ఓలా సీఈవో మనసు దోచుకున్న నాలుగేళ్ల బాలుడు.. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని సందర్శించే ఛాన్స్‌ కొట్టేశాడు.!!

నాలుగేళ్ల చిన్నోడు(Four Year Old Kid Ola Dance) తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, అదరగొట్టే డ్యాన్స్‌తో ఓలా సీఈవో, ఫౌండర్‌ భవీశ్‌ అగర్వాల్‌ మనసు దోచుకున్నాడు.'ఓలా' పాటతో తనను ఫిదా చేసిన ఆ బుడ్డోడికి అరుదైన ఛాన్స్‌ను ఇచ్చారు భవీశ్‌. ఇంతకీ ఆ బుడ్డోడు ఎవరు.. ఆ ఛాన్స్‌ ఏంటి.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తక్కువ ధర, సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మోడళ్లతో సత్తా చాటుతున్న ఓలా.. కస్టమర్లకు ఫేవరెట్‌గా మారింది. అయితే యువత, పెద్ద వాళ్లే కాదు ఈ బుడ్డోడు(Ola Dance Khushnav) కూడా ఓలా ఎలక్ట్రిక్‌కు ఫ్యాన్‌ అయిపోయాడు.

Ola-Dance-Four-Year-Kid

నాలుగేళ్ల పిల్లలు అంటే సాధారణంగా రైమ్స్‌, కిడ్స్‌కు సంబంధించిన పాటలు పాడుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ ఈ ఖుష్నవ్‌ ఖిర్వార్‌(Khushnav Khirwar) అనే బాలుడు మాత్రం ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా డ్యాన్స్‌ అనే పదాలను ముద్దుముద్దుగా పాటలో ఉచ్చరిస్తూ.. డ్యాన్స్‌ వేస్తూ అలరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఈ వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌ X(ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. అంతే కాకుండా క్యాప్షన్‌లో ఓలా సీఈఓ అగర్వాల్‌కు ఖుష్నవ్‌ ఓ అభ్యర్థన చేశాడు. ఓలా కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీని సందర్శించే అవకాశం తనకు కల్పించాలని ఆ బుడ్డోడు విజ్ఞప్తి చేశాడు. అందులో 'భవీశ్‌ అంకుల్‌.. నేను ఆగ్రా నుంచి రాక్‌స్టార్‌ ఖుష్నవ్‌. దయచేసి నాకు ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీని సందర్శించే ఛాన్స్‌ కల్పించండి' అంటూ రిక్వస్ట్‌ చేశాడు.

Ola-Dance-Four-Year-Kid

ఈ వీడియో ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ దృష్టికి చేరింది. ఖుష్నవ్‌ ముద్దుముద్దు మాటలు, పాటలు డ్యాన్స్‌తో పాటు తన అభ్యర్థనకు ముగ్ధుడైన భవీశ్‌ అగర్వాల్.. చిన్నారి పోస్ట్‌కు సానుకూలంగా స్పందించారు. ఖుష్నవ్‌ వేస్తున్న స్టెప్పులు తనకు బాగా నచ్చాయని రిప్లై ఇచ్చారు. ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ మీద, ఓలా కంపెనీ మీద చిన్నారి ఇంట్రెస్ట్‌ తనకు సంతోషాన్ని కలిగిస్తోందని స్పందించారు.

అంతేకాకుండా ఖుష్నవ్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు ఓలా సీఈవో(Ola CEO Bhavish Aggarwal). ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ సందర్శనకు తల్లిదండ్రులతో కలిసి రావాలని బాలుడిని ఆహ్వానించారు. ఈ ఆనందభరిత క్షణాలను 'నీతో పాటు నీ తల్లిదండ్రులు కూడా మిస్‌ కావద్దు' అని భవీశ్‌ పేర్కొన్నారు. ఓ రోజు చూసుకొని ప్లాన్‌ చేసుకొని రావాలని సూచించారు.

Ola-Dance-Four-Year-Kid

కాగా తమిళనాడులోని కృష్ణగిరిలో దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో 'ఓలా ఎలక్ట్రిక్‌'(Ola Electric) సంస్థ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కర్మాగారాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈ కంపెనీని ప్రారంభించనుంది. అయితే ఈ కంపెనీని పూర్తిగా మహిళలే నడుపుతారని ఓలా సీఈవో భవీశ్‌ అగర్వాల్‌ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఓలా ఎలక్ట్రిక్(Ola Future Factory) ఫ్యాక్టరీలో మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను మెరుగుపరచనుంది. కాగా ఓలా ఎలక్ట్రిక్ ప్లాంట్ యొక్క పూర్తి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 1 కోటి వాహనాలుగా సంస్థ తెలిపింది.

అందుకే ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric Future Factory In Tamilnadu) ఈ కొత్త ఫ్యాక్టరీకి ఫ్యూచరీ ఫ్యాక్టరీ అని పేరు పెట్టింది. ప్రస్తుతం మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ S1 X, S1 Air మరియు S1 Pro అనే 3 రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 20, 2024, 9:36 [IST]
English summary
Four year old kid gets chance to visit ola future factory in tamilnadu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+