బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

సాధారణంగా బీచ్‌లో ఆడుకోవడానికి లేదా సరదాగా గడపడానికి చాలా బాగుంటుంది. అయితే బీచ్‌లోకి హ్యాచ్‌బ్యాక్ లేదా ఇతర కార్లను తీసుకెళ్లడం చాలా వరకు ప్రమాదకరం. బీచ్‌లోని దాదాపు ఎక్కువ ఇసుకతో ఉంటుంది. కావున ఇటువంటి వాహనాలు ఇసుకలో సులభంగా ఇరుక్కుపోతాయో. ఇది పెద్ద ప్రమాదానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన ఒక వీడియోలో బీచ్‌లో ఒక కార్ ఎలా ఇరుక్కుని ఉందో చూడవచ్చు.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

బీచ్‌లో ఇరుక్కున్న కారుకి సంబంధించిన వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. ఇందులో మీరు గమనించ్చినట్లతే బీచ్‌లో ఇరుక్కున్న కారు Hyundai (హ్యుందాయ్) కంపెనీకి చెందిన ఐ20 కారు అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియదు.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

బీచ్‌లో ఇరుక్కుని చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఐ20 తనంతట తానుగా బయటకు రావడానికి ఆస్కారం లేదు. అయితే ఏదైనా ఇతర వాహనం సహాయంతో కారును బయటకు తీసుకురావాలి. ఈ కారుని బయటకు తీసుకువచ్చినప్పటికీ రిపేర్ చేయించడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టవలసి ఉంటుంది.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

బీచ్‌లో ఎటువంటి కారు అయినా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కారు డ్రైవర్ ఎంత సమర్థవంతంగా ఉన్నా, కారులో 4X4 డ్రైవ్ సిస్టమ్ ఉన్నప్పటికీ, సముద్రపు ఒడ్డు చాలా మెత్తగా ఇసుకతో ఉండటం వల్ల కారుని నడపడం అంత సులభమేమి కాదు. ఒకవేళ కారు ఇరుక్కుపోతే, సరైన సమయం సహాయం చేయడానికి ఇతరులు అందుబాటులో లేనట్లయితే సముద్రపు అలల కారణంగా కారు సముద్రంలోకి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

భారతదేశంలో ఇటువంటి డ్రైవింగ్ బీచ్‌లు చాలా ఉన్నాయి. ఇలాంటి బీచ్‌లో వాహనాలను చట్టబద్ధంగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇటువంటి బీచ్‌లు గట్టి ఇసుకను కలిగి ఉంటాయి, కావున సాధారణ బీచ్‌లో జరిగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కేరళలోని ముజప్పిలంగడ్ బీచ్ వాహనాలను డ్రైవింగ్ చేసుకోవడానికి అనుకూలమైన వాటిలో ఒకటి.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

ఇటువంటి బీచ్‌లో నిర్దేశించిన ఫీజు చెల్లించిన తర్వాత వాహనాలను బీచ్‌కు తీసుకెళ్లవచ్చు. అప్పుడు వారు ఆ వాహనాలను నడపవచ్చు. బీచ్‌లలో వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో మరియు మీరు అక్కడ డ్రైవింగ్ ఎందుకు మానుకోవాలో అర్థం చేసుకోవడం చాలా వసరం దీనికి బీచ్‌లో ప్రమాదానికి గురైన వాహనాలకు సంబంధించిన వీడియోలో చాలానే చూసి ఉంటారు. కావున వీలైనంతవరకు బీచ్‌లో డ్రైవింగ్ చేయడం మానుకోవాలి.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

బీచ్‌కి తీసుకెళ్లే ముందు ఆ వాహనాల సామర్థ్యాన్ని ముందుగా తెలుసుకోవాలి, ఎందుకంటే మార్కెట్లో లభ్యమవుతున్న అన్ని వాహనాలు ఆఫ్-రోడింగ్ చేయలేవు. కావున బీచ్‌లో డ్రైవింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. కారు యొక్క ఈ సామర్ధ్యం కారు డ్రైవ్‌ట్రెయిన్ డిజైన్ మరియు టైర్‌లపై ఆధారపడి ఉంటుంది.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

వాహనాలలో 4X4 డ్రైవ్ సిస్టమ్ ఉన్న వాహనాలు బీచ్‌లలో చిక్కుకోవు అనేది ఒక నమ్మకం ఉంటుంది. కానీ అత్యంత సమర్థవంతమైన వాహనాలుగా పరిగణించబడే 4x4 సిస్టం కలిగిన వాహనాలు కూడా బీచ్‌లలో చిక్కుకుపోతాయి. కావున వాహన పరిమితుల గురించి తెలుసుకోండి మరియు తెలియని ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

బీచ్‌కు వెళ్లేటప్పుడు ట్రాక్షన్ బోర్డులు లేదా రెస్క్యూ వాహనాన్ని తీసుకెళ్లడం మంచిది. లేకపోతే విపత్తులు సంభవించడం ఖాయం. ఈ ప్రమాదాల్లో చ్చిక్కుకుంటే ఊహకందని నష్టాలు కూడా జరగవచ్చు, కావున వాహనదారులు వీలైనంత వరకు బీచ్‌లో వాహనాలను డ్రైవ్ చేయకపోవడం ఉత్తమం.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

ఇలాంటి సంఘటన ఇటీవల కూడా వెలుగులోకి వచ్చింది. ఇందులో టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ బీచ్‌లో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది.

నివేదికల ప్రకారం, టయోటా ఫార్చ్యూనర్ డ్రైవర్ టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో బీచ్‌కు వెళ్లి సముద్రపు అలల మధ్య కారు కదులుతున్న వీడియోను షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫార్చ్యూనర్ కారు డ్రైవర్ దీన్ని చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వేవ్ వాహనం యొక్క ఎడమ వైపును తాకింది.

బీచ్‌లో కార్ డ్రైవ్ వెరీ డేంజర్.. గురూ; ఎందుకో వీడియో చూడండి

ఆ సమయంలో ఫార్చ్యూనర్ ఒకవైపుకి వాలిపోయింది. ఈ సమయంలో ఎడమ వైపు ముందు భాగంలో ఉన్న విండో గ్లాస్ మరియు మిర్రర్ పగిలిపోయాయి. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఫార్చ్యూనర్ ఇలాంటి చిక్కుల్లో పడితే, అంతకంటే తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ కార్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. కావున వాహనదారులు ఇలాంటి సంఘటనలకు పాల్పడకుండా ఉంటే చాలా మంచిది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Note: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన మొదటి నాలుగు ఫోటోలు తప్ప మిగిలిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
I20 car gets stuck in sea video goes viral details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X