ఆనంద్ మహీంద్రా కార్ కలెక్షన్ సూపర్.. గ్యారేజీలో ఏయే కార్లు ఉన్నాయంటే..!
ఆనంద్ మహీంద్రా.. పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా యాజమానిగానే కాకుండా, సోషల్ మీడియాలో వివిధ సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా ప్రముఖుల గ్యారేజీ లగ్జరీ కార్లతో నిండిపోతుంది. అదే సాక్షాత్తూ కార్ల కంపెనీ యాజమాని ఆనంద్ మహీంద్రా గ్యారేజీలో ఎలాంటి కార్లు ఉంటాయి. ఆయన కార్ల కలెక్షన్ గురించి తెలుసుకొనే వారికోసం ఈ స్టోరీ.
ఆటోమోటివ్ ఇండస్ట్రీలో అత్యంత ఫేమస్ పర్సనాల్టీల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. అనేక కొత్త ఆవిష్కరణలతో తన సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాను అగ్రశ్రేణిగా నిలిపారు. అయితే ఆనంద్ మహీంద్రా ఎక్కువగా తన సొంత సంస్థ కార్లలోని లగ్జరీ మోడళ్లను ఇష్టపడతారు. మహీంద్రా XUV700, మహీంద్రా TUV300, మహీంద్రా స్కార్పియో లాంటి మరెన్నో కార్లు ఆనంద్ మహీంద్రా గ్యారేజీలో ఉన్నాయి.

మహీంద్రా XUV700 : ఆనంద్ మహీంద్రా కార్ గ్యారేజీలో ఉన్న లగ్జరీ వాహనాల్లో మహీంద్రా XUV700 ఒకటి. ఈ కారు XUV500 తర్వాత వెర్షన్. అంతేకాకుండా ఈ తరహా కార్లలోని అత్యంత రిచ్ కార్లలో XUV700 ఒకటిగా నిలుస్తుంది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఫ్లాగ్‌షిప్ కార్లలో ఇది ఒకటి.
మహీంద్రా TUV300: ఈ మహీంద్రా TUV300.. రఫ్ అండ్ టఫ్ సబ్ కంపాక్ట్ సబ్ - 4M SUV వాహనం. ఈ కారు ధృడమైన, ఆకర్షణీయమైన ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ఎలాంటి ప్రాంతంలోనైనా సులభంగా నడపవచ్చు.

మహీంద్రా TUV300 ప్లస్: మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు ఆనంద్ మహీంద్రా ఉత్తమ అండాసిడర్ అని అందరికీ తెలిసిందే. చాలా మందికి తెలియని మహీంద్రా TUV300 కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు TUV300 వెర్షన్ కంటే ఉత్తమ మరియు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారు వెనుక వరసలో అదనపు సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మహీంద్రా ఆల్టురాస్ G4: ఆనంద్ మహీంద్రా గ్యారేజీలో ఉండే మరో కారు మహీంద్రా ఆల్టురాస్ G4. ఈ కారును మహీంద్రా సంస్థ యొక్క ప్లాగ్‌షిప్ ఉత్పత్తిగా పరిగణిస్తారు. ఈ కారు లాంచ్ చేసిన సమయంలో ఈ తరహా పోర్ట్‌ఫోలియోలో టాప్‌లో ఉండేది. కానీ ఈ ఆల్టురాస్ G4 కారు టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ విక్రయాల్లో పోటీపడలేకపోయింది.

మహీంద్రా స్కార్పియో: 2000 సంవత్సరంలో మహీంద్రా సంస్థ నుంచి లాంచ్ అయిన తొలి మోడరన్ SUV మహీంద్రా స్కార్పియో మాత్రమే. అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఈ కారులోనే ఎక్కువగా కనిపించేవారు. ఈ కారు వినియోగదారులను అత్యధికంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ కారును కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.
మహీంద్రా థార్: ఆనంద్ మహీంద్రా కార్ కలెక్షన్‌లో ఉండే మరో వాహనం.. మహీంద్రా థార్. అద్భుతమైన లుక్ మరియు అత్యంత సామర్థ్యం మహీంద్రా థార్ సొంతం.
మహీంద్రా స్కార్పియో-N: ఆనంద్ మహీంద్రా కార్ కలెక్షన్‌లో చోటు సంపాదించుకున్న మరో కారు మహీంద్రా స్కార్పియో-N. గత సంవత్సరం ఈ కారును మహీంద్రా సంస్థ లాంచ్ చేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మహీంద్రా స్కార్పియో-Nను ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా మార్చింది. ఈ కారు XUV700లో ఉన్నట్లు ఫ్రేమ్ లేడార్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంజిన్, ట్రాన్సిమిషన్ సహా అనేక మార్పులు చేశారు.


Click it and Unblock the Notifications








