టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా సఫారీ ఎస్‌యూవీ గురించి మన భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటు సిటీ కమ్యూటర్‌గా అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ప్రియులకు ప్రసిద్ధమైన ఎస్‌యూవీగా నిలిచిన టాటా సఫారీ ఉత్పత్తి నిలిచిపోయి, చరిత్రలో మిగిలిపోయిన సంగతి మనందరికీ తెలిసినదే.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

నిజానికి టాటా సఫారీ ఇప్పుడు కొత్త కొనుగోలుదారులకు అందుబాటులో లేకపోవచ్చు కానీ, ఇప్పటికే ఈ వాహనాన్ని కలిగిన ఉన్న కస్టమర్లు మాత్రం దానితో ఉన్న అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేరు. అలాగే, కొన్ని కారణాల వలన ఈ ఎస్‌యూవీని కోల్పోయిన కస్టమర్లు కూడా, తమ వాహనంతో ఉన్న అనుబంధాన్ని అప్పుడప్పుడూ గుర్తు చేసుకొనే సందర్భాలు కూడా ఉంటాయి.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

గడచిన కొన్ని దశాబ్దాలుగా భారత కార్ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే, ఎన్నో మార్పులు మరెన్నో కొత్త కంపెనీలు వెరసి సరికొత్త వాహనాలు ఈ మార్కెట్లోకి ప్రవేశించాయి. కొత్త వాహనాల రాకతో పాత వాహనాల ఉత్పత్తి నిలిచిపోవడం షరా మామూలే. అయితే, ఇలాంటి వాహనాల్లో కొన్ని మోడళ్లు హృదయాలకు చాలా దగ్గరా ఉంటాయి. అలాంటి వాటిల్లో టాటా సఫారీ కూడా ఒకటి.

MOST READ:ఒక ఛార్జ్‌తో 100 కి.మీ డ్రైవింగ్.. ధర తక్కువ & డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేదు

టాటా సఫారీ ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ, ఈ కారుపై ప్రజాదరణ మాత్రం తగ్గిపోలేదు. ప్రీ-ఓన్డ్ (సెకండ్ హ్యాండ్) కార్ మార్కెట్లో ఈ ఎస్‌యూవీకి ఉన్న క్రేజే వేరు. టాటా మోటార్స్‌కి కూడా కాసుల వర్షం కురిపించింది ఈ టాటా సఫారీ ఎస్‌యూవీ. టాటా ఉత్పత్తులలో ఒకప్పుడు ఇదే టాప్-ఆఫ్-ది లైన్ మోడల్‌గా విక్రయించబడేది.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

ఇంతటి పాపులారిటీని దక్కించుకున్న టాటా సఫారీ ఎస్‌యూవీని టాటా మోటార్స్ ఓసారి గుర్తు చేసుకుంది. సఫారీ నీవు మాకిచ్చిన విజయాలు అన్నీ ఇన్నీ కావు, నీతో మాకున్న జ్ఞాపకాలు వెలకట్టలేనివి, వుయ్ మిస్ యూ అంటూ ఓ వీడియోని కూడా విడుదల చేసింది టాటా మోటార్స్. టాటా సఫారీకి నివాళి (ట్రిబ్యూట్)గా ఈ వీడియోని విడుదల చేసింది.

MOST READ:లిమోసిన్ కారుగా మారిన మారుతి వ్యాగన్ ‌ఆర్.. ఎలా అనుకుంటున్నారా.. ఇది చూడండి

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా మోటార్స్ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వీడియోని షేర్ చేసింది. టాటా తొలిసారిగా 1998లో సఫారీ ఎస్‌యూవీని ప్రారంభించింది. అనతి కాలంలోనే ఇది భారతదేశంలో ఎలా ప్రాచుర్యం పొందిందో ఈ వీడియో తెలియజేస్తుంది. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ ఎస్‌యూవీ ఉత్పత్తి దశలో ఉంది. ఇది 2017లో నిలిపివేయబడింది.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా మోటార్స్ విడుదల చేసిన ఈ వీడియోలో టాటా సఫారీలో చేసిన మార్పులు, సాధించిన విజయాలు, కస్టమర్లతో దాని అనుబంధాన్ని చూపించే చిత్రాలు మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా, టాటా సఫారీ పనితీరు, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను తెలియజేసే చిత్రాలను కూడా ఇందులో మనం గమనించవచ్చు.

