బిగ్‌బాస్‌ బ్యూటీ 'హమీద' ఖరీదైన కారు.. ఇదే: చూడండి

'హామీద కటూన్' (Hamida Khatoon) గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే 'సాహసం చేయరా డింబకా' సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బెంగాలీ బ్యూటీ 'హమీద' కు తరువాత బిగ్‌బాస్‌ సీజన్ 5 లో అవకాశం వచ్చింది. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇటీవల ఈ బెంగాలీ భామ ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

నివేదికల ప్రకారం, హమీద కొనుగోలు చేసిన జర్మన్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఏ అని తెలుస్తోంది. ఇది బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారుని హమీద యాంకర్ రవి మరియు అతని భార్య 'నిత్యా సక్సేనా'తో కలిసి డెలివరీ తీసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

మెర్సిడెస్ బెంజ్ యొక్క జిఎల్ఏ విషయానికి వస్తే, ఇది రెండు మోడల్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్ జిఎల్ఏ మరియు టాప్ స్పెక్ ఏఎమ్‌జి జిఎల్ఏ 35. అయితే ఇందులోని జిఎల్ఏ 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి 200, 200డి మరియు 200 డి 4 మ్యాటిక్. ఇందులో హమీద ఏ వేరియంట్ కొనుగోలు చేసిందో ఖచ్చితంగా తెలియదు.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ ధరలు రూ. 42 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుంచి ప్రారభమవుతాయి. ఇది అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో 0.25 ఇంచెస్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 64-కలర్ యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్‌ సీట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, డ్యూయెల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

బెంజ్ జిఎల్ఏ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 61 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 7 స్పీడ్ డిసిటి యూనిట్‌ తో జత చేయబడి ఉంటుంది. ఇక డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8-స్పీడ్ జి-ట్రానిక్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో జతచేయబడి ఉంటుంది.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ పరిమాణం పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ లగ్జరు కారు పొడవు 4,410 మిమీ, వెడల్పు 2,020 మిమీ, ఎత్తు 1,611 మిమీ మరియు వీల్‌బేస్ 2,729 మిమీ వరకు ఉంటుంది.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

ఇక మన బిగ్‌బాస్‌ బ్యూటీ హామీదా విషయానికి వస్తే, తెలుగులో సాహసం చేయరా డింబకా సినిమాతో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి తరువాత సరైన అవకాశాలు రాలేదు, ఆ తరువాత బిగ్‌బాస్‌ 5 లో అవకాశం రావడంతో తన అభినయంతో ఎక్కువమంది అభిమానులను పొందగలిగింది.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

అదే సమయంలో బిగ్‌బాస్‌ 5 లో సింగర్ శ్రీరామ్ తో ప్రేమాయణం నడిపింది. ఆ తరువాత మరింత పాపులర్ అయిపోయింది. మొత్తమ్ మీద ఇప్పుడు ఒక ఖరీదైన కారుని సొంతం చేసుకునేసింది. ఈ కారుని కొనుగోలు చేసిన తరువాత యాంకర్ రవితో కలిసి కారులో డ్రైవ్‌కు కూడా వెళ్ళింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

ఇదిలా ఉండగా ఇటీవల షన్ను కూడా ఒక ఖరీదైన 'బిఎండబ్ల్యు' (BMW) '2 సిరీస్ గ్రాండ్ కూపే' కొనుగోలు చేసాడు. షణ్ముఖ్ కొనుగోలు చేసిన ఈ కారు ధర సుమారు రూ. 50 లక్షలకు పైనే ఉంటుంది. షన్ను కారు కొన్న సందర్భంగా ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసాడు. ఇందులో 'ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉంది. నా ఫ్యామిలీ తరువాత ఆ పొజిషన్ లో చూడాలనుకుంది మీరే, అంటూ.. ఐ లవ్ యు 3000' అని రాసుకొచ్చాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

బెంగాలీ బ్యూటీ 'హమీద' కొనుగోలు చేసిన కారు.. మరింత బ్యూటీ కదా: ధర రూ. 40 లక్షలకు పైనే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గత విజయదశమి మరియు దీపావళి పండుగల సందర్భంగా చాలామంది సెలబ్రెటీలు కొత్త కార్లను కొనుగోలు చేశారు. ఇందులో హమీద కూడా ఒకరు. ఈమె ఈ దీపావళి సందర్భంగా ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Article Published On: Sunday, October 30, 2022, 8:00 [IST]
English summary
Hamida khatoon buys luxury mercedes benz details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+