశం ఉంది. పూర్తి ఛార్జ్‌పై సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

Tata Motors New Electric Cars Launching 2026 Tiago Sierra And Avinya Details

ఫీచర్ల పరంగా 14.5-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండే అవకాశముంది. ప్రయాణీకుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందించే అవకాశం ఉందని చెబుతున్నారు. ధర విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ SUV సుమారు రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, March 5, 2026, 12:06 [IST]
English summary
Tata motors new electric cars launching 2026 tiago sierra and avinya details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+