MOST READ:లవ్‌బర్డ్ ; భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ కార్.. మీరు చూసారా..!

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా మోటార్స్ తొలిసారిగా తమ సఫారీ కాన్సెప్ట్‌ను 1998లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. టాటా సఫారీ ఎస్‌యూవీని కేవలం భారత మార్కెట్లో విక్రయించడమే కాకుండా, యూరోపియన్ మార్కెట్లకు సైతం ఎగుమతి చేశారు. టెల్కోలిన్ అని పిలువబడే టాటా మొబైల్ పికప్ ట్రక్‌ను ఆధారంగా చేసుకొని దీనిని రూపొందించారు.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా సఫారీ ప్రారంభ సంవత్సరాల్లో, ఇందులో ప్యూజో నుండి సేకరించిన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అప్పట్లో ఈ ఇంజన్ గరిష్టంగా 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 186 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేసేది. కొన్నేళ్ల తర్వాత 2003లో టాటా సాఫారీలో పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేశారు.

MOST READ:అటల్ టన్నెల్‌లో ఒకటి, రెండు కాదు ఏకంగా 82 వాహనాలు చిక్కుకున్నాయి.. కారణం ఇదే

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

పెట్రోల్ వెర్షన్ సఫారీలో టాటా మోటార్స్ స్వయంగా అభివృద్ధి చేసిన 2.1-లీటర్ 16 వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ పెట్రోల్ ఇంజన్ మునుపటి డీజిల్ ఇంజన్ చాలా శక్తివంతమైనది, ఇది 135 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసేది. అయితే, దీని తక్కువ ఇంధన సామర్థ్యం (మైలేజ్) కారణంగా, రెండేళ్లలోనే టాటా మోటార్స్ తమ పెట్రోల్ సఫారీని నిలిపివేయాల్సి వచ్చింది.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

అప్పట్లో సఫారీ పెట్రోల్ మోడల్ డీజిల్ మోడల్ కంటే ఖరీదైనదిగా ఉండేది. డీజిల్ వెర్షన్ మైలేజ్ అధికంగా ఉండటం మరియు ధర కూడా పెట్రోల్ వెర్షన్ కన్నా తక్కువగా ఉండటంతో కస్టమర్లు డీజిల్ సఫారీకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ కారణాల వల్లనే పెట్రోల్ వెర్షన్ సఫారీని నిలిపివేశారు.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

ఈ విభాగంలో ఇది మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్లతో పోటీ పడటానికి వీలుగా, టాటా మోటార్స్ 2005లో సఫారీలో సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది పవర్‌ఫుల్ 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పరిచయం చేయబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 115 బిహెచ్‌పి పవర్‌ను మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అప్పట్లో ఈ 3.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ సరికొత్త డెకర్ డీజిల్ ఇంజన్.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

ఆ తర్వాతి కాలంలో 2007లో టాటా మోటార్స్ కొత్త 2.2-లీటర్ డెకోర్ డీజిల్ ఇంజన్‌తో కొత్త సఫారీని విడుదల చేశారు. ఈ కొత్త ఇంజన్ మునుపటి 3.0-లీటర్ డెకోర్ డీజిల్ ఇంజన్ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసేది. అదే సమయంలో టాటా సఫారీలోని ఏబిఎస్ మరియు ఎయిర్‌బ్యాగ్స్ వంటి అనేక కొత్త సేఫ్టీ ఫీచర్ల కారణంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

టాటా సఫారీ నీకిదే మా 'నివాళి' - వుయ్ మిస్ యూ..

టాటా మోటార్స్ 2012లో సఫారీ స్టోర్మ్ మోడల్‌ను ప్రారంభించింది. ఇది డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఆధునీకరించబడింది. అయితే, అప్పటికే ఈ విభాగంలో పోటీ జోరందుకుంది. కొత్త మోడళ్లు రావటం, సఫారీ కన్నా మెరుగైన కంఫర్ట్ ఫీచర్లను ఆఫర్ చేయడంతో ఈ మోడల్ అమ్మకాలు దెబ్బతిన్నాయి. దీంతో వేరే ఆప్షన్ లేక టాటా మోటార్స్ దీని ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది. - నిజంగా వుయ్ మిస్ యూ సఫారీ!

Most Read Articles

English summary
Tata Motors Officially Releases Safari Tribute Video. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X