Panipuri Girl పానీపూరి అమ్మి మహీంద్రా థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన యువతి
పానీపూరీ విక్రయించి ఓ యువతి తన కలను సాకారం చేసుకుంది. ఏకంగా మహీంద్రా థార్‌ని కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో (ఎక్స్) పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుంది.
ఇంటర్నెట్‌లో ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్ వీడియోలను పంచుకునే ఆనంద్ మహీంద్రా మరో వీడియోను తన (ఎక్స్) అకౌంట్‌లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో తన కలను నిజం చేసుకునేందుకు ఓ యువతి రేయింబవళ్లు కష్టపడిందని.. పానీపూరీ సెంటర్లు నెలకొల్పి తన కలల కారు మహీంద్రా ఎస్‌యూవీని కొనుగోలు చేసిందని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. మహీంద్రా థార్ వెనకాల పానీపూరీ బండిని లాగుతున్న వీడియోను ఆయన ట్వీట్‌లో జత చేశారు.

మహీంద్రా థార్‌తో ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్‌లోనూ ఎక్కడికైన వెళ్లవచ్చు అనేదానికి ఇదే సరైన ఉదాహరణ అంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. కొత్త కొత్త ప్రదేశాలు అన్వేషించడానికి.. ఇతర కఠినమైన ప్రదేశాలకు థార్‌పై సులభంగా వెళ్లవచ్చని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ఇది బీటెక్ పానీపూరీ అంటూ తనదైన శైలిలో ఆనంద్ మహీంద్రా కితాబిచ్చారు. ఈ వీడియోలోని యువతి మొదటగా సొంతంగా పానీపూరీ నడిపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా తన పేరు మీద 40 పాయింట్లను నెలకొల్పింది.
వినూత్న పద్ధతులు అవలంభిచడం వల్ల తన మార్కెట్‌ని పూర్తిగా విస్తరించింది. తాజాగా ఆమె రెడ్ కలర్ మహీంద్రా థార్‌ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం పానీపూరీ బండిని SUV వెనుక కట్టి ప్రతిరోజూ తన బండిని తిప్పుతూ పానీపూరీ విక్రయిస్తుంది. మరోసారి వినూత్నంగా పానీపూరీ విక్రయిస్తుండటంతో ఆమె ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యారు. దీనిపై ఆనంద్ మహీంద్రాతో పాటు చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అన్ని వాహనాల కంటే మహీంద్రా థార్‌కి భారీ డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల ఈ థార్ ఎస్‌యూవీని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖులతో పాటు చాలామంది ప్రముఖ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. త్రీ-డోర్ డిజైన్‌ల ద్వారా అత్యంత ఇష్టపడే వాహనాలలో ఇది ఒకటిగా నిలిచింది. థార్ రియర్-వీల్ డ్రైవ్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది.
థార్ రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఎస్‌యూవీ 1.5-లీటర్ 118 PS డీజిల్ ఇంజన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 2.0-లీటర్ 150 PS టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కొనుగోలుకి సిద్ధంగా ఉంది. మరోవైపు, థార్ 4WD 2.2-లీటర్ 130 PS డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ 150 PS టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతోంది.

ఈ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ థార్‌ని పొందాలంటే బుక్ చేసుకున్న తేదీ నుంచి 11-12 నెలల సమయం పడుతోంది. భారీ డిమాండ్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ రోజురోజుకు పెరుగతూ పోతుంది. అయినా కానీ ఈ ఎస్‌యూవీకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలో దేశంలోనే మహీంద్రా థార్ కింగ్‌మేకర్‌గా కొనసాగుతోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








